మొదటి ఆర్టికల్ లో 2026 నాటికి 10 లక్షల ఉద్యోగాలు సెమీ కండక్టర్స్ (Semi conductors) రంగంలో రెడీగా ఉన్నాయని చెప్పుకున్నాం… సెమీ కండక్టర్స్ ఉపయోగం… కేంద ప్రభుత్వం ఆ రంగానికి అందిస్తున్న ప్రోత్సాహకాలు… టాటా సన్స్ లోనే 5 లక్షల ఉద్యోగాలు అవసరమని చంద్రశేఖరన్ చెప్పిన అంశాన్ని కూడా వివరించాను.
ఎవరైనా ఆ ఆర్టికల్ చూడకపోతే చూడండి... లేకపోతే ఈ వీడియో అర్థం కాదు… సెమీ కండక్టర్స్ రంగానికి ఎందుకంట క్రేజ్ ఉందో అర్థమవుతుంది. మనం ఈ ఆర్టికల్ లో .. సెమీ కండక్టర్స్ రంగంలో ఉద్యోగాలు తెచ్చుకోవాలంటే యువత ఏం చేయాలి… ఏ కోర్సులు చదవాలి… ఎందులో శిక్షణ పొందాలి… కోర్సులు, శిక్షణ అందిస్తున్న సంస్థలు ఇండియాలో ఉన్నాయి… వాటి వివరాలను అందించబోతున్నాను. ఈ రంగంలో ఏడాదికి 40 లక్షల నుంచి కోటి రూపాయల దాకా శాలరీస్ తీసుకునే ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఆ డిటైల్స్ చెబుతాను.
ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ (AI Technology) మంచి దూకుడు మీద ఉన్నప్పటికీ… సెమీకండక్టర్స్ రంగానికి మాత్రం మస్తుగా డిమాండ్ ఉంది. ఈ రంగంలో రాబోయే రెండేళ్ళల్లో 10 లక్షల మంది నిపుణులు అవసరం ఉంది. కంప్యూటర్ టెక్నాలజీ, డిజైన్ ఇండస్ట్రీ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే… మీకు కొలువు గ్యారంటీ.
సెమీ కండక్టర్ డిజైనింగ్,(Designing) ఫ్యాబ్రికేషన్ (Fabrication), ATMP అంటే… అసెంబ్లింగ్ (Assembling), టెస్టింగ్… మార్కింగ్… ప్యాకేజింగ్, సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్, సిస్టమ్ సర్క్యూట్స్, సప్లయ్ సిస్టమ్, క్వాలిటీ కంట్రోల్ లాంటి విభాగాల్లో ఉద్యోగాలు వస్తాయి.
అర్హతలు ఏంటి ?
ఈ రంగంలో ఉద్యోగం సంపాదించాలంటే కనీసం డిగ్రీ లేదా బీటెక్ పాసై ఉండాలి. కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్, అప్లయిడ్ ఫిజిక్స్ లాంటి విభాగాల్లో చదివిన వారికి మంచి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా కెమికల్ ఇంజినీరింగ్, మెటిరియల్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లాంటి విభాగాల్లో డిగ్రీ, బీటెక్ చేసిన వారికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఇంకా కొన్ని చోట్ట మాన్యుఫాక్చరింగ్ టెక్నీషియన్ పోస్టులు కూడా ఉన్నాయి. వీటికి డిప్లొమా చదవితే చాలు. ఇంకా కొన్నింటికి మాస్టర్స్ డిగ్రీ అంటే పీజీ కూడా అవసరమవుతుంది.
కొలువు కావాలంటే ఈ స్కిల్స్ మస్ట్
మేథమెటికల్ స్కిల్స్, డేటా అనాలసిస్ ప్రాసెసింగ్, టెక్నికల్ అండర్ స్టాండింగ్, ప్రాబ్లెమ్ సాల్వింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఫిజిక్స్, మెటీరియల్ సైన్స్, కెమిస్ట్రీ లాంటి సబ్జెక్టుల్లో సైంటిఫిక్ నాలెడ్జ్, లాబ్ ఎక్స్ పీరియన్స్, టైమ్ మేనేజ్ మెంట్ స్కిల్స్, స్టాటిస్టిక్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. మొత్తానికి మల్టీ టాస్కింగ్ చేయగలిగే స్కిల్స్ ఉన్నవాళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయి.
ఇప్పుడు మీరు నేను చెప్పిన కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్, అప్లయిడ్ ఫిజిక్స్, మెటీరియల్ సైన్స్, IT, కెమికల్ ఇంజినీరింగ్ లాంటి విభాగాల్లో చదువుతున్న వాళ్ళయితే… మీరు ఇంటర్నషిప్స్ కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టండి. కోర్సరా లాంటి సంస్థల్లో సర్టిఫికేషన్ కోర్సులు చేయడం బెటర్.
సెమీకండర్ ఇంజినీరింగ్ లో బీటెక్ చేయడానికి D Y Patil International University, Akurdi Pune లో అవకాశం ఉంది. ఈ కింద లింక్ ద్వారా ఆ సంస్థ వెబ్ సైట్ లో వివరాలు చూడవచ్చు.
https://www.dypiu.ac.in/b-tech-semiconductors
మీ అందరికీ కోర్సెరా తెలుసు కదా…
అందులో సెమీ కండక్టర్స్ కి సంబంధించి అనేక certified కోర్సులను అందిస్తోంది. Semi conductors devices తో పాటు ప్యాకేజింగ్, మానుఫ్యాక్టరింగ్, మెటీరియల్ సైన్స్ లాంటి వాటిల్లో సర్టిఫికెట్ కోర్సులు అందిస్తోంది.
పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి
https://www.coursera.org/courses?query=semiconductor
శాలరీస్ అదుర్స్
సెమీ కండక్టర్ట సెక్టార్ లో హైయ్యస్ట్ శాలరీ పెయిడ్ మూడు జాబ్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చెబుతాను.
టెస్ట్ టెక్నీషియన్లకు ఏడాదికి 55 వేల డాలర్లు అంటే దాదాపు 50 లక్షల రూపాయల ప్యాకేజీతో ఉద్యోగాలు ఉన్నాయి.
ఫీల్డ్ సర్వీస్ ఇంజినీర్లుకు 69 వేల డాలర్లు అంటే దాదాపు 60 లక్షల రూపాయల ప్యాకేజీతో ఉద్యోగాలు…. ఇంటిగ్రేషన్ ఇంజినీర్లు అయితే ఏకంగా 1లక్షా 8 వేల డాలర్లు… 91 లక్షల రూపాయల దాకా శాలరీస్ ఉన్నాయి.
మన దేశంలోనే కాదు… సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో పట్టు సంపాదిస్తే… విదేశాల్లో కూడా ఉద్యోగాలు ఉన్నాయి. లక్షలు, కోట్ల రూపాయల ప్యాకేజీలు ఇచ్చేందుకు కంపెనీలు రెడీగా ఉన్నాయి. మనం ముందు చెప్పుకున్నట్టు నిపుణుల కొరత బాగా ఉంది. దాన్ని క్యాష్ చేసుకోవాలి… మనం లైఫ్ లో పక్కాగా స్థిరపడాలి అనుకుంటే… ఇలాంటి ఇండస్ట్రీ మీద గ్రిప్ సంపాదించాలి… అందుకోసం ఇప్పటి నుంచే ఏం చదవాలి… ఎక్కడ ఉద్యోగం సంపాదించాలి అన్న దానిపై దృష్టి పెట్టండి.
ఆల్ ది బెస్ట్….