ఇంజనీరింగ్ పోస్టులకు ఒకటే ఎగ్జామ్ !

ఇంజనీరింగ్ పోస్టులకు ఒకటే ఎగ్జామ్ !

రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న సివిల్ ఇంజినీర్స్ పోస్టులకు ఒకే ఎగ్జామ్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నీటిపారుదల, రహదారులు-భవనాలు, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి పారుదల, ప్రజారోగ్య శాఖల్లో వేలల్లో సివిల్ ఇంజినీరింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఐదు శాఖలకు వేర్వేరుగా నియామకం జరపడం వల్ల టైమ్ వేస్ట్ అవడంతో పాటు... కొన్ని ఉద్యోగాలు మళ్ళీ ఖాళీలు ఏర్పడే అవకాశముంది. అందుకే వీటన్నింటికీ ఒకే ఎగ్జామ్ నిర్వహించాలని ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఈ ఐదు శాఖల్లో మొత్తం రెండు వేల ఇంజినీరింగ్ పోస్టులను భర్తీ చేసే అవకాశాలున్నాయి. ఎక్కువగా నీటిపారుదల, రహదారులు-భవనాల శాఖల్లోనే ఖాళీలు ఉన్నాయి. రాత పరీక్ష, ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా వీరిని సెలక్ట్ చేస్తారు. TSPSC ద్వారానే ఈ రిక్రూట్ మెంట్ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే అభ్యర్థులు ఏ డిపార్ట్ మెంట్ లో చేరాలన్న దానిపై ఆప్షన్స్ ఇవ్వాలని భావిస్తున్నారు. ఆర్థిక శాఖ నుంచి ఉత్తర్వులు రాగానే 2వేలకు పైగా ఇంజనీరింగ్ పోస్టుల భర్తీపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

వెంటనే Telangana Exams plus యాప్ డౌన్లోడ్ చేసుకోండి

https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp

TS పోలీస్, TSPSC కొత్త బ్యాచ్ లు స్టార్ట్ !

http://telanganaexams.com/tspsc-ts-police-new-batches-start-huge-discounts/

 

టెక్నికల్, అగ్రికల్చరల్ పోస్టులకు పోటీ పడే అభ్యర్థులకు జనరల్ స్టడీస్ లో 15 టాపిక్స్ తో TMలో టెస్ట్ సిరీస్...ఈ కింది లింక్ ద్వారా కొనుగోలు చేయండి

https://atvqp.courses.store/58191?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp