పంచాయతీ కార్యదర్శి ప్రీవియస్ పేపర్ -2 విశ్లేషణ

ప్రీవియస్ పేపర్ల విశ్లేషణ ( Second paper )

మీకు వివిధ యూనిట్స్ నుంచి ప్రశ్నలు ఎలా వస్తున్నాయో, తెలుసుకొనుటకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పంచాయతీ కార్యదర్శి 2014 పేపర్-2 ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పంచాయతీ కార్యదర్శి 2016 పేపర్-2లను కూడా ఇవ్వడం జరిగింది. ఈ పేపర్ లో ప్రశ్న ఎదురుగా యూనిట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. వీటి అర్థం తెలంగాణ పంచాయతీ కార్యదర్శికి సంబంధించిన సిలబస్ నుంచి వచ్చిన ప్రశ్నలు అని అర్థం. యూనిట్ నెంబర్ లేని ప్రశ్నలు పంచాయతీ కార్యదర్శికి సంబంధం లేని ప్రశ్నలు అని అర్థం.

2016 పేపర్ లో వివిధ యూనిట్స్ నుంచి వచ్చిన ప్రశ్నలు

యూనిట్ - 2
పంచాయతీ రాజ్ వ్యవస్థ పరిమాణం, రాజ్యాంగ సవరణలు మరియు వివిధ కమిటీల నివేధికలు ఈ యూనిట్ నుంచి సుమారు 32 ప్రశ్నలు వచ్చాయి.
యూనిట్ - 3
పంచాయతీ కార్యదర్శి విధుల బాధ్యతలు - 06 ప్రశ్నలు వచ్చాయి.
యూనిట్ - 4
గ్రామీణ సమాజం, గ్రామీణ పేదల అభివ‌ృద్ధి కొరకు ప్రవేశపెట్టిన గ్రామీణాభివృద్ధి పథకాలు - 10 ప్రశ్నలు
యూనిట్ - 5
భారతదేశం మరియు తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖలు ప్రవేశపెట్టిన గ్రామీణాభివృద్ధి పథకాలు - 19 ప్రశ్నలు వచ్చాయి
యూనిట్ - 7
సమాజ ఆధారిత సంస్థలు మరియు వికేంద్రీకరణ సంక్షేమ పథకాలు - 02 ప్రశ్నలు
యూనిట్ - 8
స్వయం సహాయక బృందాల ద్వారా మహిళ సాధికారత మరియు అభివృద్ధి - 07 ప్రశ్నలు
యూనిట్ - 9
స్థానిక సంస్థల ఆధాయం మరియు వ్యయాల నిర్వహాణ - 06 ప్రశ్నలు
యూనిట్ - 10
వివిధ ఖాతా నుంచి వస్తున్న గ్రాంట్లు మరియు ఖాతాల నిర్వహాణ - 16 ప్రశ్నలు

నోట్:- ఈ పేపర్ లో 8 యూనిట్స్ నుంచే ప్రశ్నలు సిలబస్ సంబంధించిన ప్రశ్నలు వచ్చాయి. మిగిలిన సిలబస్ కు సంబంధం లేనివి.

2014 - ఉమ్మడి రాష్ట్ర పేపర్ నుంచి వచ్చిన ప్రశ్నలు

యూనిట్ - 2
పంచాయతీ రాజ్ వ్యవస్థ పరిణామం, రాజ్యాంగ సవరణలు మరియు వివిధ కమిటీలు ఈ యూనిట్ నుండి సుమారు 24 ప్రశ్నలు వచ్చాయి.
యూనిట్ - 4
గ్రామీణ సమాజం, గ్రామీణ పేదల అభివృద్ధి కొరకు ప్రవేశపెట్టిన గ్రామీణభివృద్ధి పథకాలు - 13 ప్రశ్నలు
యూనిట్ - 5
భారతదేశం మరియు తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖలు ప్రవేశపెట్టిన పథకాలు - 07 ప్రశ్నలు వచ్చాయి.
యూనిట్ - 8
స్వయం సహాయం బృందాల ద్వారా మహిళా సాధికారత మరియు అభివృద్ధి - 02 ప్రశ్నలు

నోట్:- ఈ పేపర్ మెుత్తం 4 యూనిట్స్ నుంచే ప్రశ్నలు వచ్చాయి. మిగిలిన ప్రశ్నలు సిలబస్ కు సంబంధం లేదు.