Wednesday, October 23

ARE YOU READY TO LEARN ENGLISH ?

Count down starts....1....2....3...

తెలంగాణలో అందరూ ఇంగ్లీష్ లో మాట్లాడాలన్న ఆశయంతో telanganaexams.com ‘అందరికీ ఆంగ్లం’ పేరుతో కోర్సును మొదలుపెట్టింది.  ఇప్పటిదంక మిమ్మల్ని ఇంగ్లీషు భాష వైపు సన్నద్ధులు చేయడానికి కొన్ని ఆర్టికల్స్  ప్రచురించాం.  ఈ శనివారం (జూన్ 10) నుంచి పూర్తి స్థాయి కోర్సు మొదలవుతుంది.   DAY 1, DAY 2 .... ఇలా సాగిపోతుంది.  మీరు ఏ రోజూ పాఠాన్ని ఆరోజే చదవడంతో పాటు Exercises కూడా పూర్తి చేయగలరని మనవి.

అందరికీ ఆంగ్లం కోర్సు కేవలం విద్యార్థులకే కాదు... ప్రస్తుతం అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది.  టెట్  రాస్తున్న ఉపాధ్యాయ నిరుద్యోగ అభ్యర్థులకూ ఉపయోగపడుతుంది.  అందువల్ల ఈ కోర్సును విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, వృద్ధులు... ఇలా ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవచ్చు.

ఈ కోర్సును మీరు ఒక్కరే చదవడం కాదు... మీ చుట్టుపక్కల వారికి, స్నేహితులు, బంధువులకు కూడా మన వెబ్ సైట్, యాప్ ను ఫాలో అవమని చెప్పగలరు. యాప్ ను google play store నుంచి డౌన్ లోడ్ చేసుకోమని చెప్పగలరు.  telangana exams అని సెర్చ్ చేస్తే... మొట్టమొదట కనిపించే యాప్ ఇదే. ప్రతి ఇంట్లో ప్రతి విద్యార్థి, నిరుద్యోగి, తల్లిదండ్రుల దగ్గర ఈ యాప్ అందుబాటులో ఉంచాలన్నది మా ప్రయత్నం.  రాబోయే రోజుల్లో డిజిటల్ లైబ్రరీ ద్వారా  సమస్త సమాచారం, అప్ డేట్స్ మీ అరచేతిలో ఉండేలా తీర్చిదిద్దుతున్నాం. విద్య, ఉద్యోగ రంగాల్లో నిపుణులతో గైడెన్స్ ఇప్పిస్తాం.  సీనియర్ జర్నలిస్ట్ గా నాకున్న అనుభవం, పరిచయాన్ని ఉపయోగించి... మన వాళ్ళు అన్ని విధాలా అభివృద్ధి చెందేవిధంగా తీర్చిదిద్దాలన్నది మా టీమ్ ప్రయత్నం.  స్టార్టప్ కంపెనీగా వృద్ధి చెందుతున్న ఈ website cum app ను వీలైనంత ఎక్కువ మంది ఉపయోగించుకునేలా, ఎక్కువ మందికి చేరేలా చూడాలని కోరుతున్నాం.  ( మీ FB, WHATSAPP, TWITTER అకౌంట్స్ ద్వారా దీన్ని షేర్ చేయగలరు )