ఆపరేషన్ పోలో – హైదరాబాద్ సంస్థానం విలీనం-2

1) హైదరాబాద్ విలీనాన్ని సైనిక చర్య అనొద్దని సూచించిన నేత ఎవరు ?
జ: గవర్నర్ జనరల్ సీఎచ్ రాజగోపాలా చారి (రాజాజీ)
2) ఆపరేషన్ పోలో నిర్వహించినప్పుడు భారత ప్రధాన సైన్యాధిపతి ఎవరు ?
జ: సర్ రాయ్ బౌచర్, రక్షణ మంత్రి బల్దేవ్ సింగ్
3) హైదరాబాద్ పై సైనిక చర్యకు ఆపరేషన్ పోలో అని పేరెందుకు వచ్చింది ?
జ: భారత్ సైన్యం హైదరాబాద్ లోకి ప్రవేశించినప్పుడు మొదట పోలో గ్రౌండ్స్ ను ఆధీనంలోకి తీసుకొని అక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహించింది.
4) హైదరాబాద్ పై దాడికి ప్రణాళికను అమలు చేసే బాధ్యతను ఎవరికి అప్పగించారు ?
జ: దక్షిణ కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాజేంద్రసింగ్ జీ జడేజా
5) హైదరాబాద్ పై యుద్ధ విమానాల ద్వారా దాడి కోసం ఏ ఎయిర్ పోర్ట్ ను ఉపయోగించుకోవాలని అనుకున్నారు ?
జ: పుణె ఎయిర్ బేస్
6) షోలాపూర్ నుంచి సైనిక దాడికి ఎవరు నాయకత్వం వహించారు ?
జ: జెఎన్ చౌదరి( స్ట్రైకింగ్ ఫోర్స్, స్మాష్ ఫోర్స్, కిల్ ఫోర్స్, వీర్ ఫోర్స్)
7) విజయవాడ దళానికి నాయకత్వం వహించిందెవరు ?
జ: ఎ.ఎ.రుద్ర (17వ పూనా హార్స్, క్వీన్ విక్టోరియా దళాలు)
8) బీరార్ (హోస్పేట) దళానికి నాయకత్వం వహించిన సైన్యాధికారి ఎవరు ?
జ: శివదత్తు సింగ్ ( 1వ మైసూర్ ఆర్మీ, 5/5 గుర్ఖా రైఫిల్స్ )
9) భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో ఫిర్యాదు చేసేందుకు రాజు ఉస్మాన్ అలీఖాన్ ఎవర్ని పంపారు ?
జ: మెహదీ నవాజ్ జంగ్
10) ఐరాసలో హైదరాబాద్ ప్రభుత్వానికి సహకరించడానికి నియమించబడిన వ్యక్తి ఎవరు ?
జ: సర్ వాల్టర్ మాంక్టన్
11) నిజాం ప్రభుత్వంతో పోరాటానికి స్టేట్ కాంగ్రెస్ కార్యకర్తలకు ఎక్కడ శిక్షణ ఇప్పించారు ?
జ: నాగపూర్, షోలాపూర్ లోని భారత సైనిక శిక్షణా కేంద్రాల్లో
12) 1947 డిసెంబర్ 4న నిజాం ప్రయాణిస్తున్న కారుపై బాంబులు విసిరిన వారెవరు ?
జ: హైదరాబాద్ లా కాలేజ్ విద్యార్థి నారాయణ రావు పవార్ (సహకరించిన వారు గండయ్య, జగదీష్)
13) నారాయణ రావు పవార్ కు పుణెలో పిస్టల్ కొనిపెట్టిన వారెవరు ?
జ: కొండా లక్ష్మణ్ బాపూజీ
14) ఆర్య సమాజ్ శాఖను హైదరాబాద్ లో స్థాపించినది ఎవరు ?
జ: స్వామి దయానంద సరస్వతి ( 1892)
15) ఇమ్రోజ్ పత్రికను నడిపింది ఎవరు ?
జ: షోయబుల్లా ఖాన్, బూర్గుల రామక్రిష్ణారావు
16) రజాకార్ల చేతిలో హత్యకు గురైన ఇమ్రోజ్ పత్రిక సంపాదకుడు ఎవరు ?
జ: షోయబుల్లా ఖాన్
17) హైదరాబాద్ రాజ్యంతో పోలీసుల దురంతాలు పుస్తకం రాసిన వారెవరు ? ఇందులో వేటి ప్రస్తావన ఉంది ?
జ: దేవులపల్లి వెంకటేశ్వరరావు. లెవీ ధాన్యం వసూళ్ల కోసం నిజాం పోలీసులు నల్లగొండ జిల్లాలో చేసిన అరాచకాలపై
18) రజాకార్లు అనేది ఏ భాషా పదం ? దానికి అర్థం ఏంటి ?
జ: ఉర్దూ పదం. వాలంటీర్లు అని అర్థం
19) మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మీన్ (MIM) సంస్థను స్థాపించింది ఎవరు ?
జ: 1927 నవంబర్ 12న నవాబ్ మహమూద్ నవాజ్ ఖాన్
20) ఎవరి తర్వాత MIM కి కాశీం రజ్వీ అధ్యక్షుడయ్యాడు ?
జ: బహదూర్ యార్ జంగ్ మరణించిన తర్వాత
21) హైదరాబాద్ రాజ్యం భారత్ యూనియన్ లో ఎప్పుడు విలీనం అయింది ?
జ: 1948 సెప్టెంబర్ 17న

