G-948507G64C

Semi Conductors : 2026 నాటికి 10 లక్షల ఉద్యోగాలు – మీకు గ్రిప్ ఉందా ?

టాటా గ్రూప్ ద్వారా వచ్చే ఐదేళ్ళల్లో 5 లక్షల ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నామని … ఆ మధ్య టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖర్ ప్రకటించారు. దాంతో ఏంటీ 5 లక్షల కొలువులా అని అందరూ ఆశ్చర్యపోయారు. 5 కాదు… 2026 నాటికి 10 లక్షల మంది నిపుణులు సెమీ కండక్టర్స్ (Semi conductors) రంగానికి అవసరం ఉంది.

ఈ సెమీ కండక్టర్స్ రంగంలో… ఇంజినీర్లు, టెక్నీషియన్లకు ఫుల్లుగా డిమాండ్ ఉంది. సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ లో (Semi conductor fabrication) 3 లక్షల ఉద్యోగాలు, ATMP లో అంటే… అసెంబ్లింగ్… టెస్టింగ్… మార్కింగ్… ప్యాకేజింగ్ లో మరో 2 లక్షల కొలువులు రాబోతున్నాయి. ఇవి కాకుండా చిప్ డిజైన్ (Chip design), సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్, సిస్టమ్ సర్క్యూట్స్, సప్లయ్ సిస్టమ్ లాంటి విభాగాల్లో మరో 5 లక్షల కొలువులు మన దేశంలోని యువతకు రాబోతున్నాయి. అసలు ఏంటి సెమీ కండక్టర్స్ సెక్టార్… 10 లక్షల ఉద్యోగాలు దొరికే పరిస్థితి నిజంగా ఉందా ? అన్నది ఈ ఆర్టికల్ లో చూద్దాం

ఇలాంటి Career development articlesను ఇక నుంచి మన Telangana Exams website lo చూడొచ్చు. మీకు ఏదైనా రంగంలో ఆసక్తి ఉంటే… కామెంట్ రూపంలో అడగండి దాని మీద సమాచారం అందిస్తాం. అలాగే మన Telangana Exams YT channel ను subscribe చేసుకోండి…

సెమీ కండక్టర్స్ సెక్టార్ మొత్తం 2 ఆర్టికల్స్ ఉంటాయి.

1) అసలు సెమీ కండక్టర్స్ అంటే ఏంటి ? ఈ రంగానికి ఎందుకు డిమాండ్ పెరిగింది

2) ఈ రంగంలో ఉద్యోగాలు సాధించాలంటే ఏం అర్హతలు కావాలి… ఏయే యూనివర్సిటీలో కొత్తగా చదువుకోవాలి… అంటే సెమీ కండక్టర్స్ కి సంబంధించి కోర్సులు అందిస్తున్న యూనివర్సిటీల వివరాలతో మరో ఆర్టికల్ ఇస్తాను.

సెమీ కండక్టర్స్ అనేవి మనకు నిత్య జీవితంలో వాడుతున్న స్మార్ట్ ఫోన్, కంప్యూటర్, డిజిటల్ కెమెరా… వాషింగ్ మిషన్, కార్లు… ఇలా ప్రతి ఎలక్ట్రానిక్ సాధనంలోనూ వీటి ఉపయోగం ఉంది. మనిషికి గుండె ఎలా అవసరమో… ఎలక్ట్రానిక్ వస్తువులు పనిచేయడానికి చిప్ తయారీ వ్యవస్థ… సెమీ కండక్టర్స్ అంత ఉపయోగం.

ప్రపంచంలో ప్రతి యేటా వెయ్యి కోట్ల సెమీ కండక్టర్స్ అమ్మకాలు జరుగుతుంటే… వాటిల్లో 10శాతం ఇండియాలోనే ఉపయోగిస్తున్నారు. మనం చైనా, సింగపూర్, హాంకాంగ్, వియత్నాం, థాయ్ లాండ్ దేశాల నుంచి ఈ చిప్స్ దిగుమతి చేసుకుంటున్నారు. చాలా యేళ్ళ పాటు యుద్దాలతో దెబ్బతిన్న వియత్నాం ఇప్పుడు సెమీ కండక్టర్ల తయారీలో రారాజుగా ఉంది.

