OU ఓపెన్ వర్సిటీలో MBA, MCA కోర్సులు

OU ఓపెన్ వర్సిటీలో MBA, MCA కోర్సులు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఓపెన్ యూనివర్సిటీలో రెండేళ్ళ MBA, MCA కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను కోరుతున్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు పరీక్ష రాయడానికి నవంబర్ 2 నుంచి 28 వరకూ అప్లయ్ చేసుకోవచ్చు. టీఎస్ ఐసెట్-2017 లో అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రవేశ పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తుతో పాటు పూర్తి వివరాల కోసం www.ouadmissions.com లేదా www.oucde.net వెబ్ సైట్ లో చూడవచ్చని అధికారులు తెలిపారు.