Saturday, August 17

వెబ్ సైట్లో పోలీస్ ఫిట్నెస్ టెస్టుల పెర్ఫార్మెన్స్ షీట్స్

రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న దేహదారుఢ్య పరీక్షల్లో అభ్యర్థులకు సంబంధించిన పెర్ఫార్మెన్స్ షీట్ ( ప్రతిభా పత్రం) ను వెబ్ సైట్ లో పెడతామని తెలంగాణ స్టేట్ పోలీస్ నియామక మండలి తెలిపింది. ప్రస్తుతం ఫిట్నెస్ టెస్టులు పూర్తయ్యాక ఈ షీట్ ను అభ్యర్థులకు అందిస్తున్నారు. అయితే ఈ షీట్స్ కోసం అభ్యర్థులు ఎక్కువసేపు క్యూలో ఉండాల్సి వస్తోంది. అప్పటికే టెస్టులు పూర్తిచేసిన అభ్యర్థులు మళ్ళీ వెయిటింగ్ వల్ల ఇబ్బందులు పడుతున్నారు. అభ్యర్థుల ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని షీట్స్ ని వెబ్ సైట్ లో పెడతామని మండలి ఛైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. త్వరలోనే ఈ వివరాలు అందుబాటులోకి తెస్తామన్నారు. దేహదారుఢ్య పరీక్షల్లో ఎవరికి వారే వ్యక్తిగతంగా ఈ వివరాలను వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షల వివరాలను సీసీ కెమెరాల్లో చిత్రీకరిస్తున్నామనీ.. వీటి ఆధారంగా షీట్స్ తయారు చేస్తామన్నారు.