Wednesday, May 22

SI ఫైనల్స్ ప్రిలిమినరీ కీ రిలీజ్

తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి ఈనెల 20, 21ల్లో నిర్వహించిన SI ఫైనల్ ఎగ్జామ్స్ నాలుగు పేపర్ల ప్రాథమిక కీని రిలీజ్ చేసింది. www.tslprb.com వెబ్ సైట్ లో ఇవాళ సాయంత్రం నుంచి అందుబాటులోకి వచ్చాయి. అభ్యర్థులు లాగిన్ అయి తమకి ఇచ్చిన సెట్ ను బట్టి సమాధానాలు చెక్ చేసుకోవచ్చు. అలాగే ఈ ప్రాథమిక కీపై అభ్యంతరాలు ఉంటే... ఈనెల 28 సాయంత్రం 5 గంటల లోపు నిర్ణీత ఫార్మాట్ లో ఆన్ లైన్ లోనే తెలియజేయవచ్చు. జవాబులకు అభ్యంతరాలు తెలుపుతూనే దానికి సంబంధించి సపోర్ట్ డాక్యుమెంట్స్ లేదా మెటీరియల్ ను pdf/jpeg ఫార్మాట్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ప్రశ్నలకు విడి విడిగా అభ్యంతరాలు అప్లయ్ చేయాలి.

ఫైనల్ కీ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్క అభ్యర్థి జవాబు పత్రాలను స్కాన్ చేసి... వాళ్ళ అకౌంట్స్ లో పెడతామని TSLPRB ఛైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు.

ప్రెస్ నోట్
Preliminary Key release