వచ్చే ఏడాది నుంచి డిగ్రీలో కొత్త సిలబస్

వచ్చే ఏడాది నుంచి డిగ్రీలో కొత్త సిలబస్

తెలంగాణలోని డిగ్రీ కోర్సుల్లో కొత్త సిలబస్ రాబోతోంది. వచ్చే ఏడాది నుంచి డిగ్రీలోని బీకాం, బీఏల్లో కొత్త కరికులమ్ మొదలు పెడుతున్నట్టు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. బ్రిటీష్ కౌన్సిల్ తో పాటు భాగస్వామ్య యూనివర్సిటీల సహకారంతో ఈ కొత్త పాఠ్య ప్రణాళికను రెడీ చేస్తున్నారు. ఉన్నత విద్యలో ప్రపంచ స్థాయి నైపుణ్యాలను అందించి... విద్యార్థులకు ఉపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా ఈ కొత్త సిలబస్ ఉంటుంది... ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి చెప్పారు. బ్రిటిష్ కౌన్సిల్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య 2018లోనే ఒప్పందం కుదరింది. 2020లో యూకేకి చెందిన మరో 2 యూనివర్సిటీలతో MOU జరిగింది