Sunday, January 20

RRB లో 14వేల జూనియర్ ఇంజనీర్ పోస్టులు

రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డుల్లో మరో భారీ రిక్రూట్ మెంట్ కి నోటిఫికేషన్ విడుదలైంది. రైల్వేల్లో ఖాళీగా ఉన్న 14,033 జూనియర్ ఇంజనీర్ తో పాటు ఇతర పోస్టులను భర్తీ చేయనున్నారు. RRB JE రిక్రూట్ మెంట్ కోసం సైన్స్ లేదా ఇంజనీరింగ్ లో డిగ్రీ/డిప్లొమా చేసిన వారికి మంచి అవకాశం. ఇందులో జూనియర్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్ (ఐటీ), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తారు.

పోస్టుల వివరాలు:

జూనియర్ ఇంజనీర్ : 13,034 పోస్టులు

జూనియర్ ఇంజనీర్ (ఐటీ) : 49 పోస్టులు

డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ : 456 పోస్టులు

కెమికల్ అండ్ మెటలర్జికలల్ అసిస్టెంట్ : 494 పోస్టులు

వయోపరిమితి:

18 నుంచి 33యేళ్ళ లోపు (01.01.2019 నాటికి )

ఆన్ లైన్ రిజిష్ట్రేషన్లు :

2019 జనవరి 2 నుంచి 31 వరకూ

విద్యార్హతలు:
1) జూనియర్ ఇంజనీర్: డిప్లొమా /ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన వారు
2) జూనియర్ ఇంజనీర్(ఐటీ): BSc (కంప్యూటర్ సైన్స్), BCA, BTech (CSE/IT) పూర్తి చేసిన వారు
3) డిపో మెటీరియల్ సూపరింటెండెంట్: ఏదైనా డిప్లోమా/ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన వారు
4) కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ : బ్యాచిలర్ డిగ్రీలో ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు కలిగిన వారు

RRB JE రిక్రూట్ మెంట్ కు సంబంధించి 9 విషయాలు తెలుసుకోవాలి

1) దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అయితే 2019 జనవరి 2 నుంచి మాత్రమే దరఖాస్తులను స్వీకరిస్తారు

2) అప్లికేషన్ ప్రాసెస్ ను ఆయా జోనల్ RRB వెబ్ సైట్స్ ద్వారా నిర్వహిస్తారు. అందువల్ల వాటికి మాత్రమే అప్లయ్ చేసుకోవాలి

3) RRB JE రిక్రూట్ మెంట్ కి అప్లయ్ చేయడానికి చివరి తేది: 31 జనవరి 2019

4) అప్లికేషన్ ఫీజు : రూ.500 ( జనరల్ కేటగిరి అభ్యర్థులకు )

రూ.250 రిజర్వుడ్ అభ్యర్థులకు

నోట్: నిర్ణీత టైమ్ లో మొదటి దశ ఎగ్జామ్ కి హాజరైన అభ్యర్థులకు రూ.400 (జనరల్ అభ్యర్థులు), రిజర్వుడ్ అభ్యర్థులకు మొత్తం ఫీజులను రిఫండ్ చేయబడను

5) అభ్యర్థులు తమ ఫీజులను ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ మోడ్ లో చెల్లించవచ్చు. ఆన్ లైన్ మోడ్ లో అయితే... తమ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజును చెల్లించవచ్చు. ఆఫ్ లైన్ మోడ్ లో అయితే SBI బ్యాంక్ చలానా లేదా పోస్ట్ ఆఫీస్ చలానా ద్వారా చెల్లించాలి

6) 2019 జనవరి 31లోగా అప్లికేషన్ ఫీజులు చెల్లించిన అభ్యర్థులు 2019 ఫిబ్రవరి 7 లోగా తమ అప్లికేషన్లు సమర్పించడానికి అవకాశం ఉంటుంది

7) మొత్తం 14,033 పోస్టులను ప్రకటించారు. ఇందులో ః

జూనియర్ ఇంజనీర్ : 13,034 పోస్టులు
జూనియర్ ఇంజనీర్ (ఐటీ) : 49 పోస్టులు
డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ : 456 పోస్టులు
కెమికల్ అండ్ మెటలర్జికలల్ అసిస్టెంట్ : 494 పోస్టులు

8) రెండు దశల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ల ఆధారంగా అభ్యర్థులను నియమిస్తారు. ఎగ్జామ్ డేట్స్ ఇంకా ప్రకటించలేదు

9) రెండు దశల్లో అభ్యర్థులను వడపోసిన తర్వాతే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది.

ఎగ్జామినేషన్ విధానం

మొదటి దశ - కంప్యూటర్ బేస్డ్ టెస్ట్

మేథమెటిక్స్ & అర్థమెటిక్ : 30 ప్రశ్నలు

జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ : 25 ప్రశ్నలు

జనరల్ అవేర్ నెస్: 15 ప్రశ్నలు

జనరల్ సైన్స్: 30 ప్రశ్నలు

మొత్తం 100 ప్రశ్నలను 90 నిమిషాలలోపు సమాధానాలు రాయాలి. తప్పు జవాబుకి 1/3 వంతు నెగిటివ్ మార్క్ ఉంటుంది

రెండో దశ - కంప్యూటర్ బేస్డ్ టెస్ట్

జనరల్ అవేర్ నెస్ : 15 ప్రశ్నలు

ఫిజిక్స్, కెమిస్ట్రీ : 15 ప్రశ్నలు

కంప్యూటర్ బేసిక్స్, అప్లికేషన్ : 10 ప్రశ్నలు

బేసిక్ ఎన్విరాన్ మెంట్ & పొల్యూషన్ కంట్రోల్: 10 ప్రశ్నలు

టెక్నికల్ ఎబిలిటీస్ : 100 ప్రశ్నలు

ఈ పరీక్షలోని 150 ప్రశ్నలను 2 గంటల వ్యవధిలో రాయాలి. 150 మార్కులు. ప్రతి తప్పు జవాబుకి 1/3 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి

పూర్తి నోటిఫికేషన్ కోసం ఈ కింది లిక్ క్లిక్ చేయండి:

Railway_Recruitment_2019_14033_Vacancies