గొర్రెల పెంపకం

1) గొర్రెల పంపిణీ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ ప్రారంభించారు ?
జ: గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాకలో
2) తెలంగాణ ప్రభుత్వం వచ్చే రెండేళ్లలో నాలుగు లక్షల యాదవ కుటుంబాలకు ఎన్ని లక్షల గొర్రెలను పంపిణీ చేయాలని నిర్ణయించింది ?
జ: 84 లక్షల గొర్రెలను
3) గొర్రెల అభివృద్ధి సహకార సంఘంలో నమోదు చేసుకున్న ప్రతి అర్హత గల కుటుంబాలకు ఎంత శాతం సబ్సిడీతో సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: 20 గొర్రెలు, ఒక పొట్టేలును 75 శాతం సబ్సిడీపై
4) ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకి ఎన్ని లారీల గొర్రెలు దిగుమతి అవుతున్నాయి ?
జ: 600 లారీలు
5) ఒక్కో లబ్దిదారుడికి ఎంత మొత్తం గొర్రెలు, పొట్టేలు ఇవ్వనున్నారు ?
జ: రూ.1.25 లక్షల యూనిట్ విలువ
6) రాష్ట్రంలో ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సొసైటీలు ఎన్ని ఉన్నాయి ?
జ: 7,840 (సభ్యులు: 7,36,836)
7) గొర్రెల పంపిణీ కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్న యాదవులు ఎంతమంది ?
జ: 6,84,559
(నోట్: తొలివిడత 2017 లో 3,42,319 కుటుంబాలకు, రెండో విడత 3,42,196 మంది లబ్దిదారులకు గొర్రెల పంపిణీ చేస్తున్నారు)
8) గొర్రెల మేత కష్టాలను తీర్చేందుకు ఏ రకానికి చెందిన గడ్డిన పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది?
జ: ఆస్ట్రేలియన్ రకానికి చెందిన స్టైలో హెమటా గడ్డి
9) గొర్రెల పెంపకందారులకు ఎక్స్ గ్రేషియాను లక్ష నుంచి ఎంతకు పెంచారు ?
జ: రూ. 6 లక్షలు