తెలంగాణలో అన్ని విద్యా సంస్థలు బంద్

తెలంగాణలో అన్ని విద్యా సంస్థలు బంద్

తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 24 (బుధవారం) నుంచి అన్ని విద్యా సంస్థలను బంద్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. స్కూళ్ళు, కాలేజీలు అన్నింటినీ తాత్కాలికంగా మూసివేయనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, గురుకుల స్కూళ్ళు, హాస్టళ్ళకు అన్నింటికీ ఈ ఆదేశాలు వర్తిస్తాయని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇకపై ఆన్ లైన్ లోనే విద్యార్థులకు క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే తమిళనాడు, ఛత్తీస్ గడ్, పంజాబ్ లాంటి రాష్ట్రాలు బంద్ చేశాయి... మన రాష్ట్రంలో కూడా విద్యాసంస్థల్లో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని సబితా ఇంద్రా రెడ్డి తెలిపారు.  మెడికల్ కాలేజీలు తప్ప అన్ని విద్యాసంస్థలను బంద్ చేస్తున్నారు.