Monday, September 23

MAY 2018 CA – TOP -60(2nd PART)

01) మహిళా సాధికారత కోసం UNDP ఏ నగరంలో స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ?
జ: హైదరాబాద్
02) ప్రమాదకరమైన ఎబోలా వైరస్ తీవ్ర ప్రభావంతో 19 మంది చనిపోయిన సంఘటన ఏ దేశంలో జరిగింది ?
జ: కాంగో
03) అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన పార్టీల్లో అధికారం చేపట్టడంపై గతంలో సుప్రీంకోర్టు వెలువరించిన రెండు కీలక తీర్పులు ఏవి ?
జ: S.R. బొమ్మై కేసు (1994), రామేశ్వర్ ప్రసాద్ (2005) కేసు
04) వృ‌త్తి లేదా వ్యాపారం ద్వారా ఆర్జించే లాభం కాకుండా ఇతర మార్గాల్లో వచ్చే ఆదాయ వివరాలు వెల్లడించేందుకు ఏ పేరుతో కొత్త ఫారమ్ ను ఆదాయం పన్ను శాఖ అందుబాటులోకి తెచ్చింది ?
జ: ITR -2
05) స్వచ్ఛ సర్వే క్షణ్ 2018 ర్యాంకుల్లో భాగంగా ఘన వ్యర్థాల నిర్వహణ నగరంలో మొదటి స్థానం ఏ సిటీకి దక్కింది ?
జ: హైదరాబాద్
06) జాతీయ స్థాయి ఉత్తమ పరిశుభ్ర నగరాలుగా ఏవి తొలి మూడు ర్యాంకులు దక్కించుకున్నాయి ?
జ: ఇండోర్, భోపాల్, చండీగఢ్
07) 37 మిలియన్ల మంది ( 3.7 కోట్లు )తో ప్రపంచంలోనే ఏ నగరం ప్రపంచంలోనే అతి పెద్దదిగా నిలిచింది ?
జ: టోక్యో (జపాన్ )
08) ధాన్యం కొనుగోళ్ళలో ఏ సంస్థను మరో నోడల్ ఏజెన్సీగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది ?
జ: తెలంగాణ రాష్ట్ర సహకార మార్క్ ఫెడ్
09) లలిత కళా అకాడమీ ఛైర్మన్ ఎవర్ని నియమిస్తూ కేంద్ర సాంస్కృతిక శాఖ ఆదేశాలిచ్చింది ?
జ: ఉత్తమ్ పాచర్ణే ( ప్రముఖ శిల్పి, కళాకారుడు. 1985లో ఈయన జాతీయ లలిత కళా అవార్డు గెలుచుకున్నారు)
10) రణతంబోర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది ?
జ: రాజస్థాన్
11) రాష్ట్రప్రభుత్వం తహసిల్దార్ కార్యాలయాల్లో సబ్ రిజిష్ట్రార్ సేవలు మొదట ఎక్కడ నుంచి అమల్లోకి వచ్చాయి ?
జ: వికారాబాద్ జిల్లా నవాబు పేట
12) తక్కువ నీటితో వరిని పండించడం, వరి ఉత్పాదకతను పెంచే లక్ష్యంతో జన్యు మార్పిడి వరిని కేంద్ర ప్రభుత్వ సహకారంతో ట్రయల్స్ గా (ఐపీటీ జన్యు టెక్నాలజీ) మన రాష్ట్రంలోని ఏ జిల్లాలో పండిస్తున్నారు ?
జ: నిజామాబాద్ జిల్లాలో
(నోట్: జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కౌన్సిల్, రివ్యూ కమిటీ ఆన్ జెనెటిక్ మానిప్యులేషన్ ఈ ట్రయల్స్ కోసం మహికో కంపెనీకి అనుమతి ఇచ్చాయి )
13) మహాత్మాగాంధీ జయంతి అయిన 2018 అక్టోబర్ 2నాడు (150వ జయంతి) శాకాహార దినోత్సవంగా పాటించాలని నిర్ణయించిన శాఖ ఏది ?

