ఇంజనీరింగ్ కి మ్యాథ్స్, ఫిజిక్స్ అక్కర్లేదు !

ఇంజనీరింగ్ కి మ్యాథ్స్, ఫిజిక్స్ అక్కర్లేదు !

B.E.,/B.Tech., లో ప్రవేశాలకు ఇకపై ఇంటర్మీడియట్ లో మ్యాథ్స్, ఫిజక్స్ చదవనక్కర్లేదని ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ( AICTE) స్పష్టం చేసింది. 2021-22 సంవత్సరంలో ఇంజినీరింగ్ టెక్నాలజీ కోర్సుల్లో చేరే విద్యార్థులకు ఈ నిబంధన ఎత్తివేసింది. వాటిని ఆప్షనల్ గానే పేర్కొంది. నిర్ధేశిత అర్హతల్లో ఏవైనా మూడు సబ్జెక్టులు చదివి ఉండాలని తెలిపింది. వాటితో పాటు ప్రవేశాల కోసం జాతీయ లేదా రాష్ట్ర స్థాయిలో జరిగే ప్రవేశ పరీక్షల్లో ర్యాంక్ సాధించాలి. అయితే ఈ అర్హతల విషయలో రాష్ట్ర ప్రభుత్వాలు లేదా యూనివర్సిటీలు తీసుకునే నిర్ణయమే ఫైనల్ అవుతుందని తెలిపింది.

గతంలో ఉన్న సబ్జెక్టులు ఏంటి ?

2020-21 విద్యా సంవత్సర వరకూ BE/B.Tech/B.Arch./Planning లాంటి కోర్సుల్లో చేరాలంటే విద్యార్థి తప్పనిసరిగా ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ లాంటి సబ్జెక్టులను చదివి ఉండాలి. వీటితో పాటు మరో సబ్జెక్ట్ కింద కెమిస్ట్రీ/బయోటెక్నాలజీ/బయాలజీ/టెక్నికల్ వొకేషనల్ సబ్జెక్ట్ / కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఇన్ ఫర్మాటిక్స్/అగ్రికల్చర్/ ఇంజినీరింగ్ గ్రాఫిక్స్/ బిజినస్ స్టడీస్ లాంటి సబ్జెక్టుల్లో ఏదో ఒకటి చదవాలి.

తాజా నిర్ణయం ఏంటి ?

ఇప్పుడు 2021-22 విద్యా సంవత్సరానికి BE/B.Tech., లో చేరాలంటే ఇంటర్మీడియట్ లో ఫిజిక్స్/మ్యాథమెటిక్స్/కెమిస్ట్రీ/బయోటెక్నాలజీ/బయాలజీ/టెక్నికల్ వొకేషనల్ సబ్జెక్ట్ / కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఇన్ ఫర్మాటిక్స్/ ఇంజినీరింగ్ గ్రాఫిక్స్/ బిజినెస్ స్టడీస్/ఎలక్ట్రానిక్స్/ఆర్కిటెక్చర్/ఆంట్రపెన్యూర్షిప్ లాంటి సబ్జెక్టుల్లో ఏ మూడు చదివినా నాలుగేళ్ళ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో కోర్సుల్లో జాయిన్ అవ్వొచ్చు.