28న కానిస్టేబుల్ ప్రిలిమ్స్

28న కానిస్టేబుల్ ప్రిలిమ్స్

రాష్ట్రంలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం నిర్వహిస్తున్న ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్ ను వారం రోజులు వాయిదా వేసింది పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్.  ఈనెల 21న జరగాల్సిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ ను ఈనెల 28న నిర్వహిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.  రాష్ట్రంలో 15 వేలకు పైగా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఏప్రిల్ లో TSLPRB నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రిలిమ్స్ ను ఈనెల 21న ఆదివారం నిర్వహించాల్సి  ఉంది.  అయితే లాజిస్టిక్స్, పరిపాలనా ఇబ్బందులతో పరీక్షను వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు TSLPRB అధికారులు తెలిపారు.  ఈనెల 28న ఆదివారం నాడు ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకూ ఎగ్జామ్ నిర్వహిస్తారు.  అలాగే హాల్ టిక్కెట్స్ ను ఈనెల 18 నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.