తెలంగాణ రాష్ట్రం వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న అభ్యర్థులకు త్వరలో మంచి శుభవార్త అందనున్నది. గత సంవత్సరం నవంబర్ మరియు డిసెంబర్ నెలల్లో ఈ శాఖలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం పరీక్షలు నిర్వహించింది. ఇప్పుడు వాటి ఫలితాలు మే నెలలో విడుదల కానున్నాయి. మొత్తంగా 6,175 పోస్టులకు సంబంధించి పరీక్షలు నిర్వహించబడ్డాయి.
వివరాలు ఇలా ఉన్నాయి:
స్టాఫ్ నర్సుల పోస్టులు – 2,322 ఖాళీలు ఈ పోస్టులకు సంబంధించి పరీక్షలు పూర్తయ్యాయి.-ఫలితాలు మే 5న విడుదల కానున్నాయి.ఫార్మసిస్టు పోస్టులు – 732 ఖాళీలు ఈ పరీక్షల ఫలితాలను మే 12న విడుదల చేయనున్నారు.మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (Female) పోస్టులు – 1,931 ఖాళీలు
ఈ పోస్టులకు సంబంధించిన ఫలితాలు మే 19న విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ప్రక్రియతో ఆరోగ్య శాఖలో 6 వేలకి పైగా అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. ఫలితాల విడుదల అనంతరం నియామక ప్రక్రియ కొనసాగుతుంది. అభ్యర్థులు తమ ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలిస్తూ ఉండాలి.
ఇది నిరుద్యోగులకు ఒక గొప్ప అవకాశంగా చెప్పొచ్చు. మీరు దరఖాస్తు చేసిన పోస్టుకు అనుగుణంగా తగిన ప్రిపరేషన్ చేసుకుని, ఫలితాల తేదీలను గుర్తుపెట్టుకోండి.