SBI లో 5 వేల క్లర్క్ ఉద్యోగాలు: హైదరాబాద్ సర్కిల్ లో 275 పోస్టులు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లో జూనియర్ అసోసియేట్ క్లర్క్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేసన్ విడుదలైంది. దేశమంతటా 5000 పోస్టులను భర్తీ చేస్తుండగా... హైదరాబాద్ సర్కిల్ లో 275 కొలువులు ఖాళీగా ఉన్నాయి.
అర్హతలు ఏంటి ?
డిగ్రీ పూర్తి చేసి ఉండాలి లేదా డిగ్రీ చిరవి సంవత్సరం /సెమిస్టర్ చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వీళ్ళు 2021 ఆగస్ట్ 16 లోపు డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి
వయస్సు:
2021 ఏప్రిల్ 1 నాటికి 20-28 యేళ్ళ మధ్య వయస్సు ఉండాలి
ఎంపిక విధానం ఎలా ఉంటుంది ?
అభ్యర్థులను ఆన్ లైన్ పద్దతిలో రెండు దశల్లో (Prelims & Mains) నిర్వహించే ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ ద్వారా ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో పాసైన వారిలో పోస్టుల సంఖ్యకు 10 రెట్లు అభ్యర్థులు (దాదాపుగా 50 వేల మంది)ను మెయిన్స్ కు అర్హత కల్పిస్తారు. మెయిన్స్ లో వచ్చిన మార్కుల ఆధారంగా ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. (ఫైనల్ సెలక్షన్ లో ఈ మార్కులను లెక్కలోకి తీసుకోరు )
ప్రాంతీయ భాషా పరీక్ష
అభ్యర్థులు తాము ఎంచుకున్న రాష్ట్రం లేదా ప్రాంతానికి చెందిన ప్రాంతీయ భాష పరీక్షలో కూడా ఉత్తీర్ణులు కావాలి. అభ్యర్థులు 10 లేదా 12వ తరగతి(ఇంటర్) లో ఆ భాషను ఒక సబ్జెక్ట్ గా చదివి ఉంటే ప్రాంతీయ భాషా పరీక్ష రాయనక్కర్లేదు. ఆ సబ్జెక్ట్ చదివినట్టుగా తెలిపే సర్టిఫికెట్ submit చేయాలి.
దరఖాస్తు ఫీజు :
రూ.750 (జనరల్/OBC/EWSకు మాత్రమే)
పరీక్ష తేది:
ప్రిలిమినరీ : 2021 జూన్,
మెయిన్స్ 31.07.2021
పూర్తి వివరాలకు WEBSITE : https://ibpsonline.ibps.in/sbijascapr21/
పరీక్షా విధానం
ప్రిలిమ్స్:
ఇంగ్లీష్ లాంగ్వేజ్ : 30 ప్రశ్నలు, 30 మార్కులు, 20 నిమిషాలు
న్యూమరికల్ ఎబిలిటీ : 35 ప్రశ్నలు, 35 మార్కులు, 20 నిమిషాలు
రీజనింగ్ ఎబిలిటీ : 35 ప్రశ్నలు, 35 మార్కులు, 20 నిమిషాలు
మొత్తం : 100 ప్రశ్నలు, 100 మార్కులు, 60 నిమిషాలు
మెయిన్స్
జనరల్/ఫైనాన్స్ అవేర్నెస్ : 50 ప్రశ్నలు, 50 మార్కులు, 35 నిమిషాలు
జనరల్ ఇంగ్లీష్ : 40 ప్రశ్నలు, 40 మార్కులు, 35 నిమిషాలు
రీజనింగ్ ఎబిలిటీ & : 50 ప్రశ్నలు, 50 మార్కులు, 45 నిమిషాలు
కంప్యూటర్ ఆప్టిట్యూడ్:
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ : 50 ప్రశ్నలు, 50 మార్కులు, 45 నిమిషాలు
మొత్తం : 190 ప్రశ్నలు, 200 మార్కులు, 160 నిమిషాలు
జీత భత్యాలు:
రూ.19,900 బేసిక్ పే ఉంటుంది. ముంబైలాంటి మెట్రో నగరాల్లో అన్ని అలవెన్సులతో కలిపి ప్రారంభంలోనే రూ.29 వేల దాకా పొందే అవకాశం ఉంది.
పూర్తి వివరాలకు ఈ నోటిఫికేషన్ చూడండి