Saturday, April 20

కరీం సార్.. భారతదేశ చరిత్ర.. ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం

(మెండెం కిరణ్ కుమార్, చైర్మన్ రైట్ ఛాయిస్ అకాడమీ)

మీరు తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులా..? పోటీ పరీక్షలకు సిద్ధమౌతున్నారా..? అయితే భారతదేశ చరిత్రకు సంబంధించి మీరు ఖచ్చితంగా చదవాల్సిన పుస్తకం.. కరీం సార్ రాసిన భారతదేశ చరిత్ర పుస్తకం. 20యేళ్ళకి పైగా సుదీర్ఘ భోదనానుభవం.. వందల మందిని ఐఏఎస్, ఐపీఎస్ అధికార్లుగా, వేల మందిని గ్రూప్స్ అధికారులుగా తీర్చిదిద్దిన నైపుణ్యం.. నిరంతర పరిశోధనాతత్వం.. ఇవన్నీ కలబోసి.. ప్రతి విద్యార్థికీ సులువుగా అర్ధమయ్యే శైలిలో... పోటీ పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించేలా రాసిన పుస్తకం ఇది.

నిరంతరం సంఘర్షించిన శక్తులలోంచి చరిత్ర పుట్టెను.. అంటాడు మహాకవి శ్రీశ్రీ.  ఒక్కమాటలో చరిత్ర గురించి చెప్పాలంటే.. గతం-వర్తమానాల మధ్య నిరంతరం జరిగే సంభాషణే చరిత్ర. ఈ పుస్తకంలో ఆదిమానవుడి రాతి పనిముట్ల నుంచి.. ఆధునిక మానవుడి దాకా సాగిన మానవ నాగరికత వికాసం కనిపిస్తుంది. ఈ పరిణామ క్రమంలో.. ఏర్పడిన ఆచారాలు, సాంప్రదాయాలు, జీవన విధానాలు, భిన్న సంస్కృతులు, విభిన్న నాగరికతలు, అస్తిత్వ పోరాటాలు, ఆధిపత్య ప్రదర్శనలు, ఒక్కటేమిటి ఇలా భారతదేశ చరిత్రలో.. ఉన్న వెలుగు చీకట్లను పూర్తిగా అధ్యయనం చేయాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే.

కరీం సార్ భారతదేశ చరిత్ర బుక్ హైలైట్స్:

  1. రచనా శైలి:

మిగతా చరిత్ర పుస్తకాలకు.. కరీం సార్ రాసిన భారతదేశచరిత్ర చాలా భిన్నం. ఇందులో ఉపయోగించిన రచనా శైలి కేవలం సమాచారం ఇస్తున్నట్లు ఉండదు. ఒక ఉపాధ్యయుడు మన ముందు నిల్చొని.. మనకు ఒక అందమైన కథ చెబుతున్నట్లుగా ఉంటుంది.

  1. అందమైన చారిత్రక చిత్రాలు:

విద్యార్థులకు సలువుగా అర్ధమయ్యేలా ప్రతి అధ్యాయంలో అందమైన చారిత్రక చిత్రాలను పొందుపర్చారు. వివిధ రకాల వాస్తు శిల్ప శైలులు – వాటి తారతమ్యాలు, చారిత్రక కట్టడాలు వాటి లక్షణాలు, ఇలా ప్రతి విషయానికి సంబంధించి కేవలం సమాచారం మాత్రమే అందించకుండా..విద్యార్థులు వాటిని చూసి అర్ధం చేసుకునేలా చిత్రాలు ముద్రించారు. అంతెందుకు ఇటీవల వార్తల్లో నిలిచిన రాణీ కీ వావ్ చిత్రం నుంచి.. మొఘలుల చిత్రకారులు వేసిన అద్భుతమైన పెయింటింగ్స్  దాకా.. ఈ పుస్తకంలో తప్పితే మరెక్కడా కనబడవు. అంతెందుకు కవర్ పేజీపై ముద్రించిన పద్మపాణి చిత్రం.. ఇటీవల సివిల్స్ అడిగిన ఒక ముఖ్యమైన ప్రశ్నకావడం విశేషం.

