Wednesday, June 19

మార్చికల్లా పోలీస్ నియామకాలు : వచ్చే నెలలోనే మెయిన్స్ ఎగ్జామ్ ?

రాష్ట్రంలో పోలీస్ నియామకాల ప్రక్రియను మార్చి నెలాఖరు కల్లా పూర్తి చేయాలని రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు భావిస్తోంది. పార్లమెంటు ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే లోపే ఈ ప్రాసెస్ పూర్తి చేయాలని భావిస్తున్నారు. మార్చి మొదటి వారంలోపే ఫిట్నెస్ టెస్టులు పూర్తి చేసి ఆ తర్వాత నెలాఖరులోగా మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించాలని నిర్ణయించారు. అందుకోసం అవసరమైతే అదనపు సిబ్బందిని ఉపయోగించుకోవాలని ప్లాన్ లో ఉంది బోర్డు.
రాష్ట్రంలో మొత్తం 18 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి 2018 మే నెలలో రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రాథమిక పరీక్షలో 3.77 లక్షల మంది అర్హత సాధించారు. ఎస్సై ఎగ్జామ్ లో 6 ప్రశ్నలు తప్పుగా ఇచ్చారంటూ కోర్టులో కేసు నడిచింది. నియామకాలపై సింగిల్ బెంచ్ జడ్జి స్టే ఇవ్వడంతో డిసెంబర్ 17 నుంచి మొదలు కావాల్సిన ఫిట్నెస్ టెస్టుల ప్రక్రియ వాయిదా పడింది. ఆ తర్వాత హైకోర్టు ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈనెల 11 నుంచి దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహిస్తోంది రిక్రూట్ మెంట్ బోర్డు. అందుకోసం అభ్యర్థులు ఇప్పటికే తమ అడ్మిట్ కార్డులు కూడా డౌన్లోడ్ చేసుకున్నారు.

దేహదారుఢ్య పరీక్షలకు నెల నుంచి 40 రోజులు టైమ్ పడుతుందని ఇప్పటికే బోర్డు వర్గాలు ప్రకటించాయి. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయితే పోలీస్ యంత్రాంగం అంతా బిజీ అవుతారు. అందువల్ల నియామక ప్రక్రియ మే 2019 వరకూ వెళ్ళే అవకాశముంది. ఇప్పటికే చాలా టైమ్ వేస్ట్ అయినందున అప్పటి దాకా అభ్యర్థులను వెయిట్ చేయించడం అనవసరమని పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి.
సాధారణంగా దేహదారుఢ్య పరీక్షలు జరిగాకా మెయిన్స్ కి 45 రోజుల టైమ్ ఇచ్చే వాళ్ళు. కానీ ఇప్పటికే రిక్రూట్ మెంట్ ప్రాసెస్ ఆలస్యం అయినందున ఫిట్నెస్ టెస్టుల్లో క్వాలిఫై అయిన వారికి మార్చి నెలలోనే మెయిన్స్ నిర్వహించాలన్నది పోలీస్ అధికారుల ఆలోచన.

సో... మీకు మెయిన్స్ పరీక్షలకు ఇప్పటి నుంచి 45 రోజులకు మించి టైమ్ ఉండే అవకాశం లేదు. అందువల్ల ప్రతి నిమిషం సద్వినియోగం చేసుకోండి. ఉదయం, సాయంత్రం గ్రౌండ్ ప్రాక్టీస్ కి వెళ్లినా... ఆ తర్వాత టైమ్ ని మెయిన్స్ పై concentrate చేయండి. ఫిట్నెస్ టెస్టులు పూర్తయ్యాక చూసుకుందాంలే అని మాత్రం నిర్లక్ష్యం చేయకండి...
All the best

తక్కువ టైమ్ లో మీరు మెయిన్స్ కి ప్రిపేర్ అయ్యేలా మా మాక్ టెస్టులు ఉపయోగపడతాయి. మెయిన్స్ కోసం (1) స్టేట్ మెంట్స్ (2) జతపరచండి (3) కాలక్రమంలో రాయండి మోడల్స్ లో ఇస్తున్నాం. (మెయిన్స్ ఎగ్జామ్స్ కంటే ముందే మాక్ టెస్టులు పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నాం.. )

SI/PC(M)/GR.1,2,3 - 40రోజుల్లో 325 TESTS

మీరు మా మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులకు ఫీజులు చెల్లించడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి

https://telanganaexams.com/mocktests/

మొత్తం టైమ్ టేబుల్ వివరాలను ఈ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి:

FEB REVISED 40 DAYS PLAN-converted(1)