Monday, December 16

దక్షిణ మధ్య రైల్వేలో 12 వేల ఉద్యోగాలు – దేశంలో 1.31లక్షలు : ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్స్

దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఖాళీగా ఉన్న 12,433 పోస్టుల భర్తీకి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్, రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ ద్వారా వీటిని భర్తీ చేయాలని నిర్ణయించారు. ఈనెలాఖరులోపే నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలు ఉన్నాయి.

ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు

లోకో పైలెట్ : 2781 పోస్టులు

ట్రాక్ మెయింటైనర్ : 3940 పోస్టులు

పాయింట్స్ మెన్ : 884 పోస్టులు

టెక్నీషియన్ : 2475 పోస్టులు

హెల్పర్ : 1646 పోస్టులు

జూనియర్ ఇంజనీర్లు : 707 పోస్టులు

రైల్వే శాఖలో భారీగా ఖాళీలు ఉన్నాయని ఇటీవలే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. దానికి తగ్గట్టుగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు తమ పరిధిలో ఉన్న ఖాళీల లెక్క తీశారు. అలాగే దేశవ్యాప్తంగా ప్రస్తుతంతో పాటు వచ్చే ఏడాది ఖాళీ అయ్యే పోస్టులు కూడా కలుపుకుంటే 2.30 లక్షల ఉద్యో్గాలు ఖాళీ ఏర్పడతాయి. వీటిల్లో 1.31 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు RRB, RRC ఈ నెలలో నోటిఫికేషన్ వేసే అవకాశాలు ఉన్నాయి.