వచ్చేవారంలోనే నోటిఫికేషన్ ! SI / కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ ఎలా ?

వచ్చేవారంలోనే నోటిఫికేషన్ ! SI / కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ ఎలా ?

Good News to Police jobs Aspirants....

వచ్చేవారంలోనే  పోలీస్ నోటిఫికేషన్ 

ఈసారి పక్కా ప్లానింగ్ తో చదవాలి... ! యూనిఫామ్ ఉద్యోగం సంపాదించాలి !!

యూనిఫామ్ ఉద్యోగాలు అంటే కేవలం శారీరక దారుఢ్య పరీక్షలే కాదు... రాత పరీక్షలకు కూడా చాలా ప్రాధాన్యత ఉంది. అందువల్ల మీరు ఎంత ఫిజికల్ ఫిట్ నెస్ ఉన్నా... రిటన్ టెస్టును మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు.  గతంలో జరిగిన రిక్రూట్ మెంట్స్ లో నూ ఇదే విషయం బయటపడింది.  80వేల పోస్టుల భర్తీలో భాగంగా ముందుగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 18 వేల పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.  ఇప్పటికే దీనికి సంబంధించిన ఫైల్ ముఖ్యమంత్రి kcr దగ్గరకు చేరింది.  ఇవాళ, రేపట్లో ఆ దస్త్రంపై సంతకం కాగానే... వచ్చే వారంలో పోలీస్ కొలువులకు నోటిఫికేషన్ ఇవ్వడానికి పోలీస్ ఉన్నతాధికారులు  సిద్ధమవుతున్నారు.

ఒకటి గుర్తు పెట్టుకోండి.... మీ ప్రిపరేషన్ లో ఎన్ని గంటలు చదివాం అన్నది ముఖ్యం కాదు... వాటిని ఎంతగా అర్థం చేసుకున్నాం అన్నదే ఇంపార్టెంట్.  అందుకే మీరు చదివిన తర్వాత... తప్పనిసరిగా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి.  అంటే తప్పనిసరిగా మాక్ టెస్టులు రాయాల్సిందే. బోర్డు ఫైనల్ ఎగ్జామ్ రాసేలోపు మీరు ఎన్ని ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేస్తారన్న దానిపై మీ విజయం ఆధారపడి ఉంటుంది. గతంలో విజేతలైన చాలామంది చెప్పిన సక్సెస్ మంత్ర ఇదే.

ఎస్ఐ/కానిస్టేబుల్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నవారు.. ఆ ఉద్యోగం ప్రాధాన్యతను తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఉద్యోగం రావడం వల్ల కలిగే ఆర్థిక, సామాజిక హోదా, గుర్తింపు లాంటి అంశాలను విశ్లేషించుకోవాలి. అప్పుడే మీలో పట్టుదల మరింత పెరుగుతుంది.  ఒక్క పోలీస్ ఉద్యోగాలే కాదు... ఏ కొలువుల విషయంలో అయినా... ఇలాగే మనసులో ఊహించుకోవాలి.  అప్పుడే మీ ప్రిపరేషన్ స్థాయి పెరుగుతుంది.  మీ లక్ష్యం మీ కళ్ళ ముందు కనిపిస్తుంది.

పోలీసు కావాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్న వారు తమ విద్యార్హత, శారీరకంగా ఉండాల్సిన అర్హతలను బట్టి ప్రిపరేషన్ మొదలుపెట్టాలి. చాలా మంది అభ్యర్ధులు తమకు ఈ అర్హతలు ఉన్నప్పటికీ ఎస్ఐ/కానిస్టేబుల్ ఉద్యోగాలపై దృష్టిపెట్టడం లేదు. యూనిఫామ్ ఉద్యోగాలకు ఏం వెళతాం లే....మనకి వస్తుందో రాదో... ఇలాంటి సందేహాలు మనసులో పెట్టుకుంటారు.  చాలామంది విద్యార్హతలో మంచి మెరిట్ ఉన్నా.. ఫిట్ నెస్ లో నెగ్గలేమో అనే అభిప్రాయం ఉంటుంది. ఇది అపోహ మాత్రమే. ఎలాంటి వారైనా సరే... రెండు నెలలపాటు ప్రతి రోజూ 2 గంటలు గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తే ఈవెంట్స్ ఈజీగా కొట్టేయచ్చు.

ఇక Physical Fitness  ఉండి, విద్యార్హతలు కూడా ఉన్నా... రిటన్ టెస్టులో సక్సెస్ కాలేమో అనే భయం మరికొందరిలో ఉంటుంది. అలా ఎందుకు భయపడతారు... అంటే... మ్యాథ్స్ బ్యాక్ గ్రౌండ్ లేకపోవడమే.  అర్థమెటిక్, రీజనింగ్ కి గురించి భయపడి కొందరు ఈ పోస్టులకు దూరంగా ఉంటున్నారు. అది తప్పు...సబ్జెక్ట్ ప్రిపేర్ అయితే ఎలాంటి ప్రాబ్లెమ్ ఉండదు. గత సిలబస్, గత ఎగ్జామ్ పేపర్స్ చూస్తే ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా... కేవలం విషయ ప్రాధాన్యత ఆధారంగానే ప్రశ్నలు ఇస్తున్నట్టు గమనించవచ్చు. గత ఐదారు ఎస్ఐ పరీక్షల్లో అడిగిన పరీక్షల సరళి గమనిస్తే అర్థమెటిక్ విభాగం నుంచి 100 మార్కులు వస్తున్నాయి.

