G-948507G64C

10thతో రైల్వేలో 32438 పోస్టులు

Table of Contents

10th, ITI అర్హతతో భారీ స్థాయిలో ఉద్యోగాలకు Railway Recruitment Board నోటిఫికేషన్ జారీ చేసింది. 32,438 Group.D పోస్టులను భర్తీ చేయబోతోంది. రెండు దశల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.
RRB లేటెస్ట్ Group.D Notification, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం చూద్దాం.

మొత్తం ఎన్ని పోస్టులు ?

32,438 గ్రూప్-డి పోస్టులు

ఏయే పోస్టులు ?

పాయింట్స్ మెన్-బి-5,058 పోస్టు లు,
అసిస్టెంట్(ట్రాక్ మెషీన్)-799 పోస్టులు,
అసిస్టెంట్(బ్రిడ్జ్)-301 పోస్టులు,
ట్రాక్ మెయింటనెర్ గ్రేడ్-4 ఇంజనీరింగ్-13,187 పోస్టులు, అసిస్టెంట్ పి-వే- 257 పోస్టులు,
అసిస్టెంట్ (C & W)-2,587 పోస్టులు,
అసిస్టెంట్ TRD ఎలక్ట్రికల్ -1,381 పోస్టులు,
అసిస్టెంట్ (S &T ) -2,012 పోస్టులు,
అసిస్టెంట్ లోకోషెడ్ (డీజిల్) 420 పోస్టులు,
అసిస్టెంట్ లోకోషెడ్ (ఎలక్ట్రికల్)- 950 పోస్టులు,
అసిస్టెంట్ ఆపరేషన్స్ (ఎలక్ట్రికల్)-744 పోస్టులు,
అసిస్టెంట్ TL&AC-1,041 పోస్టులు,
అసిస్టెంట్ TL & AC (వర్క్ షాప్ 1624 పోస్టులు,
అసిస్టెంట్ (Workshop) (మెషీన్) -3,077 పోస్టులు

తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని పోస్టులు ?

దక్షిణ మధ్య రైల్వేలో ఖాళీల సంఖ్య (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ): 1,642.

ఏయే పోస్టులు అంటే !

అసిస్టెంట్(S & T)-124,
అసిస్టెంట్ (Workshop)-96,
అసిస్టెంట్ (క్యారేజ్ & వ్యాగన్) – 106,
అసిస్టెంట్ లోకోషెడ్ (డీజిల్) – 25,
అసిస్టెంట్ లోకో షెడ్ (ఎలక్ట్రికల్)- 54,
అసిస్టెంట్ ఆపరేషన్స్ (ఎలక్ట్రికల్ )-20,
అసిస్టెంట్ పి వే-76,
అసిస్టెంట్ TL & AC (Workshop)- 28.
అసిస్టెంట్ TL & AC-61,
అసిస్టెంట్ ట్రాక్ మెషీన్-86,
అసిస్టెంట్ TRD-66,
పాయింట్స్ మెన్ బి-209,
ట్రాక్ మెయింటనేర్(4)-691పోస్టులు ఉన్నాయి.

విద్యార్హతలు

పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: జూలై 1 నాటికి 18-36 యేళ్ళ మధ్య ఉండాలి.
SC/ST అభ్యర్థులకు 5యేళ్లు,
OBC అభ్యర్థులకు 3ఏళ్లు చొప్పున సడలింపు ఉంంది

వయో పరిమితి సడలింపు

Group.D పోస్టులకు వయో పరిమితి 18-33 ఏళ్లుగా ఉంటుంది. 2019 తర్వాత కోవిడ్ వల్ల నియామకాలు చేపట్టలేదు.
అందుకే ఈ నోటిఫికేషన్లో గరిష్ట వయో పరిమితిని మూడేళ్లు పెంచారు. అందువల్ల 18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉన్నవారు అప్లయ్ చేసుకోవచ్చు. ఈ అవకాశం ప్రస్తుత నోటిఫికేషన్ కు మాత్రమే వర్తిస్తుందని RRB తెలిపింది.

ఒక్క చోటే అప్లయ్ చేయాలి !

