రేచర్ల పద్మనాయకులు

1) రేచర్ల పద్మనాయకుల చరిత్రకు ప్రధాన ఆధారం?
జ: వెలుగోటి వంశావళి
2) స్వతంత్ర పద్మనాయక రాజ్య స్థాపకుడు ఎవరు?
జ: మొదటి సింగమ నాయకుడు
3) పద్మనాయక వంశ మూలపురుషుడు ఎవరు?
జ: భేతాళరెడ్డి
4) రాజధానిని ఆమనగల్లు నుంచి రాచకొండకు మార్చినవారు ఎవరు?
జ: అనపోత నాయకుడు
5) పంచ పాండ్య దళ విభాళ అనే బిరుదు కలిగిన పద్మనాయకరాజు ఎవరు?
జ: దాచా నాయకుడు
6) రేచర్ల పద్మనాయకుల తొలి రాజధాని ఏది?
జ: ఆమనగల్లు
7) రేచర్ల వంశంలో సోమకుల పరశురామ అనే బిరుదు గల రాజు ఎవరు?
జ: అనవోతా నాయకుడు
8) ఏ పద్మనాయక రాజు కాలంలో రెడ్డి-వెలమ సంఘర్షణ ప్రారంభమైనది?
జ: అనవోతానాయకుడు
9) రఘువంశం, కుమారసంబవం, మేఘసందేశం, కిరాతార్జునీయం వ్యాఖ్యానం రాసిన మెదక్ జిల్లాకు చెందిన కవి ఎవరు ?
జ: మల్లినాధసూరి
10) రాచకొండ దగ్గర నాగసముద్రం అనే చెరువును తవ్వించినవారు ఎవరు?
జ: నాగాంబిక
11) రెండో సింగమనాయకుడి రచనలు ఏంటి?
జ: రసవర్ణ సుధాకరం, సంగీత సుధాకరం,కువలయా వళి
12) రమాధీశ్వర శతకాన్ని రచించిన భువనగిరికి చెందిన కవి ఎవరు?
జ: నాగేంద్రకవి
13) బమ్మెర పోతన రచనలు ఏమిటి?
జ: భోగిని దండకం వీరభద్ర విజయం, నారాయణ శతకం
14) చమత్కార చంద్రిక ప్రకారం రెండో సింగ భూపాలుడి బిరుదు ఏమిటి?
జ: కళ్యాణ భూపతి
15) పద్మనాయకుల కాలంలో అమర కోశంపై వ్యాఖ్యానం రాసినవారు ఎవరు?
జ: బొమ్మకంటి అప్పయార్యుడు
16) మాదా నాయకుడు రామాయణంపై రాసిన వ్యాఖ్యానం ఏంటి?
జ: రాగవీయం
17) తెలంగాణలో తొలి కవియిత్రి ఎవరు?
జ: గంగాదేవి
18) హరిశ్చంద్రోపాఖ్యానం అనే ద్విపద కావ్యరచయిత ఎవరు?
జ: గౌరన
19) పద్మనాయకులు ఆదరించిన మతం ఏది?
జ: శ్రీవైష్ణవం
20) రాజ్యరక్షణలో రుద్రమదేవికి సాయపడిన రేచర్లవంశీయుడు?
జ: రేచర్ల ప్రసాదిత్యుడు
21) చమత్కారచంద్రిక గ్రంధకర్త?
జ: విశ్వేశ్వరుడు