ఉద్యోగాల భర్తీకి సీఎం మరోసారి హామీ

ఉద్యోగాల భర్తీకి సీఎం మరోసారి హామీ

రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ మరోసారి హామీ ఇచ్చారు. అసెంబ్లీలో ఇవాళ ఉద్యోగులకు PRC ప్రకటనలో భాగంగా మాట్లాడారు. ఉద్యోగులకు 30శాతం PRC ప్రకటించిన సీఎం, పదవీ విరమణ వయస్సును 61 సంవత్సరాలకు పెంచారు. ఇదే సమయంలో ఉద్యోగాల భర్తీకి మరోసారి హామీ ఇచ్చారు.

గతంలో చెప్పినట్టుగా ఉద్యోగాలు భర్తీ చేయడానికి ముందుగా... ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. అందులో భాగంగా ఇప్పటికే 80శాతం ప్రక్రియ పూర్తి చేసినట్టు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తెలిపారు. ఈ ప్రక్రియను వెంట వెంటనే పూర్తి చేసి... ఆ తర్వాత కొలువులకు నోటిఫికేషన్లు ఇస్తామని సీఎం ప్రకటించారు.

50 వేల కొలువుల కోసం రెడీ అవ్వండి

రాష్ట్ర ప్రభుత్వం 50 వేల కొలువులను భర్తీ చేయడం ఖాయం. ఇప్పటికే గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల కోడ్ కారణంగా ఉద్యోగుల ప్రమోషన్లు ప్రక్రియ ఆగిపోయింది. దాంతోపాటు... కొత్త కొలువుల భర్తీ కూడా నిలిచింది. ఇప్పుడు ఎన్నికల కోడ్ అయిపోవడంతో... తొందరగా ప్రమోషన్ల ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇది కాగానే వరుసగా నోటిఫికేషన్లు పడతాయి. ముందుగా పోలీస్ శాఖలోనే కొలువుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చే ఛాన్సుంది. ఆ తర్వాత మిగిలిన పోస్టులను భర్తీ చేయనున్నారు. మరోవైపు - TSPSC లో ఛైర్మన్, ఇతర సభ్యుల పోస్టులు ఖాళీ అయ్యాయి. ఒక్క మెంబర్ మాత్రమే ప్రస్తుతం ఉన్నారు. అందువల్ల TSPSC ఛైర్మన్, సభ్యుల భర్తీ ప్రక్రియను కూడా ప్రభుత్వం వెంటనే చేపట్టే అవకాశాలున్నాయి.
కొద్ది రోజుల్లో ఏకకాలంలోనే ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు పడే అవకాశాలున్నాయి. గతంలో ఇలాగే పోలీస్, గ్రూప్ 4, VROలు, విద్యుత్ శాఖలు... ఇలా అన్ని ఉద్యోగాలకు వెంట వెంటనే నోటిఫికేషన్లు పడటంతో అభ్యర్థులకు ఏది ప్రిపేర్ అవ్వాలో తెలియక గందరగోళంలో పడ్డారు. అందువల్ల ఇప్పుడు మీరు క్లారిటీగా నిర్ణయం తీసుకొని... TSPSC, పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ సిలబస్ ప్రకారం షెడ్యూల్ (సిలబస్ ఛార్ట్ ) వేసుకొని ప్రిపరేషన్ మొదలు పెట్టండి. గుర్తుంచుకోండి... ఖచ్చితంగా ప్రతి రోజూ మాక్ టెస్టులు రాసుకోండి. ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ టెస్టులు రాసుకోండి.

మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులతో కొలువులు సాధించండి

మన www.telanganaexams.com ఆధ్వర్యంలో Telangana Exams plus యాప్ లో మాక్ & గ్రాండ్ టెస్టులు కండక్ట్ చేస్తున్న సంగతి మీకు తెలిసిందే. వాటిల్లో జాయిన్ అవ్వండి. Telangana Exams plus యాప్ లో ఎప్పటికప్పుడు మా performance చూసుకొని... ఇంప్రూవ్ చేసుకోడానికి అవకాశం ఉంటుంది. మేము కూడా మీకు సలహాలు, సూచనలు అందిస్తాం. అలాగే మేం గతంలో తయారు చేసి సిలబస్ ఛార్ట్ ను మరోసారి వెబ్ సైట్ లో 23 మార్చి ఉదయం upload చేస్తాను. ఆ ఛార్ట్ లోని టాపిక్స్ తీసుకొని... మీరు ప్రత్యేకంగా టైమ్ టేబుల్ తయారు చేసుకోండి... ఇదే ఫాలో అవ్వాలని ఏమీ లేదు... మీరు ఇంపార్టెంట్ అనుకున్న వాటిని కూడా ఆ ఛార్ట్ లో యాడ్ చేసుకోండి.

మీ ప్రిపరేషన్ కోసం మరిన్ని వీడియోలను Telangana Exams Plus app మరియు Telangana Exams youtube channel లో అప్ లోడ్ చేస్తాం. యాప్ డౌన్లోడ్ చేసుకోండి... youtube channel ను subscribe చేసుకోగలరు.

ఆల్ ది బెస్ట్
విష్ణుకుమార్ ఎం. (సీనియర్ జర్నలిస్ట్, కంటెంట్ రైటర్ )

మీలో ఇంకా ఎవరైనా కోర్సుల్లో జాయిన్ అవ్వకపోతే... వెంటనే Telangana Exams plus యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని... అందులో store కు వెళ్ళి మీకు ఇష్టమైన కోర్స్ purchase చేయగలరు.

కోర్సుల పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి http://telanganaexams.com/telangana-jobs/

Telangana Exams Plus యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్ 

https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp

తెలంగాణ ఎగ్జామ్స్ YOUTUBE ఛానెల్ SUBSCRIBE చేయడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి
https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA?disable_polymer=true