G-948507G64C
29.2 C
Hyderabad
Friday, December 6, 2024

Group.2 కి సరిగా ప్రిపేర్ కాలేదా ! నీ ప్రయత్నం చెయి… ఆపొద్దు!

TGPSC గ్రూప్ 3 (Group.3)కి 5 లక్షల మందికి పైగా అప్లయ్ చేస్తే అందులో సగం మంది మాత్రమే ఎగ్జామ్ కి అటెండ్ అయ్యారు. అప్లయ్ చేసి కూడా చాలా మంది ఎందుకు హాజరవలేదు. వచ్చిన అవకాశాలను ఎందుకు వదులుకుంటున్నారు. నెక్ట్స్ గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది… దానికి అటెండ్ అవడానికి… మీలో మోటివేషన్ (motivation )నింపేందుకే 5 టిప్స్ (5 Tips) ఇస్తున్నాం

1) అవకాశాలను వదులుకోవద్దు:

మనం రాయబోయే ప్రతి ఒక్క ఎగ్జామ్ కూడా మన జీవితంలో ఎంతో కొంత మార్పు తెస్తుందని గుర్తుంచుకోండి. మీరు ప్రిపేర్ అయినా… అవ్వకపోయినా… ఎగ్జామ్ అనేది రాయడం వల్ల… దాని నుంచి ఎంతో కొంత పాఠం అనేది నేర్చుకుంటాం. మీకు వచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మీ గోల్ కి మీరు మరింత దగ్గరవుతున్నట్టు అనుకోవచ్చు. మీరు సరిగా ప్రిపేర్ అవ్వకపోయినా సరే… ఎగ్జామ్ కి అటెండ్ అయితే… మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోడానికి ఓ అవకాశం దక్కుతుంది. మీరు ఏ సబ్జెక్టులో వీక్ గా ఉన్నారు… ఏ సబ్జెక్టుకు సంబంధించి ప్రశ్నలు రాయలేకపోయారు… లాంటివి గ్రహించుకొని… వాటి మీద నెక్ట్స్ రాయబోయే ఎగ్జామ్స్ లో దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది.

2) అనుమానాలపై విజయం సాధించండి

మనం ఎగ్జామ్ కి సరిగా ప్రిపేర్ అవ్వలేదు… గ్యారంటీలో ఫెయిల్ అవుతాం… అని భయం పెట్టుకోవడం వల్లే… చాలా మంది గ్రూప్ 3 రాయకుండా మానేశారు. కానీ ఎలాగూ మీకు రాదు అని తెలుసు… అయినా సరే… ఒక ఎగ్జామ్ రాయడం వల్ల మీకు ఒక experience ని gain చేసుకునేవాళ్ళు. ఇప్పుడు సరిగా రాయకపోయినా… నెక్ట్స్ ఎగ్జామ్ కి మీలో మరింత స్ఫూర్తిని నింపేది. నెక్ట్స్ ఎగ్జామ్ మరింత ఉత్సాహంతో రాయడానికి అవకాశం ఉండేది. అందుకే గ్రూప్ 2 రాయండి… మీకు ఎగ్జామ్ మజా ఏంటి అనేది తెలుస్తుంది.

3) ప్రాక్టీస్ మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది

ఎగ్జామ్ హాల్లో కూర్చొని పరీక్ష రాయడం అనేది విజయాన్ని సొంతం చేసుకోడానికి మీరు చేసే ప్రాక్టీస్ అనుకోండి. మీరు ముందు నుంచి మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు రాస్తే ఆ భయం అనేది ఉండేది కాదు. రియల్ ఎగ్జామ్ లో మరింత ఉత్సాహంగా రాసేవాళ్ళు. ప్రతి ఎగ్జామ్ ని కూడా మీరు సీరియస్ గా తీసుకొని రాస్తే… మీలో భయం, ఆందోళన లాంటివి పోయి… రాబోయే ఎగ్జామ్స్ ని మరింత ఉత్సాహంగా రాయడానికి ఛాన్స్ ఉంటుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అందుకే గ్రూప్ 2 ఛాన్స్ మిస్ చేసుకోవద్దు.

4) ప్రయత్నం చేయి… ఫలితం ఆలోచించవద్దు

మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడో చెప్పాడు… కర్మను చెయి… ఫలితాన్ని ఆశించకు అని… మనం ఫెయిల్ అవుతామేమో అని చేయాల్సి ప్రయత్నం… రాయాల్సిన ఎగ్జామ్ రాయకుండా మానేయకూడదు. మన ప్రయత్నం మనం చేయాలి… మనం ఎగ్జామ్ కి 100 percent effort ఎలా పెట్టాలి అన్నదానిపైనే concentration ఉండాలి… ఫలితం దానంతట అదే వస్తుంది. తక్కువ మార్కులు వస్తాయనీ… ఎక్కువ కాంపిటీషన్ ఉంటుందని… ఇలా ఏవేవో కారణాలతో ఎగ్జామ్ రాయడానికి మాత్రం వెనక్కి తగ్గద్దు. యుద్ధంలో విజయమో… వీర స్వర్గమో అంటారు… అలాగే ఏదైతే అదయింది… ప్రయత్నం చేయడంలో తప్పు లేదు కదా… ఎగ్జామ్ రాయడంలో కూడా అంతే అని గ్రహించండి.

