నిరుద్యోగులకు శుభవార్త-కొత్త జోన్స్ కు కేంద్రం ఆమోదం.

నిరుద్యోగులకు శుభవార్త-కొత్త జోన్స్ కు కేంద్రం ఆమోదం.

రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాల భర్తీకి లైన్ క్లియర్ అయింది. తెలంగాణ లో కొత్త జోన్ల విధానానికి కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. మొదట 31 జిల్లాలకు గతంలోనే కేంద్రం ఆమోదం తెలిపింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 33 జిల్లాలతో జోనల్ విధానాన్ని రూపొందించింది. మొత్తం 33 జిల్లాలతో జోనల్ విధానం ఆమోదం కోసం 2019 లో కేంద్రానికి ప్రభుత్వం proposal పంపింది. దానికి ఆమోదం లభించడంతో రాష్ట్రంలో కొత్త ఉద్యోగాల భర్తీ ప్రక్రియ త్వరలోనే మొదలవనుంది.  అయితే ముందుగా అనుకున్నట్లుగా ఏప్రిల్ 3 వ వారంలో కాకుండా... మే నెలలో నోటిఫికేషన్లు పడే అవకాశం ఉంది. మే మొదటి వారం వరకు మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి నోటిఫికేషన్ల జారీ కి కొంత టైం పడుతుందని భావిస్తున్నారు.