దేశంలో మొత్తం 16 RRB పరిధిలో ఉన్న ఖాళీలను ఈ నోటిఫికేషన్లు ఇచ్చారు. అభ్యర్థులు తమకు ఆసక్తి ఉన్న RRBకి మాత్రమే అప్లయ్ చేసుకోవాలి. ఆ RRB పరిధిలో అర్హత ఉన్న అన్ని పోస్టులకు అప్లయ్ చేయొచ్చు. వీళ్ళకి ఒకటే పరీక్ష జరుగుతుంది. Second Phase లో జరిగే PET కూడా ఆ RRB పరిధిలోని ప్రాంతంలో మాత్రమే నిర్వహిస్తారు.

నెలకు రూ.25 వేలు జీతం

RRB Group.D పోస్టులను పే లెవల్-1 గా పేర్కొన్నారు. వీళ్ళకి నెలకు రూ.25 వేల వరకు వేతనం ఉంటుంది. Basic Pay రూ.18 వేలుగా ఉంటుంది. దీంతోపాటు DA, HRA, TA లాంటి కూడా add అవుతాయి.

పరీక్ష ఎలా ?

అభ్యర్థుల ఎంపికల మొదట Computer Based Test (CBT) నిర్వహిస్తారు. 4 విభాగాల నుంచి 100 ప్రశ్నలు ఇస్తారు.

1) జనరల్ సైన్స్ (25 ప్రశ్నలు),
2) మ్యాథమెటిక్స్ (25 ప్రశ్న లు),
3) జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ (30 ప్రశ్నలు),
4) జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ (20 ప్రశ్నలు)

ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 100 మార్కులకు పరీక్ష. పరీక్ష టైమ్ గంటన్నర ( 90 నిమిషాలు).
ప్రతి తప్పు సమాధానానికి 1/3వ వంతు చొప్పున నెగెటివ్ మార్కింగ్ తీసేస్తారు.

Second Phase PET

First Phase CBTలో మార్కుల ఆధారంగా రెండో దశలో Physical efficiency Test (PET) నిర్వహిస్తారు.
పురుష అభ్యర్థులు 35 కిలోల బరువున్న వస్తువు పట్టుకుని రెండు నిమిషాల్లో 100మీటర్లు దూరం చేరుకోవాలి. అలాగే 4 నిమిషాల 15 సెకన్ల వ్యవధిలో 1,000 మీటర్లు (ఒక కిలోమీటరు దూరం చేరుకోవాలి.

మహిళా అభ్యర్థులు 20 కిలోల బరువున్న వస్తువును పట్టుకుని రెండు నిమిషాల్లో 100 మీటర్లు దూరం చేరుకోవాలి. అలాగే 5 నిమిషాల 40 సెకన్ల వ్యవధిలో 1,000 మీటర్లు (ఒక కిలోమీటరు) దూరం చేరుకోవాలి.

Document Verification

CBT, PET ఈ రెండు దశల్లోనూ ప్రతిభ చూపి సరిపడా కటాఫ్ మార్కులు పొంది Final List లో నిలిచిన వాళ్ళని Document Verificationకి పిలుస్తారు.
విద్యార్హత సర్టిఫికెట్లు, ఇతర డాక్యుమెంట్స్ పరిశీలిస్తారు. ఈ ప్రక్రియ కూడా సక్సెస్ అయిత అభ్యర్థికి నియామక పత్రం అందిస్తారు.

ఎంపికైన వారికి ఏ పనులు ఉంటాయి ?

Group D పోస్టులకు ఎంపికైన వారు తమ విభాగాల్లో Ground Levelలో డ్యూటీ చేయాలి. Track maintenance, రైళ్లలో ఎలక్ట్రికల్ పరికరాల నిర్వహణ లాంటి బాధ్యతలు అప్పగిస్తారు.

భవిష్యత్తులో ప్రమోషన్లు

Group D పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు భవిష్యత్తులో Section Engineer/ Superintendent స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. ప్రతి 3యేళ్ల తర్వాత డిపార్ట్మెంట్ పరీక్షలకు అర్హత ఉంటుంది. వాటిల్లో ఉత్తీర్ణత సాధిస్తే త్వరగా ప్రమోషన్లు లభిస్తాయి.

