ముల్కీ – గైర్ ముల్కీ సమస్యలు

1) ముల్కీ అనే పదానికి అర్థమేంటి ? ముల్కీ-గైర్ ముల్కీ సమస్య ఎప్పటి
నుంచి మొదలైంది ?
జ: ముల్కీ అనగా స్థానికుడు. ఈ సమస్య బహమనీల కాలం నుంచే
మొదలైంది.
2) దక్కనీలు, అఫాకీలుగా ఎవరిని వ్యవహరించేవారు?
జ) ముల్కీలు, గైర్ ముల్కీలు
3) అఫాకీలు, దక్కనీలు అంటే ఎవరు ?
జ: అఫాకీలంటే షియాలు, దక్కనీలు అంటే సున్నీలు
4) ముల్కీ, గైర్ ముల్కీ సమస్యలతో అంతమైన రాజ్యం ఏది ?
జ: బహమనీ రాజ్యం (క్రీ.శ.16వ శతాబ్దంలో)
5) కుతుబ్ షాహీ వంశాన్ని స్థాపించిన సుల్తాన్ కులీ కుతుబ్ షా..
హైదరాబాద్ సంస్థానంలో ఎవరికి ప్రాధాన్యత ఇచ్చారు ?
జ: ముల్కీలు (స్థానికులకు)
6) మొదటి సాలార్ జంగ్ తన పరిపాలనలో ఎవరికి ప్రాధాన్యత ఇచ్చాడు ?
జ: కాయస్తులు, ఖత్రీలు
7) సాలార్ జంగ్ తన పరిపాలనా సంస్కరణల్లో ఉపయోగపడేందుకు
ఎవరిని హైదరాబాద్ లో ఉద్యోగాల్లో నియమించాడు ?
జ: అలీగఢ్ విశ్వవిద్యాలయం నుంచి విద్యావంతులను రప్పించాడు
8) సాలార్ జంగ్ హయాంలో ఎక్కడెక్కడి నుంచి నాన్ ముల్కీలు
హైదరాబాద్ రాజ్యానికి వచ్చారు ?
జ: యూపీ, బెంగాల్, తమిళ నాడు నుంచి
9) ఉర్దూ అధికార భాష ఎప్పుడు అయింది ?
జ: 1880లో ఆరో నిజాం మహబూబ్ అలీ కాలంలో (అంతకుముందు
పర్షియన్ అధికార భాష)
10) హైదరాబాద్ సంస్థానంలో మొదటి ప్రజా ఉద్యమం చందా రైల్వే పథకం
ఉద్యమం. ఇది ఎప్పుడు ఎవరి కాలంలో జరిగింది ?
జ: 1883లో మీర్ మహబూబ్ అలీ ఖాన్ కాలంలో
11) ఏ ప్రధాని హయాంలో నాన్ ముల్కీల ప్రభావం విపరీతంగా పెరిగింది ?
ఆయన పదవిని కూడా కోల్పోవాల్సి వచ్చింది ?
జ: రెండో సాలరాజంగ్ (మీర్ లాయక్ అలీ)
12) హైదరాబాద్ సివిల్ లిస్ట్ ను ఎప్పుడు, ఎవరి హయాంలో
రూపొందించారు ?
జ: 1886లో మహబూబ్ అలీ ఖాన్ హయాంలో
13) హైదరాబాద్ సివిల్ లిస్ట్ ప్రకారం ముల్కీ, గైర్ ముల్కీల శాతం ఎంత ?
జ: ముల్కీలు: 52 శాతం(జీతాల ఖర్చు 42శాతం), నాన్ ముల్కీలు : 48
శాతం (జీతాల ఖర్చు : 58శాతం)
14) నిజాం కాలేజీ ఎప్పుడు స్థాపించారు ?
జ: 1887లో (స్థానికులకు ఉన్నత విద్య అందిస్తే..ముల్కీలకు ఉద్యోగ
అవకాశాలు కల్పించవచ్చనే ఉద్దేశ్యంతో మహబూబ్ అలీ ఖాన్ స్థాపించారు)
15) ముల్కీ రూల్స్ పై గెజిట్ (జరీదా) ఎప్పుడు రిలీజైంది ?
జ: 1888లో ( 1301 ఫసలీ ప్రకారం)
16) 1888లో వెలువడిన ఫర్మానా ప్రకారం స్థానికతకు ఎన్ని సంవత్సరాలు
నిర్ణయించారు ?
జ: 12యేళ్ళు ప్రభుత్వ ఉద్యోగం చేసి ఉండాలి లేదా 15 యేళ్ళు స్థిర
నివాసం
17) ముల్కీ హక్కుల పరిరక్షణకై పోరాడిన వ్యక్తి ఎవరు?
జ) మహారాజా సర్ కిషన్ ప్రసాద్.
18) ఎవరు చేపట్టిన నాన్ ముల్కీల నియామకాన్ని కిషన్ ప్రసాద్
వ్యతిరేకించారు ?
జ: 1901లో ఆర్థిక కార్యదర్శిగా పనిచేసిన కాసన్ వాకర్ (1912 వరకూ
ఈ పదవిలో కొనసాగాడు)
19) ప్రభుత్వ ఉద్యోగాల్లో నాన్ ముల్కీల నియామకాన్ని నిరసిస్తూ ఎవరికి
వ్యతిరేకంగా ఉర్దూలో కవిత వచ్చింది ?
