DPT-25- మొగల్ సామ్రాజ్యం

1) మొగల్ సామ్రాజ్య స్థాపనకు దారితీసిన యుద్ధం ఏది ?
ఎ) చౌసా యుద్ధం
బి) మొదటి పానిపట్టు యుద్ధం
సి) రెండో పానిపట్టు యుద్ధం
డి) చునార్ యుద్ధం

2) మొగలుల ఆస్థాన భాష ఏది ?
ఎ) ఉర్దూ
బి) అరబిక్
సి) హిందీ
డి) పారశీక

3) మొగల్ రెవెన్యూ వ్యవస్థకు వెన్నెముకగా ఏది చెప్పవచ్చు ?
ఎ) ప్రాథమిక జమీందార్
బి) స్వయంపాలిత జమీందార్
సి) మధ్యస్థాయి జమీందార్
డి) ఎవరూ కాదు

4) మొగలుల కంటే ముందు ఢిల్లీని పాలించిన రాజుల వంశం ఏది ?
ఎ) తుగ్లక్
బి) లోడి
సి) ఖిల్జీ
డి) సయ్యద్

5) మొదటి పానిపట్టు యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది ?
ఎ) క్రీ.శ. 1526
బి) క్రీ.శ. 1528
సి) క్రీ.శ. 1556
డి) క్రీ.శ. 1527

6) మొగల్ వంశ స్థాపకుడు ఎవరు ?
ఎ) అక్బర్
బి) హుమాయున్
సి) షేర్షా
డి) బాబర్

7) ఏ మొగల్ చక్రవర్తి కాలంలో భారతదేశంలో పొగాకును ప్రవేశపెట్టారు ?
ఎ) అక్బర్
బి) షాజహాన్
సి) జహంగీర్
డి) హుమయూన్

8) బాబర్ ఏ యుద్ధంలో జిహాద్ ప్రకటించాడు ?
ఎ) చునార్ యుద్ధం
బి) కణ్వ యుద్ధం
సి) చౌసా యుద్ధం
డి) పైవేవి కావు

9) మొగల్ చక్రవర్తుల్లలో స్వర్ణయుగంగా ఎవరి కాలాన్ని చెబుతారు ?
ఎ) షాజహాన్
బి) జహంగీర్
సి) అక్బర్
డి) షేర్షా

10) మొగల్ సైన్యంలో అనేక దళాలున్నప్పటీకీ అత్యంత ప్రధాన దళంగా భావించబడినది ఏది ?
ఎ) అశ్వ దళం
బి) నౌక దళం
సి) ఫిరంగి దళం
డి) అశ్విక దళం

11) మొగలుల కాలంలో అద్దెకు తీసుకొని సాగుచేసే బయటి గ్రామాల రైతులను ఏమని పిలిచేవారు ?
ఎ) కచార్
బి) పొలాజ్
సి) పాహీలు
డి) పరౌతి

12) మొగల్ సామ్రాజ్యా స్థాపించింది ఎవరు ?
ఎ) షేర్షా
బి) బాబర్
సి) షాజహాన్
డి) హుమయూన్

13) మొగలుల బంగారు నాణెం ఏది ?
ఎ) మొహర్
బి) దినార్
సి) పణ
డి) రుఫియా

14) మొగల్ సామ్రజ్య రాజధానిని ఆగ్రా నుంచి ఢిల్లీకి మార్చింది ఎవరు ?
ఎ) జహంగీర్
బి) బాబర్
సి) షాజహాన్
డి) హుమయూన్

15) కాందహార్ ను మొగలులు ఎవరి కాలంలో కోల్పోయారు ?
ఎ) అక్బర్
బి) జహంగీర్
సి) ఔరంగజేబు
డి) షాజహాన్

16) బాబర్ యొక్క ఎన్నవ దాడిలో పానిపట్టు యుద్ధం జరిగింది ?
ఎ) 3వ దాడి
బి) 4వ దాడి
సి) 6వ దాడి
డి) 5వ దాడి

17) మొదటిసారిగా బాబర్ 1519లో భారతదేశంలో ఏ ప్రాంతంపై దాడి చేశాడు ?
ఎ) ఢిల్లీ
బి) లాహార్
సి) బీరా
డి) ఆగ్రా

18) మొగల్ సైనిక వ్యవస్థలో అత్యంత విశిష్ట స్థానం ఆక్రమించిన దళం ఏది ?
ఎ) దాఖలీ దళం
బి) ఫిరంగి దళం
సి) అశ్విక దళం
డి) అఘాదీ దళం

19) మొదటిసారిగా పాలరాయిని ఏ మొగల్ చక్రవర్తి సమాధిలో ఉపయోగించారు ?
ఎ) హుమయూన్
బి) అక్బర్
సి) షేర్షా
డి) బాబర్

20) భారతదేశంలో మొగల్ సామ్రాజ్య నిజమైన స్థాపకుడు ఎవరు ?
ఎ) షేర్షా
బి) షాజహాన్
సి) బాబర్
డి) అక్బర్

21) మొగలుల కాలంలో ప్రధానమంత్రి ఎవరు ?
ఎ) దివాన్
బి) మీర్ బక్షి
సి) వకీల్
డి) ఎవరూ కాదు

22) మొగలు చక్రవర్తుల్లో ప్రముఖ చిత్రకారుడు ఎవరు ?
ఎ) షాజహాన్
బి) జహంగీర్
సి) బాబర్
డి) అక్బర్

23) మొగల్ అనే పదం దేని నుండి ఏర్పడింది ?
ఎ) అరబీ
బి) ఉర్దూ
సి) హిందీ
డి) మంగోల్

24) మొగలుల కాలంలో మత సంబంధ వ్యక్తులకు, పండితులకు ఇచ్చిన భూమి ఏది ?
ఎ) జాగీర్
బి) ఖలీసా
సి) మదద్-ఇ-మాష్
డి) ఖుద్ ఖాస్త్

25) మొగలుల కాలంలో ఉన్ని వస్త్రాలకు పేరుగాంచిన ప్రాంతమేది ?
ఎ) ముల్తాన్
బి) కాశ్మీర్
సి) మలబార్
డి) లాహోర్

note: జవాబులు 3.30 pm