SI, Police Constable అభ్యర్థులకు డిసెంబర్ మొదటి వారంలో శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించే అవకాశాలున్నాయి. అందుకోసం రాష్ట్ర పోలీస్ నియామక మండలి ( TSLPRB) ప్రయత్నాలు చేస్తోంది. Physical Efficiency Test(PET), Physical Measurement Test(PMT) ని నిర్వహించేందుకు రాష్ట్రంలో 12 కేంద్రాలను రెడీ చేస్తోంది. పరీక్షలను 25 రోజుల్లోగా కంప్లీట్ చేయాలని నిర్ణయించింది. గ్రౌండ్స్ లో ఇంటర్నెట్, సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో గ్రౌండ్ లో దాదాపు 130 మంది దాకా సిబ్బంది అబ్జర్వేషన్ ఉంటుంది. ఏర్పాట్లు పూర్తయితే ఈనెలాఖరు నుంచే టెస్టులు మొదలుపెట్టే అవకాశాలున్నాయి. అలాగే గతంలో ఒక అభ్యర్థి ఎన్ని పోస్టులకు పోటీ పడితే అన్నిసార్లు PMT, PET కి హాజరు కావాల్సి ఉండేది. కానీ ఈసారి మాత్రం ఎన్నింటికి పోటీ పడ్డా ఒక్క టెస్టు సరిపోతుంది. ఒక్కసారి అర్హత సాధిస్తే ఆ రిజల్ట్ ను 33 నెలల పాటు లెక్కలోకి తీసుకుంటారు.

శారీరక సామర్థ్య పరీక్షలు జరిగే కేంద్రాలు

హైదరాబాద్ – SAR CPL అంబర్ పేట్

సైబరాబాద్ – 8వ బెటాలియన్ కొండాపూర్

రాచకొండ – సరూర్ నగర్ స్టేడియం

సంగారెడ్డి – పోలీస్ పరేడ్ గ్రౌండ్

సిద్ధిపేట – పోలీస్ పరేడ్ గ్రౌండ్

కరీంనగర్ – సిటీ పోలీస్ శిక్షణ కేంద్రం

ఆదిలాబాద్ -పోలీస్ పరేడ్ గ్రౌండ్

నిజామాబాద్ – రాజారాం స్టేడియం, నాగారం(నిజామాబాద్)

మహబూబ్ నగర్ -డిస్ట్రిక్ట్ స్టేడియం స్పోర్ట్స్ గ్రౌండ్

వరంగల్ – హనుమకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం

ఖమ్మం -పోలీస్ పరేడ్ గ్రౌండ్

నల్గొండ – మేకల అభినవ్ స్టేడియం

Leave a Reply