వీటిల్లో :
బేసిక్ మ్యాథ్స్, క్షేత్రగణితం, సంఖ్యా వ్యవస్థ, సగటు, శాతాలు, లాభనష్టాలు, కాలం-పని, కాలం-దూరం లాంటి అంశాల నుంచి దాదాపు 70 మార్కులు వస్తున్నాయి. మిగిలిన అంశాల నుంచి 30 మార్కులు ఉంటాయి. కేవలం క్షేత్రగణితం నుంచే 12 నుంచి 20 ప్రశ్నలు అడుగుతున్నారు.

ఎస్ఐ/కానిస్టేబుల్ ఉద్యోగ సాధనలో అర్థమెటిక్, రీజనింగ్ పేపర్ ది కీలకపాత్ర. ఈ పేపర్ లో మ్యాథ్స్ విద్యార్థులకే ఎక్కువ మార్కులు వస్తాయనేది మాత్రం అపోహే అంటున్నారు నిపుణులు.  గతంలో జరిగిన పోలీస్ పరీక్షలు చూస్తే... 10వ తరగతి స్టాండర్డ్ మాత్రమే వచ్చాయి. అందువల్ల మ్యాథ్స్ బ్యాక్ గ్రౌండ్ లేని వారు ఎట్టి పరిస్థితుల్లో భయపడొద్దు. ఈ ఎగ్జామ్స్ లో అడిగే విషయాలన్నీ పాఠశాల స్థాయిలో చదివే ఉంటాం. అందువల్ల మరోసారి ప్రాక్టీస్ చేయడంతో పాటు Short-cuts నేర్చుకుంటే... ఎక్కువ మార్కులు ఈజీగా తెచ్చుకోవచ్చు. సంఖ్యా వ్యవస్థ, చక్రవడ్డి, బారువడ్డి, నిష్పత్తి, అనుపాతం, సగటు, శాతాలు, లాభం, నష్టాలు, కాలం-పని, కాలం-దూరం, పని-వేతనాలు, భాగస్వామ్యం, క్షేత్రగణితం, గడియారాలు, క్యాలండర్ లాంటి అంశాలపైనా దృష్టి పెట్టాలి.

ఎగ్జామ్ పేపర్స్ అనేవి...అభ్యర్థుల Basic Knowledgeని పరీక్షించేవిగా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. అంటే కేవలం 10వ తరగతి వరకు చదివిన సబ్జెక్టుల్లోని అంశాలపై అభ్యర్ధులకు ఉన్న అవగాహన, విషయం పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు. దీనికి అదనంగా రీజనింగ్ ఉంటుంది. దీంతో ఉద్యోగార్థుల మెంటల్ ఎబిలిటీని పరీక్షిస్తారు. ఈ విభాగంలో వచ్చే అన్ని ప్రశ్నలు సాధారణ స్థాయి విద్యార్థులు సాల్వ్ చేసేవిగానే ఉంటాయి.  అందువల్ల మ్యాథ్స్, సైన్స్, సోషల్ సబ్జెక్టుల్లో దేనికి చెందినవారైనా అన్ని విషయాలపై పట్టు సాధిస్తే... ఉద్యోగం సాధించవచ్చు.

మీరు యూనిఫామ్ కొలువు కొట్టాల్సిందే !!

పోలీస్ ఉద్యోగాలు కానిస్టేబుల్స్, సబ్ ఇన్సెపెక్టర్స్ ఉద్యోగాలకు మేం Telangana Exams Plus యాప్ లో ప్రత్యేక కోర్సులు నిర్వహిస్తున్నాం.    గతంలో చాలామంది మా కోర్సు ఫాలో అయ్యి  కానిస్టేబుల్స్ /SI ఉద్యోగాలు పొందారు.  ఇంత భారీ సంఖ్యలో వస్తున్న నోటిఫికేషన్ ను మీరు ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు.  ఇప్పటికే 500కు పైగా టెస్టులు పోస్ట్ చేశాం.  ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్ దాకా  అప్ డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి.   కొత్త టెస్టులు యాడ్ అవుతుంటాయి.  ఈసారి Sub Inspectors పోస్టులకు Group.2 స్టాండర్డ్ లో ప్రశ్నలు ఇస్తున్నాం.  అందువల్ల  వెంటనే పోలీస్ కానిస్టేబుల్, Sub Inspectors కోర్సుల్లో జాయిన్ అవ్వండి.

Telangana Exams plus యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో store లో  కోర్సులు ఉంటాయి.  ఇప్పుడు హోలీ ఆఫర్లు నడుస్తున్నాయి. వెంటనే కోర్సుల్లో జాయిన్ అవ్వగలరు.

https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp

TS పోలీస్, TSPSC కొత్త బ్యాచ్ లు స్టార్ట్ !

http://telanganaexams.com/tspsc-ts-police-new-batches-start-huge-discounts/

ఆల్ ద బెస్ట్....

మేడుకొండూరు విష్ణుకుమార్, సీనియర్ జర్నలిస్ట్