మీకు గుర్తుందో లేదో… కరోనా టైమ్ కార్లు తయారీ ఆగిపోయింది. ఆ టైమ్ లో విదేశాల్లో చిప్స్ తయారీ నిలిచిపోయింది. దాంతో మన దగ్గర తయారయ్యే ఆటోమేటెడ్ కార్లు అన్నింటిలో సెమీ కండక్టర్స్ అవసరం కాబట్టి… మన దగ్గర కార్ల ఉత్పత్తి నిలిచిపోయింది… బుకింగ్ స్లాట్స్ కూడా 6 నెలలకు మించి పోయాయి. అంటే ఇవాళ మనం కారు ఆర్డర్ చేస్తే 6 నెలలకు దొరికే పరిస్థితి ఏర్పడింది. అందుకే మన గవర్నమెంట్ మేకిన్ ఇండియాలో భాగంగా సెమీ కండక్టర్స్ తయారీ రంగంపై దృష్టి పెట్టింది. అసోంలో దీని తయారీ ప్లాంట్ రెడీ అవుతోంది. ఇక్కడ ఈవీలు, బ్యాటరీల తయారీని టాటా సంస్థ చేపడుతోంది. సెమీ కండక్టర్ పరిశ్రమలో ప్రత్యక్ష ఉద్యోగాలతో పాటు పరోక్షంగా కూడా చాలా మందికి ఉపాధిని అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పరిశ్రమల ఏర్పాటు PLI స్కీమ్ ద్వారా ప్రోత్సాహకాలు అందిస్తోంది.

యువతకు ఎలాంటి ఉద్యోగాలు  ?

డిజైనింగ్, మాన్యుఫాక్చరింగ్ … ఈ రెండు విభాగాల్లో యువతకు కొలువులు ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో తయారవుతున్న సెమీ కండక్టర్లలో 20శాతం వాటికి డిజైనింగ్ మన భారత్ లోనే జరుగుతోంది. ఇక మన దగ్గర తయారీ యూనిట్లు అందుబాటులోకి వస్తే డిజైనింగ్ పరిశ్రమలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. లక్షల మంది ఉద్యోగాలు వస్తాయి. ప్రపంచంలో అత్యధిక సెమీ కండక్టర్లకు డిజైన్ చేసే కంపెనీల్లో ఒకటైన ఇంటెల్ మన దేశంలోనే ఉంది. ఇది కాకుండా టాటా, మాస్ చిప్, LXC, విప్రో లాంటి సంస్థలు కూడా డిజైనింగ్ మీద concentration చేస్తున్నాయి.  డిజైనింగ్ తో పాటు సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్, ATMP లో అంటే… అసెంబ్లింగ్… టెస్టింగ్… మార్కింగ్… ప్యాకేజింగ్, సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్, సిస్టమ్ సర్క్యూట్స్, సప్లయ్ సిస్టమ్ లాంటి విభాగాల్లో ఉద్యోగాలు వస్తాయి.

ఎందులో ట్రైనింగ్ పొందాలి ?

మెటీరియల్స్ ఇంజినీరింగ్, క్వాలిటీ కంట్రోల్ లాంటి విభాగాల్లో ట్రైనింగ్ పొందిన ఇంజినీర్లు, ఆపరేటర్లు, టెక్నీషియన్లు లక్షల మంది అవసరం ఉన్నట్టు టాలెంట్ సొల్యూషన్స్ సంస్థ SLB సర్వీసెస్ చెబుతోంది.
సెమీ కండక్టర్ వేఫర్ ఇన్సె పెక్టర్లు, టెక్నికల్ స్పెషలిస్టులు, డిజైన్ ఇంజినీర్లు, ప్రాసెస్ ఇంజినీర్లు, క్వాలిటీ కంట్రోల్ స్పెషలిస్టులు మొదలైన ఉద్యోగాలు కీలకంగా మారుతాయి. సెమీకండక్టర్స్ పరిశ్రమ బాగా విస్తరించే ఛాన్సు ఉంది… 2026 నాటికి 10 లక్షల ఉద్యోగాలు వస్తాయని SLB చెబుతున్నా… అందుకు తగినంత మంది నిపుణులు మాత్రం లేరు….

