• CAA కింద కాకుండా 1955 నాటి చట్టం వీళ్ళకి భారత పౌరసత్వం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.
  • ప్రస్తుతానికి గుజరాత్ లోని రెండు జిల్లాల్లో అమలు చేయనున్నారు.
  • గుజరాత్ లోని ఆణంద్, మెహసానా జిల్లాల్లో నివసిస్తున్న హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రైస్తవులకు భారత పౌరసత్వం మంజూరు చేస్తారు.
  • వివాదాస్పద పౌర సత్వ సవరణ చట్టం (సీఏఏ) – 2019 ద్వారా కాకుండా.. వారికి 1955 నాటి పౌరసత్వ చట్టం కింద మన దేశంలో పౌరసత్వం ఇస్తామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
  • పాక్, అఫ్గాన్, బంగ్లాదేశ్లో హింసకు గురై భారత్ కు వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రైస్తవులకు పౌర సత్వం ఇచ్చేందుకు CAA ను కేంద్రం తెచ్చింది.
  • CAA కు వ్యతిరేకంగా దేశంలో చాలా చోట్ల హింసాత్మక నిరసనలు జరిగాయి. వాటిలో వంద మందికి పైగా మరణించారు.
  • దాంతో ఆణంద్, మెహసానాల్లో స్థిరపడ్డవారికి 1955 నాటి చట్టం కింద పౌరసత్వం ఇవ్వనున్నారు.
  • ఆయా వర్గాల వ్యక్తులు ఆన్లైన్ లో అప్లయ్ చేస్తే స్థానిక కలెక్టరు వాటిని పరిశీలించి పౌరసత్వ మంజూరుపై నిర్ణయం తీసుకోవచ్చు
  • 2014 డిసెంబరు 31లోపు పాక్, అఫ్గాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చినవా రికి తాజా నిర్ణయం ద్వారా ప్రయోజనం కల్పించాలని కేంద్రం భావిస్తోంది

Leave a Reply