ఇది కూడా చదవండి : GROUP 2 , 3 నోటిఫికేషన్లకు అంతా సిద్ధం https://telanganaexams.com/group-2-3-notifications-ready/

 

రాష్ట్రంలో SI/PC నియామకాల కోసం ఉద్దేశించిన Physical Efficiency Test, Physical Measurement Test లను డిసెంబర్ 8 నుంచి 2023 జనవరి మొదటి వారంకు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను Telangana State Level Police Recruitment Board ప్రకటించింది. ప్రిలిమినరీ ఎగ్జామ్ లో ఉత్తీర్ణత సాధించిన 2,37,862 మంది అభ్యర్థులకు రాష్ట్రవ్యాప్తంగా 12 కేంద్రాలను ఏర్పాటు చేసింది.

1) హైదరాబాద్

2) సైబరాబాద్

3) రాచకొండ

4) వరంగల్

5) కరీంనగర్

6) ఖమ్మం

7) మహబూబ్ నగర్

8) నల్లగొండ

9) సంగారెడ్డి

10) ఆదిలాబాద్

11) నిజామాబాద్

12) సిద్ధిపేట

PET, PMT పరీక్షలకు అర్హత సాధించి, PART-2 కు అప్లయ్ చేసిన అభ్యర్థులకు అడ్మిట్ కార్డులు లేదా ఇంటిమేషన్ లెటర్లను ఆన్ లైన్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి. ఈనెల 29న ఉదయం 8 గంటల నుంచి డిసెంబర్ 3న రాత్రి 12 వరకూ https://www.tslprb.in/ నుంచి అభ్యర్థులు Download చేసుకోవచ్చు. అభ్యర్థులకు ఎవరికైనా Download సమస్యలు ఉంటే 93937 11110 (or) 93910 05006 నంబర్ కాల్ చేయొచ్చుర. లేదా support@tslprb.in కు ఈమెయిల్ ద్వారా తమ కంప్లయింట్స్ పంపించవచ్చు. PET, PMT టెస్టులకు వచ్చే అభ్యర్థులు తప్పనిసరిగా తమ అడ్మిట్ కార్డును వెంట తెచ్చుకోవాలని TSLPRB సూచించింది. రిక్రూట్ మెంట్ పూర్తయ్యేదాకా ఈ అడ్మిట్ కార్డును తప్పనిసరిగా అభ్యర్థులు తమ దగ్గర ఉంచుకోవాలి.

అభ్యర్థులూ ఇవి తప్పనిసరి

Admit Card/Intimation Letter

Part-2 Application- Printout copy

Community/Caste Certificate

Discharge/No-objection Certificate/ Pension Paymental Order copy (Ex-Servicemen)

Agency Area Certificate (Scheduled Tribes Candidates)

టైమ్ కి రాకుంటే అభ్యర్థిత్వం రద్దయినట్టే

అభ్యర్థులు అడ్మిట్ కార్డులో తెలిపిన టైమ్ కి తమకు కేటాయించిన టెస్ట్ కేంద్రానికి చేరుకోవాలి. ఒకవేళ ఎవరైనా ఆ టైమ్ కి రాకపోతే అభ్యర్థిత్వం రద్దవుతుంది. టెస్టులు జరిగే గ్రౌండ్స్ లో ఎలాంటి క్లాక్ రూమ్స్ అందుబాటులో ఉండవు. అందువల్ల ఎవరూ తమ లగేజీని వెంట తెచ్చుకోవద్దని మండలి అధికారులు సూచించారు. అలాగే మహిళా అభ్యర్థులు నగలు, హ్యాండ్ బ్యాగ్స్ తీసుకురాకూడదు. బయోమెట్రిక్ తీసుకుంటారు… అందువల్ల ఎవరూ కూడా చేతి వేళ్ళకి గోరింటాకు, మెహిందీ, టాటూలను వేసుకురాకూడదు. గ్రౌండ్స్ లోకి ఎట్టిపరిస్థితుల్లో మొబైల్ ఫోన్లను అనుమతించరు.

అభ్యర్థులపై డిజిటల్ నిఘా

  • PET, PMT ల్లో పాల్గొనే అభ్యర్థులు ప్రతి ఒక్కరిపై డిజిటల్ నిఘా ఉంటుంది. అభ్యర్థి గ్రౌండ్ లోకి రాగానే డిజిటల్ RFID టెక్నాలజీతో ఉన్న రిస్ట్ బ్యాండ్ అమరుస్తారు. గ్రౌండ్ నుంచి బయటకు వెళ్ళే దాకా దాన్ని అలాగే ఉంచుకోవాలి. తీసెయ్యకూడదు. ఆ రిస్ట్ బ్యాండ్ చించేయాలని చూసినా… ట్యాంపరింగ్ కు ప్రయత్నించినా disqualify చేస్తారు.
  • అభ్యర్థులు ముందుగా పరుగు పందెలో పాల్గొంటారు. Men కి 1600 మీటర్లు, Women కి 800 మీటర్ల రన్ నిర్వహిస్తారు. Intime లోపు పూర్తి చేయాలి.
  • రన్నింగ్ లో క్వాలిఫై అయిన వారి ఎత్తు కొలుస్తారు. ఒకవేళ ఎవరైనా ఒక సెంటీమీటర్ లేదా అంతకంటే తక్కువ ఎత్తుతో disqualify అయితే వెంటనే వాళ్ళు re-examine కి సంబంధించి సెంటర్ Chief Superintendent కి అప్లయ్ చేయొచ్చు. అలా అప్లయ్ చేసిన వారికి అదే రోజు Chief Superintendent ఆధ్వర్యంలోని కమిటీ తిరిగి అభ్యర్థి ఎత్తును కొలిచి తమ నిర్ణయం ప్రకటిస్తుంది.
  • ఎత్తులో కూడా అర్హత సాధిస్తేనే వాళ్ళని Long Jump, Shotput పోటీలకు అనుమతి ఇస్తారు.

PRESSNOTE click here: TSLPRB TSRLPB PET TESTS

 

Thank you for contacting telanganaexams! Download the Telangana Exams plus app for TSPSC Group 2,3&4 Mock Test series Link:

http://on-app.in/app/home/app/home?orgCode=atvqp

Visit Website for Current Affairs: https://telanganaexams.com/category/current-affairs/

ఏడాది పాటు కరెంట్ ఎఫైర్స్ తో పాటు ప్రతి రోజూ పేపర్ క్లిప్పింగ్స్ కోసం ఈ కింది లింక్ ద్వారా కేవలం రూ.100తో కోర్సును ఈ కింది లింక్ ద్వారా purchase చేయండి.

https://atvqp.courses.store/114635?utm_source%3Dwhatsapp%26utm_medium%3Dtutor-course-referral-wa%26utm_campaign%3Dcourse-overview-app

Leave a Reply