జ: కాసన్ వాకర్ కి వ్యతిరేకంగా (ఉద్యోగుల ఉద్యమ గీతంగా ప్రసిద్ధి
పొందింది)
20) ఉస్మానియా యూనివర్సిటీలో (1918) ఏ భాషలో విద్యాబోధన
మొదలైంది ?
జ: ఉర్దూ భాషలో
21) దీవాన్ సాలార్జంగ్ కు సహాయకుడిగా నియమితులైన ఆలీగఢ్ ముస్లిం
యూనివర్సిటీ స్థాపకుడు ఎవరు ?
జ: సయ్యద్ అహ్మద్ ఖాన్
22) ఉత్తరప్రదేశ్ నుంచి నాన్ ముల్కీలను రిక్రూట్ చేయడంలో కీలకపాత్ర
పోషించిన సాలార్ జంగ్ సహాయకుడు ఎవరు ?
జ: అమీనుద్దీన్
23) ముల్కీలను ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమించాలని ఎవరి హయాంలో
ఆదేశాలు జారీఅయ్యాయి ?
జ: అఫ్జల్ ఉద్దౌలా (ఐదో నిజాం) (1968లో)
24) నోబుల్స్ (ప్రముఖుల) కుటుంబాల పిల్లల కోసం స్థాపించిన పాఠశాల,
కళాశాలలు ఏవి ?
జ: దార్ ఉల్ ఉలూమ్ ఓరియంటల్ కాలేజీలో (1856లో) (పంజాబ్
యూనివర్సిటీకి అనుబంధం), 1873లో మదర్సా ఆలియా స్కూల్
(ఇందులో ఇంగ్లీష్ మీడియం ఉండేది)
25) ఆర్థిక సంస్కరణల్లో భాగంగా సాలార్ జంగ్ కేంద్ర ముద్రణాలయాన్ని
ఎక్కడ ఏర్పాటు చేశారు ?
జ: హైదరాబాద్ లో
26) ముల్కీలు, గైర్ ముల్కీల తరపున ప్రచారం చేసిన పత్రికలు ఏవి ?
జ: హైదరాబాద్ రికార్డ్ (ముల్కీల తరపున), ఇలాహి బక్ష్ (నాన్ ముల్కీలు)
27) ఉర్దూని హైదరాబాద్ సంస్థాన అధికార భాషగా గుర్తిస్తూ ఎప్పుడు
ఎవరు ఆదేశాలిచ్చారు ?
జ: 1884 ఫిబ్రవరి21న రెండో సాలార్ జంగ్ ( మీర్ మహబూబ్ అలీ ఖాన్
కాలంలో)
28) హైదరాబాద్ సంస్థానంలో బీఏ పట్టా పొందిన తొలి హిందూ ముల్కీ
ఎవరు ?
జ: రాయ్ బాలముకుంద్ (1908లో హైకోర్టు జడ్జిగా నియమించారు)
29) ఉస్మానియా యూనివర్సిటీ ఎవరి సూచనతో ఏర్పాటు చేశారు ?
జ: 1918లో ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ సూచనతో
30) ఉత్తర భారతదేశానికి చెందిన వారు ఏ ఉర్దూని వాడేవారు ?
జ: లఖ్నవీ ఉర్దూ
31) ఉస్మానియా యూనివర్సిటీలో దక్కనీ ఉర్దూ, ముల్కీల రక్షణ కోసం
దక్కనీ జాతీయవాదం ను లేవనెత్తింది ఎవరు ?
జ: ఉర్దూ ప్రొఫెసర్ డాక్టర్ జోరే
32) 1930లో డాక్టర్ జోరే ఆధ్వర్యంలో ఏర్పాటైన గ్రంథాలయం పేరేంటి ?
జ: ఇదార-ఇ-అరబియాత్-ఇ-ఉర్దూ
33) 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రాజకీయ సంస్కరణల ఫర్మాన
తర్వాత దానిపై రిపోర్ట్ తయారు చేసింది ఎవరు ?
జ: రాయ్ బాలముకుంద్
34) హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్స్ సంస్థను ఏ సంవత్సరంలో ఏర్పాటు
చేశారు ?
జ: 1921లో (రాజకీయ సంస్కరణల కోసం)
35) నిజాం సంస్థాన్ లో సభలు, సమావేశాలు నిషేధించడానికి ఉద్దేశించిన ఫర్మానా ఏది ?
జ: గస్తీ నిషాన్ 53 సర్కిల్
36) గస్తీ రద్దుచేయాలని కోరుతూ వేసిన కమిటీకి ఎవరు నాయకత్వం వహించారు ?
జ: రామచంద్ర నాయక్
37) 1947 ఏప్రిల్ 27న ఫర్మాన్ ద్వారా స్థాపించిన కమిషన్ ఏది ?
జ: హైదరాబాద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
38) హైదరాబాద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎప్పుడు రద్దయింది ?
జ: 1948 సెప్టెంబర్ 17న (హైదరాబాద్ భారత్ యూనియన్ లో విలీనం అయినప్పుడు రద్దు చేశారు )
39) కానూన్ ఛా ముబారక్ పేరుతో రాజ్యాంగాన్ని ఎవరు అమల్లోకి తెచ్చారు ?
జ: మహబూబ్ అలీ ఖాన్ (6 వ నిజాం నవాబు)
40) 1919 ఫర్మానాలో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకే ప్రాధాన్యత ఇవ్వాలని ఎన్నో పేరాలో ఉంది ?
జ: 10 వ పేరా