జ: రైల్వే శాఖ


14) 2018 మే 22న దళిత ఉద్యమ తెలంగాణ వైతాళికుడి 130వ జయంతిని నిర్వహించారు. ఆయన పేరేంటి?
జ: భాగ్యరెడ్డి వర్మ
15) నావికా సాగర్ పరిక్రమ పేరుతో ఎనిమిది నెలల్లో సాగరాలతో భూమిని చుట్టివచ్చిన ఆరుగురు సాహస వనితలు ఏ నౌకలో ప్రయాణించారు ?
జ: INSV తరిణి
16) భారత్, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన సూపర్ సోనిక్ వేగంతో దూసుకెళ్ళే క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ ను 2018 మే 21నాడు విజయవంతంగా ఎక్కడి నుంచి ప్రయోగించారు ?
జ: ఒడిశాలోని చాందీపూర్ లో
(నోట్: బ్రహ్మోస్ ను నేల, నింగి, సముద్రంపై నుంచి, సాగర గర్భం నుంచి ప్రయోగించవచ్చు. 290 మీటర్ల లక్ష్యాన్ని చేధించే ఈ క్షిపణి పరిధిని 400 కిమీకు పెంచారు. 800కిమీ పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.)
17) 018 జూన్ 1 నుంచి దేశంలోనే తొలిసారిగా ట్రాన్స్ జెండర్స్ (హిజ్రాలకు) కి కూడా వాహన డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది ?
జ: తెలంగాణ రాష్ట్రం
18) తెలంగాణ సాహిత్యాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో రాబోయే త్రైమాసిక పత్రిక ఏది ?
జ: పునాస
(నోట్: రాష్ట్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి )
19) ఫిక్షన్ సాహిత్యంలో 2018 మాన్ బుక్కర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ ఎవరు గెలుచుకున్నారు ?
జ: ఓల్గా టోకర్ చుక్
20) దేశంలో తొలి క్రీడ విశ్వవిద్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
జ: మణిపూర్ లో (ఇంఫాల్ వెస్ట్ లో )
21)ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క ఛైర్మన్ ఎవరు ? ప్రధాన కార్యాలయం ఎక్కడుంది ?
జ: డాక్టర్ గురు ప్రసాద్ మహోపాత్ర, ప్రధాన కార్యాలయం: న్యూ ఢిల్లీ
22) కాస్మిక్ రేడియేషన్ కారణంగా మెదడు దెబ్బతినకుండా ఏ పేరుతో కొత్త ఔషధాన్ని శాస్త్రవేత్తలు తయారు చేశారు ?
జ: PLX5622
23) ప్రపంచ ప్రఖ్యాత చిత్రోత్సవం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించిన తెలుగు సినిమా ఏది ?
జ: ఫ్రెండ్స్ ఇన్ లా
24) రెండో దశ రాష్ట్రీయ ఉచ్ఛతార్ శిక్షా అభియాన్ (రూసా) కింద ఉస్మానియా యూనివర్సిటీకి నాణ్యత, శ్రేష్టత విభాగంలో ఎంత మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది ?
జ: రూ.100 కోట్ల నిధి
(నోట్: తెలంగాణకి మొత్తం రూ.242 కోట్లను కేంద్రం మంజూరు చేసింది. ఇందులో కాకతీయ వర్సిటీకి రూ.50 కోట్లు కేటాయించింది )
25) అత్యాచార ఆరోపణలపై అరెస్ట్ అయిన హాలీవుడ్ నిర్మాత ఎవరు ?
జ: వీన్ స్టీన్
(నోట్: హాలీవుడ్ నిర్మాతల్లో దిగ్గజుడైన వీన్ స్టీన్ పై 80మంది నటీమణులు ఆరోపణలు చేశారు. దీంతో మీటూ ఉద్యమం మొదలైంది. అలాగే వీన్ స్టీన్ స్కామ్ లు బయటపెట్టినందుకు న్యూయార్క్ టైమ్స్ జర్నలిస్టులకు పులిట్జర్ బహుమతి కూడా లభించింది )
26) తెలంగాణలో వందేళ్ళ క్రితం అంతరించిన ఏ చిత్రకళకు గిరిజన సంక్షేమ శాఖ జీవం పోస్తోంది ?
జ: గోండు చిత్ర కళ
27) రాష్ట్రంలోని రైతులందరికీ ఒక్కొక్కరికి రూ.5లక్షల ప్రీమియం కట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం ఒక్కో రైతు పేరుతో LIC కి ఏడాదికి ఎంత ప్రీమియం కట్టనున్నారు ?
జ: రూ.2,271 లు
28) దేశంలో తీవ్ర వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రజలకు అలెర్ట్స్ పంపేందుకు ఏ టెలికం ప్రొవైడర్ తో భారత వాతావరణ శాఖ (IMD) ఒప్పందం కుదుర్చుకుంది ?
జ: BSNL
29) కోమా వ్యాధిని పూర్తిగా నిర్మూలించిన దేశంగా దేన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల గుర్తించింది ?
జ: నేపాల్
30) ఆరోగ్య సేవల సూచీలో భారత్ స్థానం ఎంత ?
జ: 145 వ స్థానం
(నోట్: 32 వ్యాధుల ఆధారంగా దీన్ని రూపొందించారు. )

SI/PC/VRO/GR.IV - 200 మాక్ టెస్టులు

ఎగ్జామ్స్ ముందు ప్రాక్టీస్ టెస్టులే కీలకం 

https://telanganaexams.com/mocktests/

ఈ లింక్ ద్వారా గూగుల్ ప్లే స్టోర్ నుంచి Telangana exams app ని డౌన్లోడ్ చేసుకోండి. 

https://play.google.com/store/apps/details?id=com.s2techno.telanganexams