PRACTICE TEST- 10 ( INDIAN ECONOMY)

ఆర్థికవృద్ధి - ఆర్థికాభివృద్ధి

1) ఆర్థిక వ్యవస్థలో పరిమాణాత్మక మార్పులను ఏది సూచిస్తుంది ?
ఎ)ఆర్థిక వృద్ధి
బి) ఆర్థికాభివృద్ధి
సి) జాతీయాదాం
డి) తలసరి ఆదాయం
2) సాంఘిక, ఆర్థిక వ్యవస్థ కింది స్థాయి నుంచి పై స్థాయికి చేరుకోవడమే ఆర్థికాభివృద్ధి - అన్నదెవరు ?
ఎ) మైఖేల్ పి.తొడారో
బి) సి.ఇ. బ్లాక్
సి) ఆర్థర్ లూయీస్
డి) గున్నార్ మిర్దాల్
3) తలసరి ఆదాయ పెరుగుదలే కాకుండా ఆర్థిక వ్యవస్థలో ధనాత్మక మార్పులు, ప్రజల జీవన వ్యవహారాల్లో మెరుగుదలను కూడా సూచించేది ఏది ?
ఎ) ఆర్థిక వృద్ధి
బి) ఆర్థికాభివృద్ధి
సి) జాతీయాదాం
డి) తలసరి ఆదాయం
4) తలసరి ఆదాయాన్ని లెక్కించే సూత్రం ఏది ?
ఎ) వాస్తవిక జాతీయాదాయం/జనాభా
బి) జాతీయ ఉత్పత్తి / జనాభా
సి) జాతీయాదాయం / జనాభా
డి) ఏదీ కాదు
5) భౌతిక జీవన ప్రమాణ సూచి (PQLI) ను నిర్మించడానికి ఆయుర్ధాయం, అక్షరాస్యతతో పాటు వేటిని పరిగణనలోకి తీసుకుంటారు ?
ఎ) శిశుమరణాలు
బి) ఆదాయం
సి) పేదరికం
డి) ఉద్యోగం
6) మానవాభివృద్ధి సూచికను UNDP ఆధ్వర్యంలో ఎవరు రూపొందించారు ?
ఎ) మహ్మద్ ఆలీ జిన్నా
బి) మహ్మద్ యూనస్
సి) మహబూబ్ -ఉల్ హక్
డి) ఎవరూ కాదు
7) గాంధేయ వాద నమూనాను రూపొందించినదెవరు ?
ఎ) ప్రొ.RS అగర్వాల్
బి) ప్రొ.SN అగర్వాల్
సి) ప్రొ.MN రాయ్
డి) ఏపీజే అబ్దుల్ కలామ్
8) వ్యవసాయం, చిన్నతరహా, కుటీర పరిశ్రమలను అభివృద్ధి చేసి, గ్రామీణ ప్రాంతాలను బలోపేతయం చేయాలని ఏ నమూనా ప్రతిపాదించింది ?
ఎ) గాంధేయవాద నమూనా
బి) పురా నమూనా
సి) బాంబే ప్రణాళిక
డి) నెహ్రూ నమూనా
9) గాంధేయవాద నమూనాని ఏ ప్రభుత్వం 1977లో అమల్లోకి తెచ్చింది ?
ఎ) కాంగ్రెస్ ప్రభుత్వం
బి) NDA ప్రభుత్వం
సి) జనతా ప్రభుత్వం
డి) దేవెగౌడ ఫ్రంట్
10) పుర - Provision under Amenities in Rural Areas ఈ నమూనాని మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ ప్రతిపాదించారు. దీన్ని ఎప్పటి నుంచి అమల్లోకి తెచ్చారు ?
ఎ) 1977-78
బి) 2005-06
సి) 2007-08
డి) 2004-05
11) గ్రామీణ ప్రాంతాల దోపిడీని గురించి గాంధీజీ ఏ పత్రికలో వివరించారు ?
ఎ) హరిజన్
బి) గ్రామ స్వరాజ్యం
సి)యంగ్ ఇండియా
డి) ఇండియన్ ఒపీనియన్
12) భవిష్యత్ తరాల వారికి అవసరాలు తీర్చుకునే సామర్థ్యం దెబ్బతినకుండా ప్రస్తుత తరం వారు తమ అవసరాలు తీర్చుకుంటూ కొనసాగించగలిగేదే అభివృద్ధి అని నిర్వచించినది ఎవరు ?
ఎ) బ్రిట్ లాండ్ కమిషన్
బి) ప్రణాళికా సంఘం
సి) గున్నార్ మిర్దాల్
డి) దేవిడ్ మోరిస్
13) అభివృద్ధి నిరోధకాల్లో దేశీయ నిరోధకాలు ఏవి ?
1) మార్కెట్ అసంపూర్ణత
2) రాజకీయ అసమతౌల్యం
3) అల్ప ప్రాథమిక వస్తు ఎగుమతులు
4) పేదరిక విషవలయాలు
ఎ) 1,2,3
బి) 1,2
సి) 1,2,3,4
డి) 2,3,4
14) 60శాతం వ్యవసాయ రంగంపై ఆధారపడ్డ జనాభా కలిగిన దేశాలు ఆర్థికంగా వెనుకబడిన దేశాలు అని నిర్వచనం ఇచ్చినది ఎవరు ?
ఎ) బ్రిట్ లాండ్ కమిషన్
బి) ప్రణాళికా సంఘం
సి) గున్నార్ మిర్దాల్
డి) దేవిడ్ మోరిస్
15) గాంధేయ వాద నమూనాకి సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది కరెక్ట్ ?
1) ప్రొ.SN అగర్వాల్ 1944లో ఈ నమూనాని ప్రతిపాదించారు
2) జనతా ప్రభుత్వం ఈ నమూనా అమలులో భాగంగా జిల్లాల్లో పరిశ్రమల కేంద్రాలను ఏర్పాటు చేసింది
ఎ) 1 కరెక్ట్, 2 తప్పు
బి) 2 కరెక్ట్, 1 తప్పు
సి) 1,2 కరెక్ట్ కాదు
డి) 1,2 కరెక్ట్

 

ANSWERS :

1) ఎ 2) డి 3) బి 4) సి 5) ఎ 6) సి 7) బి 8) ఎ 9) సి 10)డి 11) బి 12) ఎ 13) సి 14) బి 15) డి