ముల్కీ రూల్స్ – గైర్ ముల్కీ ఉద్యమం- కోర్టు తీర్పులు (1971 1990)

1) ముల్కీ గైర్ ముల్కీ సమస్య ఏ కాలం నుండి ఉన్నది?
జ) బహమనీలు
2) ముల్కీ, గైర్ ముల్కీ సమస్య మొదట్లో ఎలా ఉండేది ?
జ) భాషాపరంగా దక్కనీ/అఫాకీ సమస్యగా
ఇస్లాం మతపరంగా సున్నీలు/షియాల సమస్యగా
3) ఆఫాకీలని ఎవర్ని పిలిచేవారు ? దక్కనీలు అంటే ఎవరు ?
జ) ఒకటో అహ్మద్ షా కాలంలో ఇరాన్, టర్కీ , అరేబియా నుంచి వచ్చిన వారు
4) బహమనీల కాలంలో స్థానికులు, స్థానికేతరులను ఏమని పిలిచేవారు ?
జ) స్థానికులను దక్కనీలు (సున్నీలు), స్థానికేతరలు ఆఫాకీలు (షియాలు)
5) అహ్మద్ షా కాలంలో సైన్యంలో పైపోస్టులు ఆఫాకీలకు, కింది పోస్టులు దక్కన్లకు ఇచ్చిందెవరు ?
జ: ప్రధాని ఖలఫ్ హసన్ బస్రీ
6) 5,6 వ నిజాంల కాలంలో 30 యేళ్ళ పాటు ప్రధానిగా పనిచేసిన వారెవరు ?
జ: మొదటి సాలార్ జంగ్
7) ఆలీఘడ్ యూనివర్సిటీ నుంచి ఉన్నత విద్యావంతులు, వృత్తి నిపుణులను హైదరాబాద్ కు తీసుకొచ్చింది ఎవరు ?
జ: మొదటి సాలార్ జంగ్
8) కాయస్థులు, ఖత్రీలు, బిల్ గ్రామ్, నక్వీ, మాధుర్, ఛటోపాధ్యాయ లాంటి ప్రముఖ వంశస్థులు ఎవరి కాలంలో హైదరాబాద్ కు వచ్చారు ?
జ: మొదటి సాలార్ జంగ్
9) ముల్కీ హక్కుల కోసం చర్యలు తీసుకున్నది ఎవరు?
జ) మీర్ మహబూబ్ ఆలీఖాన్,1888.
10) పార్శీకి బదులు ఉర్దూని అధికార భాషగా చేసిన నిజాం నవాబు ఎవరు ?
జ: మహబూబ్ అలీ ఖాన్ (6 వ నిజాం)
11) లఖ్నవీ, దక్కనీ ఉర్దూలకు తేడా ఏంటి ?
జ: లఖ్నవీ ఉర్దూ ( ఉత్తరభారతీయులు మాట్లాడేది), దక్కనీ ఉర్దూ హైదరాబాదీలు మాట్లాడేది
12) ఉస్మానియా యూనివర్సిటీ, కోర్టులు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ ఉర్దూ వాడుకలో ఉండేది ?
జ: లఖ్నవీ ఉర్దూ
13) నిజాం ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఎవరు స్థానికేతరులకు ఉన్నత పదవులు ఇచ్చాడు ?
జ: కాసన్ వాకర్
14) స్థానికులకు అండగా నిలిచిన ప్రధాని ఎవరు ?
జ: సర్ కిషన్ ప్రసాద్
15) ముల్కీ నిబంధనలకు వ్యతిరేకంగా స్థానికేతరులను ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమించింది ఎవరు?
జ) జె.ఎన్.చౌదరి, యమ్.కె.వెల్లోడి.
16) గైర్ ముల్కీ ఉద్యమం పెద్ద ఎత్తున ఎప్పుడు జరిగింది?
జ) 1952 సెప్టెంబర్ లో
17) స్టేట్ ఎలక్ట్ర్రిసిటీ కార్పొరేషన్ ను ఎవరు ఏర్పాటు చేశారు?
జ) నీలం సంజీవరెడ్డి,1959.
18) )జి.ఓ.36 పై స్టే ఎత్తివేయాలని సుప్రీంకోర్టులోఎప్పుడు రిట్ దాఖలు చేశారు?
జ) 1969 మార్చి 7.
19) న్యాయనిపుణుల సంఘానికి అధ్యక్షుడు ఎవరు?
జ) జస్టిస్ వాంఛూ.
20) ముల్కీ నిబంధనలు రాజ్యాంగపరమైనవే అని హైకోర్టు ఎప్పుడు తీర్పు ఇచ్చింది?
జ) 1970 డిసెంబర్ 9.
21) నిజాం కాలంలో ఎప్పుడెప్పుడు ముల్కీ ఫర్మానాలు వెలువడ్డాయి.?
జ: 1910, 1919, 1933ల్లో
22) 1919 ఫర్మానా ప్రకారం ఎన్ని సంవత్సరాలు హైదరాబాద్ లో ఉండి, తిరిగి వెనక్కి వెళ్ళాలని ఆలోచన లేనివాళ్ళని ముల్కీలుగా గుర్తించారు ?
జ: 15 యేళ్ళు
23) జమీయత్ రియా యామే నిజాం( నిజాం ప్రజల సంఘం) యొక్క నినాదాం ఏంటి ?
జ: హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్
24) నిజాం ప్రజల సంఘం అధ్యక్షుడు ఎవరు ?
జ: సర్ నిజామత్ జంగ్