22) 1948 సెప్టెంబర్ 19న హైదరాబాద్ రాష్ట్ర మిలటరీ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టినది ఎవరు ?
జ: మేజర్ జనరల్ జయంత్ నాథ్ చౌదరి
23) 1 డిసెంబర్ 1949 భారత ప్రభుత్వం మిలటరీ గవర్నర్ పోస్టును రద్దు చేసింది. పాలనా బాధ్యతలు ఎవరికి అప్పగించింది ?
జ: ఎంకె వెల్లోడిని హైదరాబాద్ ప్రధానమంత్రి గా రాష్ట్ర పరిపాలనాధికారిగా నియమించింది.
24) భారత రాజ్యాంగాన్ని హైదరాబాద్ రాష్ట్రానికి కూడా వర్తింపజేస్తూ భారత్ ప్రభుత్వం ఎప్పుడు ఫర్మానా జారీ చేసింది ?
జ: 25 జనవరి 1950 (రిపబ్లిక్ డేకి ఒక రోజు ముందు)
25) హైదరాబాద్ రాష్ట్ర రాజ్ ప్రముఖ్ గా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఎప్పుడు ప్రమాణం చేశారు ?
జ: 1950 జనవరి 26న
26) రజాకార్లను లొంగదీసుకోడానికి భారత వైమానిక దళం ఏ ప్రాంతంలో బాంబులు విసిరింది ?
జ: దురాశ్ పల్లి కొండల దగ్గరల్లో
27) ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్ పుస్తక రచయిత ఎవరు?
జ: లాయక్ అలీ

28) 1949 ఫిబ్రవరి 6న జెఎన్ చౌదరి జారీ చేసిన ఫర్మానాలో కీలక నిర్ణయాలేంటి ?
జ: సర్ఫేఖాస్ (నిజాం సొంత భూమిని) వాడుకున్నారు.
నిజాం కరెన్సీ హాలీ సిక్కాను రద్దు చేసి రూపాయిని ప్రవేశపెట్టారు. నిజాం కాలంలో శుక్రవారం సెలవు దినంను రద్దు చేసి ఆదివారం హాలిడే గా ప్రకటించారు.
29) జెఎన్ చౌదరి కాలంలో హైదరాబాద్ లో జరిగిన అకృత్యాలపై ( రజాకార్ల పేరుతో ముస్లిం యువకులను చంపడం) కేంద్రం నియమించిన కమిటీ ఏది ?
జ: 1949లో పండిత్ సుందర్ లాల్ కమిటీ
30) 1949 డిసెంబర్ 21న పండిత్ సుందర్ లాల్ నివేదికలో ఎంతమంది కమ్యూనిస్టులు, ముస్లింలను చంపేసినట్టు పేర్కొన్నారు ?
జ: 27 వేల నుంచి 40 వేల మంది దాకా
31) హైదరాబాద్ రాష్ట్రంలో జిల్లాల్లో కలెక్టర్లకు పై స్థాయిలో చీఫ్ అడ్మినిస్ట్రేటర్లుగా ఎవర్ని, ఎవరు నియమించారు ?
జ: ఆంధ్రాకు చెందిన వారిని. ఎం.కె. వెల్లోడి

32) ముల్కీ ఉద్యమకారులకు మద్దతు పలికింది ఎవరు?
జ) కొత్వాల్ రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి.
33) నిజాం ముల్కీ లీగ్ వ్యవస్దాపకుడు ఎవరు?
జ) నవాబ్ సర్ నిజామత్ జంగ్.
34) జయప్రకాశ్ నారాయణ హైదరాబాద్ లో ఎప్పుడు పర్యటించారు?
జ) 1947 మే 7.
35) హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నిజాంకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం ఏది?
జ) జాయిన్ ఇండియా ఉద్యమం.
36) తెలంగాణాలోని భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసినవారు?
జ) రామచంద్రారెడ్డి, లక్ష్మీ నరసింహారెడ్డి.
37) హైదరాబాద్ పై సైనికదాడి జరగకుండా అడ్డుకున్నది ఎవరు?
జ) గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్.
38) భారతదేశ గవర్నర్ జనరల్ గా ఎవరు నియమించబడ్డారు?
జ) రాజగోపాలచారి.
39) భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఎన్ని సంస్థానాలు ఉన్నాయి?
జ) 562
40) జయప్రకాశ్ నారాయణ్ బహిష్కరణ ఆదేశాలను ఖండిస్తూ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఎవరి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది?
జ) బూర్గుల రామకృష్ణారావు.
41) గోల్కొండ పత్రిక సంపాదకులు ఎవరు?
జ) సురవరం ప్రతాపరెడ్డి.
42) మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ బాంబుదాడి కేసులో 7వ నిందితుడు ఎవరు?
జ) కొండా లక్ష్మణ్ బాపూజీ.
43) కోదాడ, సూర్యపేట, నార్కట్ పల్లి, చిట్యాలను ఆక్రమించి హైదరాబాద్ వైపు పయనించినది ఎవరు?
జ) సయ్యద్ అహ్మద్ ఎడ్రూస్.
44) హైదరాబాద్ మిలటరీ గవర్నర్ జనరల్ గా నియమించబడినది ఎవరు?
జ) జె.యన్.చౌదరి.
45) కమ్యూనిస్టులు తెలంగాణలోని సెప్టెంబర్ 17ను ఏ రోజుగా జరుపుకుంటారు?
జ) విద్రోహదినం బ్లాక్ డే.
46) నాగార్జునసాగర్ పనులు ఎప్పుడు ప్రారంభమయ్యాయి?
జ) 1955
47) హైదరాబాద్ పౌర ముఖ్యమంత్రిగా పనిచేసినది ఎవరు?
జ) ఎమ్.కె.వెల్లోడి.