Friday, July 19

శాతవాహనులు (పార్ట్ 1) వీడియో క్లాస్

ఫ్రెండ్స్

తెలంగాణ ఎగ్జామ్స్ డాట్ కామ్ వెబ్ సైట్ నుంచి యూట్యూబ్ క్లాసులు మొదలైన సంగతి మీకు తెలిసిందే.  ఇప్పటికే గ్రూప్ - 3, గ్రూప్ 1 నోటిఫికేషన్ల వివరాలు, సిలబస్, ఎగ్జామ్ కు ఎలా ప్రిపేర్ కావాలో వివరించాను.  మీలో చాలామంది కోచింగ్ కు వెళ్ళే ఆర్థిక స్థోమత లేకపోవచ్చు.  అలాంటి వారి కోసం  సబ్జెక్ట్ లెసన్స్ కూడా స్టార్ట్ చేశాము.  తెలంగాణ చరిత్ర,  సంస్కృతి, పాలిటీ, సమాజ నిర్మితి, కరెంట్ ఎఫైర్స్, కరెంట్ ఈవెంట్స్, జనరల్ నాలెడ్జ్ క్లాసులను మేము ఇస్తాం.  వీటితో పాటు నిపుణుల సలహాలు, విజేతల ఇంటర్వ్యూలు కూడా మన యూట్యూబ్ క్లాసుల ద్వారా అందిస్తాం.

కేవలం ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా... మీరు ప్రైవేటు లేదా పార్ట్ టైమ్ ఉద్యోగాలు ఎలా సాధించవచ్చు.  ఏయే రంగంలో ఎలాంటి అవకాశాలు ఉంటాయి... టెన్త్, ఇంటర్ నుంచే ఏ కోర్సు చదివితే మీకు గ్యారంటీగా ఉద్యోగం వస్తుంది... లాంటి సమాచారం ఇస్తాను. అలాగే మీలో ఓటమి భయం నుంచి బయటపడేయటం, మీరు విజయం వైపు ఎలా పయనించాలన్న క్లాసులు అందిస్తారు.   మీరు ఓవరాల్ గా ఏదో ఒక వృత్తిలో స్థిరపడాలన్నదే మా ధ్యేయం.  ఇప్పటిదాకా మీరు ఎన్నో యూట్యూబ్ ఛానెల్స్ చూసి ఉంటారు... వాటిల్లో ఏవేవో గాసిప్స్ పెట్టి... మిమ్మల్ని కంగారు పెట్టి ఉంటారు.  కానీ మనం ఏం చూసినా... ఏం చేసినా... నాలుగు డబ్బులు సంపాదించాలి... జీవితంలో స్థిరపడాలి... అమ్మా, నాన్నలను సంతోష పెట్టాలి అన్నది గుర్తుంచుకోండి.  విలువైన సమయాన్ని రాజకీయాలు, హీరోలు ఇతర అంశాల డిస్కషన్స్  పెట్టి టైమ్ వేస్ట్ చేసుకోవద్దు...  ఇప్పుడు మీరు వృధా చేసే ప్రతి నిమిషం... తర్వాత మీకు ఎంత కోల్పోయామో తెలుస్తుంది.  మీకు వెన్నంటి అండగా నేను ఉంటాను.  మీరు  తప్పకుండా విజయం సాధిస్తారు.

టెన్త్, ఇంటర్, డిగ్రీ విద్యార్థులు కూడా ఇప్పటి నుంచే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల ఎలా ఫోకస్ చేయాలో మన వెబ్ సైట్, యూట్యూబ్ ఛానెల్ ద్వారా సలహాలు అందిస్తాం. మీరు మన యూట్యూబ్ ఛానెల్ ను subscribe అవ్వగలరు.  అలాగే మీ మిత్రులు, బంధువులకు కూడా కూడా ఫార్వార్డ్ చేయగలరు.

తెలంగాణ ఎగ్జామ్స్ YOUTUBE ఛానెల్ SUBSCRIBE చేయడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి

https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA

మాస్టర్స్ టీవీ - For a Real News ( అన్ని వార్తలకు ఈ ఛానెల్ ను subscribe చేయండి)

https://www.youtube.com/channel/UC1zxevIMCLp8vuEKe5PhlXQ