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సెమీ కండక్టర్ సెక్టార్ ప్రోత్సాహానికి నిధులు కేటాయిస్తోంది. భారత్ కంపెనీలకు టెక్నికల్ అసిస్టెంట్స్ ఇచ్చేందుకు తైవాన్, అమెరికా, జపాన్ లోని కంపెనీలతో ఇండియన్ గవర్నమెంట్ MOU లు కూడా కుదుర్చుకుంటోంది. కాబట్టి ఈ రంగంలో ఉద్యోగాలు భారీ ఎత్తున రాబోతున్నాయి అన్నది హండ్రెడ్ పర్సంట్ కరెక్ట్.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) వచ్చేసింది… సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు పోతాయి… అన్నీ మిషన్లే చేస్తాయి అని టాక్ నడుస్తున్న ఈ టైమ్ లో నిజంగా సెమీ కండక్టర్ పరిశ్రమ యువతకు మంచి అవకాశాలు కల్పిస్తోంది. సో… ఈ పరిశ్రమలో ట్రైనింగ్ అవడానికి యూత్ సిద్ధమై పోవాలి.. గుర్తుండి కదా…. 2026 నాటికి 10 లక్షల ఉద్యోగులు అవసరం ఉన్నారు. అందులో మీరూ ఒకరు కావాలంటే… మీకు ఎలాంటి అర్హతలు ఉండాలి… ఏయే యూనివర్సిటీలు స్కిల్డ్ కోర్సులు అందిస్తున్నాయి… లాంటి డిటైల్స్ నెక్ట్స్ ఆర్టికల్ లో ఇస్తాను.

READ THIS ALSO : Semi Conductors : 2026 నాటికి 10 లక్షల ఉద్యోగాలు – మీకు గ్రిప్ ఉందా ?

Hot this week

ఉద్యోగాల పేరుతో భారీ మోసం: 24 లక్షలు టోకరా

కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ సోషల్ మీడియాలో వచ్చే మెస్సేజ్...

SBI Clerks: 13,735 పోస్టుల Notification

State Bank of Indiaలో Junior Associate (Customer support &...

అంతర్జాతీయ సూచీలు (World Indexes 2024)

ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కూడా ప్రపంచ సూచీలకు సంబంధించి ప్రశ్నలు...

మార్చి కల్లా అన్ని TGPSC Groups Results

TGPSC Groups Results: 2025 మార్చి నాటికి ఇప్పటివరకూ జరిగిన అన్ని...

సెంట్రల్ వేర్ హౌజింగ్ లో ఉద్యోగాలు

ప్రభుత్వ సంస్థ అయిన Central Warehousing Corporation లో వివిధ రకాల...

Topics

ఉద్యోగాల పేరుతో భారీ మోసం: 24 లక్షలు టోకరా

కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ సోషల్ మీడియాలో వచ్చే మెస్సేజ్...

SBI Clerks: 13,735 పోస్టుల Notification

State Bank of Indiaలో Junior Associate (Customer support &...

అంతర్జాతీయ సూచీలు (World Indexes 2024)

ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కూడా ప్రపంచ సూచీలకు సంబంధించి ప్రశ్నలు...

మార్చి కల్లా అన్ని TGPSC Groups Results

TGPSC Groups Results: 2025 మార్చి నాటికి ఇప్పటివరకూ జరిగిన అన్ని...

సెంట్రల్ వేర్ హౌజింగ్ లో ఉద్యోగాలు

ప్రభుత్వ సంస్థ అయిన Central Warehousing Corporation లో వివిధ రకాల...

NIT Warangal లో 56 ఉద్యోగాలు

వరంగల్ లోని National Institute of Technology (NIT) డైరెక్ట్ /...

BEL Jobs : Project Engineers

ఇండోర్ లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) లో తాత్కాలిక ప్రాతిపదికన...

Jobs: New India లో 500 అసిస్టెంట్ పోస్టులు, 40K Salary

న్యూఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లో 500 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి...
spot_img

Related Articles

Popular Categories