శాతవాహనులు – 2

1) స్థూపాలు, డోమ్ కట్టడాలు ఎవరు ప్రవేశపెట్టారు?
జ: బౌద్దులు
2) బౌద్ధ సన్యాసులు, సన్యాసినుల నివాస కేంద్రాలు లేదా విశ్రాంతి మందిరాలు ఏవి?
జ: విహారాలు
3) తెలంగాణలోని బౌద్ధస్థూపాలన్నీ ఏ స్థూపానికి నమూనాలు?
జ: సాంచి స్థూపం
4) శాతవాహనులు ఏ నాణేలు ముద్రించారు?
జ: సీసం, ప్లాటినం, రాగి, వెండి నాణేలు
5) గౌతమీ పుత్ర శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణిల వెండినాణేలు ఎక్కడ లభించాయి?
జ: కొల్షాపూర్, జుగల్తంబిల్లో
6) వెండినాణేలు, బంగారు నాణేలను ఏమని పిలిచేవారు?
జ: కార్షాపణాలు, సువర్ణాలు
7) శాతవాహనుల కాలంలో ఒక బంగారు నాణెం విలువ ఎంత?
జ: 35 వెండి నాణేలకు సమానం
8) గౌతమీ పుత్ర శాతకర్ణి కాలం నుంచి వెండి నాణేలపై ఏ భాషలుండేవి?
జ: ప్రాకృతం, దేశీ భాషలు
9) ఎవరు వర్ణ సంకరాన్ని నిరోధించారని నాసిక్ శాసనం తెలుపుతోంది?
జ: గౌతమీపుత్ర శాతకర్ణి
10) ఏ చర్మకారుడు కుటుంబంతో కలిసి వచ్చి అమరావతి స్థూపానికి పూర్ణకుంభం బహుకరించి శాసనం వేయించాడు?
జ: ఢిమిక
11) శాతవాహనుల కాలంలో ప్రత్యేక సౌకర్యాలు అనుభవించిన వారెవరు ?
జ: బ్రాహ్మణులు
12) క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఏమి చేసేవారు?
జ: పన్నుల వసూళ్లు (క్షత్రియులు), భూయజమానులు (వైశ్యులు) వీళ్లందరికీ సేవలు చేసేది :శూద్రులు
13) నృత్యకారిణులు ఏ పూతను వాడేవారు?
జ: ఆరదళం అనే పై పూతను వాడేవారు
14) గౌతమీపుత్ర శాతకర్ణి తో ఏ సాంప్రదాయం మొదలైంది ?
జ: తమ పేర్లకు తల్లుల పేర్లు ధరించే సాంప్రదాయం
15) అశోకుడి మనవడు జైన విహారన్ని ఎక్కడ నిర్మించారు?
జ: అమరావతి దగ్గర వడ్డెపోను కొండపై
16) అశోకుడి మనువడిని ఏమంటారు?
జ: జైన అశోకుడు
17) గుంటుపల్లి గుహలు ఎవరివి?
జ: జైనులవి
18) సుప్రసిద్ద జైనాచార్యుడు కొండ కుందాచార్యుడు ఏ గ్రంధం రాశాడు?
జ: సమయ పాఠం
19) బౌద్దులకు దానధర్మాలు చేసింది ఎవరు?
జ: గౌతమీపుత్ర శాతకర్ణి, అతని కుమారుడు పులోమావి
20) చైత్యకవాద శాఖ స్థాపకుడు ఎవరు?
జ: మహాదేవ భిక్షువు
21) ఎక్కడ గొప్ప విశ్వవిద్యాలయాలు ఉండేవి?
జ: నాగార్జునకొండ, ధాన్యకటకాల్లో
22) ఏ విశ్వవిద్యాలయం ఆధారంగానే లసాలోని విశ్వవిద్యాలయాన్ని నిర్మించారు?
జ: ధాన్యకటక విశ్వవిద్యాలయ నమూనా
23) కాతంత్ర వ్యాకరణం అనే సంస్కృత వ్యాకరణ గ్రంధాన్ని ఎవరు రచించారు?
జ: శర్వ వర్మ
24) భారత్ లో మొదటి పూర్తి సంస్కృత శాసనం ఏది?
