పోలీస్ ఉద్యోగాలకు వయోపరిమితి/ గడువు పెరిగాయి !

పోలీస్ ఉద్యోగాలకు వయోపరిమితి/ గడువు పెరిగాయి !

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోడానికి మరో రెండేళ్ళ వయో పరిమితిని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  దాంతో  SI/PC ఉద్యోగాలకు అప్లయ్ చేయడానికి ఈనెల 26 రాత్రి 10 గంటల వరకూ గడువు పెంచుతూ TSRLPB ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.

ఇప్పటికే రాష్ట్రంలో పోలీస్, అగ్నిమాపక, జైళ్ళు, ఆబ్కారీ, అటవీ, ప్రత్యేక భద్రతా దళం తదితర యూనిఫామ్ సర్వీసు ఉద్యోగాలకు వయో పరిమితిని మూడేళ్ళకు పెంచుతూ ప్రభుత్వం ఏప్రిల్ 13న ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పుడు మరో రెండేళ్ళు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

ఎన్నేళ్ళ దాకా అప్లయ్ చేయొచ్చు ?

కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపికకు సాధారణ కేటగిరీ వారికి వయో పరిమితి 22 యేళ్ళుగా ఉన్నాయి. ఈ పరిమితి ఇక 27 యేళ్ళకు పెరుగుతుంది. SC/ST/BC అభ్యర్థులకు ప్రస్తుతం 27యేళ్ళ పరిమితి ఉంది. ఇది 32 కు పెరుగుతుంది

ఇక SI ఉద్యోగాల ఎంపికకు సాధారణ కేటగిరీ వారికి వయో పరిమితి 25 యేళ్ళుగా ఉన్నాయి. ఈ పరిమితి ఇక 30 యేళ్ళకు పెరుగుతుంది. SC/ST/BC అభ్యర్థులకు ప్రస్తుతం 30యేళ్ళ పరిమితి ఉంది. ఇది 35 కు పెరుగుతుంది

డీఎస్పీ పోస్టులకు ఎంపికకు సాధారణ కేటగిరీ వారికి వయో పరిమితి 30 యేళ్ళుగా ఉన్నాయి. ఈ పరిమితి ఇక 35 యేళ్ళకు పెరుగుతుంది. SC/ST/BC అభ్యర్థులకు ప్రస్తుతం 35 యేళ్ళ పరిమితి ఉంది. ఇది 40 కు పెరుగుతుంది

Rs.500 ల TS POLICE COURSE కొనుగోలు చేయడానికి లింక్

https://web.classplusapp.com/newApp/store/course/199804?section=overview

మీరు Telangana Exams you tube channel ఫాలో అవుతున్నారా ? ప్రిపరేషన్ ప్లాన్స్, విద్యా ఉద్యోగ సమాచారం కోసం ఈ ఛానెల్ ను subscribe చేసుకోండి https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA