Friday, September 20

MAY 2018 CA – TOP -60(1st PART)

01) వీర తెలంగాణ సాయుధ పోరాట యోధుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి స్మారక ఉపన్యాసం ప్రతి యేటా నిర్వహించాలని నిర్ణయించిన యూనివర్సిటీ ఏది ?
జ: నల్గొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం
02) వేసవి సెలవుల్లో విద్యార్థులకు స్వచ్ఛ్ భారత్ ఇంటర్నషిప్ 2018 మే 1 నుంచి ప్రారంభమైంది. ఎన్ని నెలల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది ?

జ: 3 నెలలు
03) 2018 సెప్టెంబర్ 3 నుంచి ప్రపంచ హిందూ కాంగ్రెస్ ను ఎక్కడ నిర్వహిస్తున్నారు ?

జ: షికాగో (అమెరికా)
04) పార్లమెంటు ప్రజా పద్దుల సంఘ్యం ( PAC) కి ఛైర్మన్ గా ఎవరు నియమితుయల్యారు ?

జ: మల్లికార్జున్ ఖర్గే
(నోట్: ప్రతిపక్ష నేతకు ఈ పదవి ఇస్తారు. ఇందులో 22మంది సభ్యులుగా ఉంటారు.)
05) పార్లమెంటరీ అంచనాల సంఘం ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: మురళీ మనోహర్ జోషి ( బీజేపీ సీనియర్ నేత)
(నోట్: ఇందులో 30మంది సభ్యులు ఉంటారు )
06) ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచ వాయు కాలుష్య నగరాల్లో ఢిల్లీకి ఎన్నో స్థానం దక్కింది ?

జ: మూడో స్థానం
(నోట్: ఢిల్లీలో గాలిలో ప్రతి 10 మైక్రో మీటర్లకు వార్షిక సగటున 292 మైక్రో గ్రాములు ధూళి ఉంది)
07) వృద్ధుల ఫించన్ కోసం కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పథకం ఏది ?

జ: ప్రధానమంత్రి వయ వందన్ యోజన (PMVVY)(నోట్: ఈ పథకంలో పెట్టుబడి పరిమితి గడువును 2020 మార్చి వరకూ పొడిగించారు )

08) 75 National Resource Centres కి చెందిన ఆన్ లైన్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలను ఒకే గూటి కిందకి తెస్తూ కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఏ పోర్టల్ ను ప్రారంభించింది ?

జ: స్వయం
09) దేశంలో నడుస్తున్న విమానాశ్రయాల్లో 100వది, సిక్కిం రాష్ట్రంలో మొదటి ఎయిర్ పోర్ట్ ను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు ?

జ: పాక్‌యాంగ్‌
10) కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడి విగ్రహం, శివలింగం, నాగకన్య, కుమారస్వామి విగ్రహాలతో పాటు ఆనాటి శిలాశాసనాలు ఎక్కడ బయటపడ్డాయి ?

జ: నల్లొండ జిల్లా నార్కెట్ పల్లి మండలం ఏపీ లింగోటం గ్రామంలో
11) పురాతన భారతీయ విజ్ఞాన శాస్త్రాలపై కొత్తగా సంధి పేరుతో కోర్సును ప్రారంభించిన ఐఐటీ ఏది ?
జ: ఐఐటీ -ఖ‌రగ్‌పుర్‌
12) ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గ్వాటెమాలా దేశంలో పర్యటనలో భాగంగా ఆ దేశాధ్యక్షుడితో సమావేశం అయ్యారు. ఆయన పేరేంటి ?
జ: జిమ్మీ మోరేల్స్
(నోట్: ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడి తొలి పర్యటన గ్వాటెమాలా దేశంనకు వెళ్లారు. )
13) హస్తకళల శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
జ: గుండ్లపోచంపల్లి అపారెల్ పార్కులో
14) మహిళలు వాహనాలు నడపొద్దంటూ 10యేళ్ళపాటు కొనసాగిన నిషేధాన్ని తొలగించిన అరబ్ కంట్రీ ఏది ?
జ: సౌదీ అరేబియా
15) దివ్యాంగులకు ఉపయోగపడే కృత్రిమ మేధస్సు ఆధారిత ఆవిష్కరణల ప్రోత్సాహానికి రూ.167.5 కోట్లతో AI for Accessibility కార్యక్రమాన్ని చేపట్టిన ఐటీ దిగ్గజం ఏది ?
జ: మైక్రో సాఫ్ట్
16) గిరిజన ప్రాంత జిల్లాల్లో వన్ ధన్ వికాస్ కేంద్రాలను స్థాపించాలని ఏ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది ?
జ: కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ
17) MSME ని విస్తరించండి ?
జ: Micro, Small and Medium Enterprises
18) ఢిల్లీలో ప్రధాన కార్యాలయం కలిగిన టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( TRAI) ఛైర్మన్ ఎవరు ?
జ: ఆర్. ఎస్ శర్మ
19) ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చిన వారిలో ప్రపంచంలోనే అత్యంత వయోధికుడిగా ఎవరు నిలిచారు ?
జ: మహాథిర్ మహమ్మద్ ( 92 యేళ్ళ వయసులో )
20) ప్రతియేటా మే 11న జాతీయ సాంకేతిక దినోత్సవం (నేషనల్ టెక్నాలజీ డే) గా నిర్వహిస్తారు. ఎందుకు ?
జ: 1998లో పోఖ్రాన్ లో రెండో అణు పరీక్ష నిర్వహించారు
(నోట్: ఈ పరీక్షకు ఆపరేషన్ శక్తి అని పేరు పెట్టారు )
21) దేశంలో 3,282 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తితో ఏ రాష్ట్రం రెండో స్థానంలో ఉంది ?
జ: తెలంగాణ
(నోట్: 3,657 మెగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యంతో కర్ణాటక రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది)
22) వృద్ధులైన తల్లిదండ్రుల యోగక్షేమాలు చూడకపోతే మూడు నుంచి 6 నెలల జైలు శిక్షకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం ఏ చట్టాన్ని సవరించాలని కేంద్ర సామాజిక, న్యాయ సాధికారత శాఖ ప్రతిపాదించింది ?
జ: తల్లిదండ్రులు, వృద్ధుల సంరక్షణ చట్టం - 2007
23) దక్షిణాఫ్రికాలోని ఓ రైల్వేస్టేషన్ లో గాంధీజీ అడుగుపెట్టి 2018 జూన్ 7 నాటికి 125యేళ్ళు పూర్తవుతాయి. ఈ సందర్బంగా ఆ రైల్వేస్టేషన్ ను ఖద్దరుతో అలంకరించనున్నారు. ఆ స్టేషన్ పేరేంటి ?
జ: పీటర్ మారిట్జ్ బర్గ్ రైల్వే స్టేషన్
(నోట్: ఈ రైల్వే స్టేషన్ లోనే గాంధీని బ్రిటీష్ అధికారి కోచ్ నుంచి దింపేశాడు )
24) వందేళ్ళ కింద లండన్ లో ఉన్నత చదువుల కోసం వెళ్లిన అంబేద్కర్ నివసించిన ఇంటిని స్మారక భవనంగా మార్చేందుకు బ్రిటీష్ ప్రభుత్వం అనుమతించింది. ఆ భవనం పేరేంటి ?
జ: ప్రైంరోజ్ హిల్ నంబర్ 10 ( కింగ్ హెన్రీ రోడ్ లో ఉంది )

25) మహిళల్ని ఆవిష్కర్తలుగా తీర్చి దిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వీ-హబ్ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ?
జ: నీతి ఆయోగ్ తో
26) దూలపల్లి లేదా ములుగు అటవీ పరిశోధనా కేంద్రంలో ఏ పరిశోధనా కేంద్రాన్ని కొత్తగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది ?
జ: వెదురు పరిశోధనా కేంద్రం ( బ్యాంబూ రిసెర్చ్ ట్రైనింగ్ సెంటర్ )
27) టైమ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ( THE) ఎమర్జింగ్ ఎకనామీస్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ లో 2018 సంవత్సరానికి నాలుగో ర్యాంకు దక్కించుకున్న ఐఐటీ ఏది ?
జ: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ
28) అణ్వస్త్రరహిత కొరియా సాధన కోసం ఈనెల 23-25 తేదీల్లో ఏ అణు పరీక్షా కేంద్రాన్ని ధ్వంసం చేస్తున్నట్టు ఉత్తరకొరియా ప్రకటించింది ?
జ: పుంగ్వే- రి కేంద్రం
29) విద్యా, ఉద్యోగాల్లో 2శాతం రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. అయితే ఎన్ని రకాల క్రీడలకు ఇవి వర్తిస్తాయి ?
జ: 29 క్రీడలు
30) 2016 టెక్నాలజీ లీడర్షిప్ అవార్డు అందుకున్న కేంద్ర రక్షణ మంత్రి సలహాదారు ఎవరు ?
జ: జి.సతీష్ రెడ్డి
(నోట్: మిస్సైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్ డైరక్టర్ జనరగల్ గా పనిచేస్తున్నారు )

SI/PC/VRO/GR.IV - 200 మాక్ టెస్టులు

ఎగ్జామ్స్ ముందు ప్రాక్టీస్ టెస్టులే కీలకం 

https://telanganaexams.com/mocktests/