NAL లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు – మే 20 వరకు దరఖాస్తు చేయవచ్చు
నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ (NAL) జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మే 20, 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీగా ఉన్న పోస్టులు:
- మొత్తం పోస్టులు: 26
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ – 21
- జూనియర్ స్టెనోగ్రాఫర్ – 5
అర్హతలు:
- అకడమిక్ అర్హతలు: పోస్టు ప్రకారం 10+2 లేదా దానికి సమానమైన అర్హత ఉండాలి.
- ఇతర నైపుణ్యాలు: కంప్యూటర్ టైపింగ్ మీద ప్రావీణ్యం తప్పనిసరి. అలాగే డీఓపీటీ మార్గదర్శకాలు ప్రకారం కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
వయోపరిమితి:
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: గరిష్ఠ వయస్సు 28 సంవత్సరాలు.
- జూనియర్ స్టెనోగ్రాఫర్: గరిష్ఠ వయస్సు 27 సంవత్సరాలు.
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు వయో మినహాయింపు ఉంటుంది.
ముఖ్య తేదీలు:
- దరఖాస్తు ప్రారంభ తేదీ: ఏప్రిల్ 16, 2025
- దరఖాస్తు చివరి తేదీ: మే 20, 2025
అప్లికేషన్ ఫీజు:
- జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు: రూ. 500
- ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళలు, ఎక్స్ సర్వీస్ మెన్లకు: ఫీజు మినహాయింపు
ఎంపిక విధానం:
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు:
- కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష
- కంప్యూటర్ టైపింగ్ స్కిల్ టెస్ట్
రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1లో మెరుగైన ప్రతిభ కనబరిచిన అభ్యర్థులను మాత్రమే పేపర్-2కు ఎంపిక చేస్తారు.
- జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు:
- రాత పరీక్ష
- స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్
పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి:
Read this also : ఆర్టీసీలో 3038 ఉద్యోగాలు ఏవంటే !
Read this also : 🏢 NPCILలో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ – మొత్తం 400 ఖాళీలు!