5) ఇక గ్రూప్ 2 మీద దృష్టి పెట్టండి.

ఇప్పుడు మరో 20 రోజుల్లోనే… మరో పెద్ద opportunity… పెద్ద అవకాశం మీ ముందు ఉంది. డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్ 2 ఎగ్జామ్ జరగబోతోంది. మీరు గ్రూప్ 3 ని మిస్ చేయడం వల్ల నేర్చుకున్న గుణపాఠాలతో… గ్రూప్ 2 కి సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి. మీ strength, మీ commitment … మీరు కన్న కలలు నెరవేర్చుకోడానికి మరో అవకాశం దగ్గర్లోనే ఉందని గ్రహించండి. ఒక వేళ మీరు గ్రూప్ 2కి కూడా సరిగా ప్రిపేర్ అవలేదు… 2025 లో పడే ఎగ్జామ్స్ గురించి ఆలోచిద్దాంలే అనుకుంటున్నారా… అలాంటి పొరపాటు ఆలోచనలు ఎప్పుడూ చేయొద్దు… అప్పుడు పడే ఎగ్జామ్స్ అప్పుడు రాసుకోవచ్చు… ఇప్పుడు మీరు సరిగా ప్రిపేర్ అవ్వకపోయినా ఎగ్జామ్ కి మాత్రం అటెండ్ అవ్వండి. అందుకోసం మీకు ఇంకో ఐడియా చెబుతాను.

మీరు మన Telangana Exams Centre యాప్ లో నిర్వహిస్తున్న GROUP. 2 EXCELLENCE COURSE లో జాయిన్ అవ్వండి… మీకు గ్రూప్ 2 ఎగ్జామ్ లో మంచి performance ఇవ్వడానికి మంచి బూస్టింగ్ అయితే మన టెస్ట్ సిరీస్ ఇస్తుంది. ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. అలాగే గ్రూప్ 3 రాసిన వాళ్ళు మన వీడియోల్లో కరెంట్ అఫైర్స్ బాగా కలిశాయి అని మెస్సేజ్ పెట్టారు. మనం 1) Lesson wise Mock Tests, 2) Daily Tests, 3) Marathon Tests, 4) Grand Tests ఇచ్చాం. ఇప్పుడు గ్రూప్ 2 వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఇవన్నీ ఇస్తున్నాం.

🎯TGPSC Group 2 కోర్సులో జాయిన్ కి లింక్ కోసం క్లిక్ చేయండి

చివరగా ఓ మాట
మీరు మిస్ చేసుకున్న ప్రతి ఎగ్జామ్ కూడా… మీ భవిష్యత్తులో అభివృద్ధి అనే డోర్స్ కి క్లోజ్ చేస్తుందని గ్రహించండి. భయ పడవద్దు… అనుమానాలు పెట్టుకోవద్దు… excuses చెప్పుకొని మిమ్మల్ని మీరు సముదాయించుకోవద్దు… ఎగ్జామ్ కి హాజరు అవడమే… మీ సక్సెస్ కి మొదటి స్టెప్… మిమ్మల్ని మీరు నమ్మండి… మీరేంటో నిరూపించుకోడానికి ఎప్పుడూ కూడా అవకాశాలను వదులుకోవద్దు.

Hot this week

VRO/JRO Test series 2025

గతంలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లుగా పిలిచేవారు... ఇప్పుడు కొత్త ROR చట్టం...

TGSPC GROUP. 3 – New Power pack Series 2025 (EM & TM)

తెలంగాణ ప్రభుత్వం జనవరి లేదా ఫిబ్రవరి 2025 లో కొత్త జాబ్...

10 English vocabulary words -2

Here are 10 vocabulary words that are relevant for...

10 English vocabulary words

Of course! Here are 10 English vocabulary words that...

Group 2 Exam ముందు రోజు… ఎగ్జామ్ హాల్లో ఎలా ?

TGPSC గ్రూప్ 2 ఎగ్జామ్ కి ఇంకా ఎంతో టైమ్ లేదు. ...

Topics

VRO/JRO Test series 2025

గతంలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లుగా పిలిచేవారు... ఇప్పుడు కొత్త ROR చట్టం...

TGSPC GROUP. 3 – New Power pack Series 2025 (EM & TM)

తెలంగాణ ప్రభుత్వం జనవరి లేదా ఫిబ్రవరి 2025 లో కొత్త జాబ్...

10 English vocabulary words -2

Here are 10 vocabulary words that are relevant for...

10 English vocabulary words

Of course! Here are 10 English vocabulary words that...

Group 2 Exam ముందు రోజు… ఎగ్జామ్ హాల్లో ఎలా ?

TGPSC గ్రూప్ 2 ఎగ్జామ్ కి ఇంకా ఎంతో టైమ్ లేదు. ...

Group.3 ఫలితాలు లేట్ : 1,2 పోస్టుల భర్తీ తర్వాతే ….

తెలంగాణలో TGPSC గ్రూప్ 3 ఫలితాలు ఆలస్యంగా రిలీజ్ అవ్వనున్నాయి. మొదట...

బడుగు బలహీన వర్గాల సంక్షేమం, ప్రభుత్వ పథకాలు (pdf)

TGPSC, APPSC తో పాటు Central, State exams అన్నింటిలోనూ బడుగు...
spot_img

Related Articles

Popular Categories