నిరుద్యోగులకు ఇంటర్న్ షిప్ పథకం కింద నెలవారీగా రూ.5 వేలను ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ Prime Minister Internship Scheme రెండో దశకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 21 నుంచి 24 ఏళ్లలోపు ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు ఈ Internship Scheme కి అప్లయ్ చేసుకోడానికి అర్హత ఉంది. మార్చి 11 లోపు ఆఖరు తేది.
అప్లయ్ చేయడానికి వెబ్ సైట్ :
https://pminternship.mca.gov.in/login/
ఈ PM Internshipనకు ఎంపికైన విద్యార్థులకు ఏడాదిపాటు నెలకు రూ.5 వేల చొప్పున ఇస్తారు. ఇది కాకుండా… ఒక్కసారి సాయం కింద రూ.6 వేలు అందజేస్తారు. మొత్తం 12 నెలల టైమ్ లో (ఏడాదిలో) కనీసం 6 నెలలు ఉద్యోగ శిక్షణ ఉంటుంది. దరఖాస్తుదారుల కుటుంబంలో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండరాదు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షలలోపు ఉండాలి. యువత నైపుణ్యాలను పెంచుకోవడానికి ఇదో మంచి అవకాశంమని పరిశ్రమల శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ పథకంపై ఏవైనా అనుమానాలు ఉంటే… 1800 11 6090 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. .