Sunday, January 20

స్మార్ట్ ఫోన్ కొంటారా ? 10 రోజులు వెయిట్ చేయండి !!

కొత్త ఏడాది వచ్చింది కాదా... స్మార్ట్ ఫోన్ కొత్తది కొందామని ప్లాన్ చేశారా ? అయితే ఒక్క 10, 15 రోజులు ఆగండి... మీరు ఊహించని ధరల్లో స్మార్ట్ ఫోన్స్ ధరలు దిగివస్తున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి కొత్త ఈ-కామర్స్ fdi పాలసీ వస్తోంది. ఈ పాలసీ వచ్చాక మొబైల్ కంపెనీలు భారీ భారీ డిస్కౌంట్స్ ఇచ్చి పరిస్థితి ఉండదు. దాంతో ఇప్పటిదాకా కేవలం ఆన్ లైన్ లోనే అమ్మకాలు చేస్తూ భారీగా లాభాలు గడించిన మొబైల్ కంపెనీలకు పెద్ద షాక్ తగలబోతోంది. అందువల్ల ఇప్పటిదాకా ఉన్న తమ మొబైల్స్ ని వదిలించుకునేందుకు ప్లాన్ చేస్తున్నాయి కొన్ని దిగ్గజ కంపెనీలు. కొత్త ఈ-కామర్స్ పాలసీ అమల్లోకి వచ్చే ఫిబ్రవరి 1 కంటే ముందే తమ పాత సరుకు అమ్ముకునేందుకు భారీ డిస్కౌంట్స్ ప్రకటించబోతున్నట్టు సమాచారం. ఆసుస్, లెనోవో, రియల్ మీ, హానర్ లాంటి కంపెనీలు దసరా, దీపావళి పండగల సీజన్ లో 40 లక్షలకు పైగా ఇన్వెంటరీని ఆన్ లైన్ మార్కెట్లోకి దించాయి. అయితే వీటిల్లో 50శాతం కూడా అమ్ముడు పోలేదు. ఇవి అమెజాన్, ప్లిఫ్ కార్ట్ దగ్గరే ఉండిపోయాయి. దాంతో నిబంధనలు అమల్లోకి వచ్చేలోపే భారీ డిస్కౌంట్స్ తో వీటిని క్లియర్ చేసుకోవాలని భావిస్తున్నాయి ఈ కంపెనీలు. కొత్తగా వచ్చే విధానం ప్రకారం ఏ కంపెనీ అయినా తమ ఇన్వెంటరీని ఆన్ లైన్ లో 25శాతం వరకు మాత్రమే అమ్ముకునే అవకాశం ఉంటుంది.

అయితే ఆన్ లైన్ లోనే మొబైల్స్ అమ్ముతున్న వన్ ప్లస్ కి మాత్రం ఎలాంటి ఇన్వెంటరీ ఇష్యూస్ లేవంటున్నారు. డిమాండ్ కి తగ్గట్టుగానే మొబైల్స్ తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేస్తోంది వన్ ప్లస్. అందువల్ల ఆ కంపెనీ మొబైల్స్ తక్కువ రేటుకి వచ్చే ఛాన్స్ లేదు.