జులై 1 నుంచి ఆన్ లైన్ తరగతులే ! కేజీ టు పీజీ దాకా నో డైరెక్ట్ క్లాసెస్ !!

జులై 1 నుంచి ఆన్ లైన్ తరగతులే ! కేజీ టు పీజీ దాకా నో డైరెక్ట్ క్లాసెస్ !!

రాష్ట్రంలో జులై 1 నుంచి స్కూళ్ళు, ఇతర విద్యా సంస్థలు ప్రారంభం అవుతున్నాయి. కేజీ టు పీజీ దాకా ప్రత్యక్ష తరగతులు కాకుండా... ఆన్ లైన్ లోనే నిర్వహించాలని నిర్ణయించినట్టు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులెవరూ స్కూళ్ళకు వెళ్ళాల్సిన అవసరం లేదు. కరోనా పరిస్థితులతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి చెప్పారు.

  • జులై 1 నుంచి 3 నుంచి 10వ తరగతి దాకా ఆన్ లైన్ క్లాసులు ప్రారంభిస్తారు
  • ఆగస్ట్ 1 నుంచి 1,2 తరగతలుకు ఆన్ లైన్ క్లాసులు ప్రారంభిస్తారు
  • ప్రైవేట్ విద్యాసంస్థలు తప్పకుండా జీవో 46 ను అమలు చేయాలి..
  • ట్యూషన్ ఫీజులను నెలవారీగా మాత్రమే తీసుకోవాలి
  • ప్రైవేట్ విద్యాసంస్థలు ఫీజులను 30శాతం తగ్గించుకోవాలి
  • దూరదర్శన్, టీ శాట్ ద్వారా విద్యాబోధన నిర్వహిస్తారు.
  • డిగ్రీ, పీజీ, డిప్లొమా ఫైనలియర్ ఎగ్జామ్స్ అన్నీ యధావిధిగాజరుగుతాయి.
  • జులైలో జరిగే సెట్స్ కూడా యధావిధిగా ఉంటాయి
  • ప్రభుత్వ ఉపాధ్యాయులు రోజుకి 50శాతం చొప్పున స్కూళ్ళకు హాజరు కావాలి