జ: శక రుద్రరాముడిది
25) బుద్ధుడి దేవాలయంఎక్కడ ఉన్నది?
జ: గుంటుపల్లిలో
26) ఆంధ్రదేశంలో ఎన్ని సంఘారావాలు ఉన్నాయి?
జ: 40
27) శ్రీపర్వతంపై ఎవరి విహారం నిర్మించారు?
జ: యజ్ఞశ్రీ శాతకర్ణి 7 అంతస్తుల విహారం
28) అమరావతి స్థూపాన్ని ఎవరు కనుగొన్నారు ?
జ: కల్నల్ మెకంజీ 1797లో
29) ఈ శిథిలాల్లోనే ఏ తెలుగు పదం ఉన్న రాతిఫలకం దొరికింది?
జ: నాగబు
30) కామర్దక వంశ స్ధాపకుడు వాశీష్టపుత్ర పులోమావి సమకాలీనుడు అని తెలిపిన విదేశీ రచయిత ఎవరు?
జ: టాలమీ
31) మౌర్య సామ్రాజ్య పతనం తర్వాత శ్రీముఖుని నాయకత్వంలో శాతవాహనులు స్వతంత్రించారని తెలిపినది ఎవరు?
జ: V.N.స్మిత్
32) శాతవాహనుల తొలి రాజధాని ఏది?
జ: కోటిలింగాల
33) శాతవాహనుల జన్మస్థలం కర్నాటక అని పేర్కొన్నవారు ఎవరు?
జ: P.T. శ్రీనివాస అయ్యంగార్
34) శాతవాహనులు, ఆంధ్రులు ఒక్కరే అన్నవారు ఎవరు?
జ: R.G. భండార్కర్, V.N.స్మిత్ రాన్సన్
35) శాతవాహనుల జన్మస్థలం విదర్భ అని వాదించిన వారెవరు?
జ: V.V. మిరాశి
36) శ్రీముఖ శాతకర్ణి ఆంధ్ర జాతీయుడు అని పేర్కొన్న పురాణం ఏది?
జ: మత్స్య పురాణం
37) ఏ శాతవాహన రాజుకు చెందిన నాణేలు పుణె సమీపంలో లభించాయి?
జ: మొదటి శాతకర్ణి
38) ఆంధ్ర రాజులు సుశర్మను చంపి మగధను ఆక్రమిచినట్లు పేర్కొన్న పురాణం ఏది?
జ: మత్స్య పురాణం
39) నానాఘాట్ శాసనకర్త ఎవరు?
జ: నాగానిక
40) సహపాణుడి పునర్ముద్రిత నాణేలు ఎక్కడ లభించాయి?
జ: జోగ్ బి
41) సాంచీ స్థూపానికి దక్షిణ తోరణం నిర్మించిన రాజు ఎవరు?
జ: రెండో శాతకర్ణి
42) రెండో శాతకర్ణి శుంగుల రెండో రాజధాని విదిశను జయించాడని పేర్కొన్న గ్రంధం ఏది?
జ: గార్గి సంహిత
43) ఏ రాజు కాలంలో గౌతమీ బాలశ్రీ నాసిక్ శాసనం వేయించింది?
జ: వాశిష్టపుత్ర పులోమావి
44) తన పేరు మీద తొలిసారిగా శాసనాలు వేయించిన శాతవాహన రాజు ఎవరు?
జ: మొదటి పులోమావి
45) శ్రీముఖుడు మొదట ఆదరించిన మతం ఏది?
జ: జైనమతం
46) శాతవాహనుల కాలంలో జనపదాలు అంటే ఏమిటి?
జ: సామంత రాజ్యాలు
47) దానాలు ప్రారంభించిన రాజవంశం ఏది?
జ: శాతవాహనులు
48) చైత్యవలయాన్ని నిర్మించిన శాతవాహన చక్రవర్తి ఎవరు?
జ: యజ్ఞశ్రీ శాతకర్ణి
49) శాతవాహనుల కాలంలో గ్రామాలు స్వయం సమృద్దిగా ఉన్నాయిని తెలిపే గ్రంధం ఏది?
జ: గాధాసప్తశతి
50) శాతవాహన వంశంలో అతి గొప్పరాజెవరు?
జ: గౌతమీపుత్ర శాతకర్ణి