Important Dates

RRB Group.D ఉద్యోగాలకు Online లో అప్లయ్ చేసుకోవాలి.
Online దరఖాస్తుల ప్రారంభం: 2025, జనవరి 23
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది:
2025, ఫిబ్రవరి 22 వరకు
Exam Date : 2025 Juneలో నిర్వహించే అవకాశం.

పూర్తి వివరాలకు ఈ కింది Website ని visit చేయండి.
www.rrbsecunderabad.gov.in

(సిలబస్, ప్రిపరేషన్ విధానం ఇదే వెబ్ సైట్ లో అందిస్తాం. Telangana Exams plus app లో RRB Group.D Mock Test Series నిర్వహించబడును )

Telangana Exams plus యాప్ లో నిర్వహించే TGPSC Group.1,2 & 3 తో పాటు VRO, HIGH COURT JOBS, RRB Group.D etc., Test Series లో పాల్గొనడానికి ఇప్పుడే ఈ లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోండి

ఉద్యోగ, విద్యా సమాచారం కోసం ఈ కింది లింక్ ద్వారా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి.

Telangana Exams -Whats Group Channel – CLICK below
🎯 ఎగ్జామ్స్ సెంటర్ CLICK HERE FOR TELEGRAM LINK

🎯 తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK

Subscribe తెలంగాణ ఎగ్జామ్స్ Channel : https://www.youtube.com/@TelanganaExams

Hot this week

తెలంగాణలో గ్రూప్ 1 నియామకాలకు బ్రేక్

FOR ENGLISH VERSION : CLICK HERE TGPSC Group.1 : తెలంగాణలో...

🏢 NPCILలో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ – మొత్తం 400 ఖాళీలు!

for English Version : CLICK HERE 🏢 NPCIL, ముంబైలో ఎగ్జిక్యూటివ్...

NMDC లో 179 అప్రెంటిస్ పోస్టులు

FOR ENGLISH VERSION : CLICK HERE ఎన్ఎండీసీలో 179 అప్రెంటిస్ పోస్టుల...

పశుసంవర్ధక శాఖలో 354 పోస్టుల భర్తీ

▪ త్వరలో వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీ▪ వీఏలకు లైవ్ స్టాక్...

ADAలో 133 ఖాళీలు

Aeronautics Jobs2025 : ఏరోనాటిక్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఏడీఏ)లో ఉద్యోగాల భర్తీకి...

Topics

తెలంగాణలో గ్రూప్ 1 నియామకాలకు బ్రేక్

FOR ENGLISH VERSION : CLICK HERE TGPSC Group.1 : తెలంగాణలో...

🏢 NPCILలో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ – మొత్తం 400 ఖాళీలు!

for English Version : CLICK HERE 🏢 NPCIL, ముంబైలో ఎగ్జిక్యూటివ్...

NMDC లో 179 అప్రెంటిస్ పోస్టులు

FOR ENGLISH VERSION : CLICK HERE ఎన్ఎండీసీలో 179 అప్రెంటిస్ పోస్టుల...

పశుసంవర్ధక శాఖలో 354 పోస్టుల భర్తీ

▪ త్వరలో వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీ▪ వీఏలకు లైవ్ స్టాక్...

ADAలో 133 ఖాళీలు

Aeronautics Jobs2025 : ఏరోనాటిక్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఏడీఏ)లో ఉద్యోగాల భర్తీకి...

GPO నియామకాలపై కన్ ఫ్యూజన్

గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు గతంలో VRO, VRA లకు...

🔴 DRDO GTRE Jobs 2025: బెంగళూరులో 150 Graduate, Diploma, ITI Apprentice Vacancies – Apply Now

  🔴 DRDO GTRE Jobs 2025: బెంగళూరులో 150 Graduate, Diploma,...

🔴 ESIC Jobs 2025: దిల్లీలో 558 స్పెషలిస్ట్ Govt Doctor Jobs – Apply Now!

  🔴 ESIC Jobs 2025: దిల్లీలో 558 స్పెషలిస్ట్ Govt Doctor...
spot_img

Related Articles

Popular Categories