  1. సూక్ష్మంలో మోక్షం:

ఇప్పుడు పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే కావాల్సింది హార్డ్ వర్క్ కాదు.. స్మార్ట్ వర్క్. అందుకే విద్యార్థులకు ఎంతవరకు సమాచారం ఇవ్వాలి..? ఏయే అంశాలను పొందుపరచాలి అనే విషయంలో కరీం సార్ చాలా శ్రద్ధ తీసుకున్నారు. పోటీ పరీక్షల దృష్ట్యా తనకున్న అనుభవంతో కేవలం ముఖ్యమైన అంశాలను మాత్రమే పొందుపరచారు. ప్రతి అంశాన్ని సరళమైన శైలిలో వివరిస్తూ.. దీన్ని అధ్యయనం చేసిన ప్రతి విద్యార్థి ఎక్కువ మార్కులు సాధించేలా పుస్తకాన్ని రూపొందించారు.

  1. ముఖ్యమైన అంశాలు పట్టికల రూపంలో:

చరిత్రలో గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశాలన్నింటినీ పట్టికల రూపంలో అందించారు. దీనివల్ల.. విద్యార్థికి ఒకే సమయంలో చాలా విషయాలు అధ్యయనం చేసి సులువుగా గుర్తు పెట్టుకొనే వీలుంది.

  1. ముఖ్యమైన ప్రశ్నలు, పాత ప్రశ్నలు:

ప్రతి అధ్యాయం చివర్లో.. పరీక్షల్లో అడిగే అవకాశం ఉన్న ముఖ్యమైన ప్రశ్నలను , గతంలో అడిగిన ముఖ్య ప్రశ్నలను పొందుపరిచారు. ప్రశ్నలను కూడా ఇటీవలి పోటీ పరీక్షల సరళి దృష్ట్యా.. స్టేట్ మెంట్స్, జతపరచడాలుగా రూపొందించారు.

  1. ప్రతి ఒక్కరికీ ఉపయోగపడేలా:

కేవలం పోటీ పరీక్షలు రాసే వారే కాకుండా.. భారతదేశ చరిత్రను తెలుసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికీ ఉపయోగపడేలా ఈ పుస్తకం రాయడం జరిగింది. గృహిణులు తమ పిల్లలకు చరిత్రను వివరించాలన్నా.., ఉపాధ్యాయులు మరింత సమర్థవంతంగా చరిత్ర పాఠాలు చెప్పాలన్నా.., ఈ పుస్తకం చదవాల్సిందే. ఒక్క మాటలో చెప్పాలంటే.. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంట్లో ఉండాల్సిన .. ప్రతి ఒక్కరూ చదవాల్సిన భారతదేశ చరిత్ర పుస్తకం ఇది.

చివరగా ఒక మాట:

చాలా మంది విద్యార్థులు చరిత్ర అనగానే ముందుగా భయపడిపోతారు. సిలబస్ చాలా ఎక్కువ, పేర్లు, తేదీలు, సంవత్సరలు.. ఇలా చాలా చాలా విషయాలు గుర్తుంచుకోవాలని బెంబేలు పడిపోతారు. ఇవన్నీ అర్ధం పర్థం లేని భయాలు మాత్రమే. చరిత్రను ఒక క్రమపద్ధతిలో అధ్యయనం చేస్తే.. చరిత్ర అంత అందమైన.. సులువైన.. ఇష్టమైన సబ్జెక్ట్ మరొకటి ఉండదు. విద్యార్థికి కావాల్సిందల్లా.. చరిత్రపై కొంచెం ఇష్టం మాత్రమే. అందుకే ఈ పుస్తకాన్ని కరీం సార్.. ఒక చందమామ కథలాగా.. ప్రతి విద్యార్థి ఈజీగా అర్ధం చేసుకునేలా సరళమైన శైలిలో రాశారు.  అనవసరమైన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా.. ముఖ్యమైన విషయాలపై మాత్రమే ఫోకస్ చేశారు. యూపీఎస్సీ, తెలుగు రాష్ట్రాల సర్వీస్ కమీషన్లు నిర్వహిస్తున్న పోటీ పరీక్షల సరళికి అనుగుణంగా.. రాజకీయ అంశాలకన్నా .. సామాజిక, సాంస్కృతిక, కళా అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఈ పుస్తకం చదువుతున్నంతసేపు.. మీ ముందు ఒక వ్యక్తి నిల్చొని.. భారతదేశ చరిత్రను మీకు వివరించడమే కాదు.. మిమ్మల్ని ఆయా కాలాల్లోకి తీసుకువెళ్తారు కూడా. ఇంకెందుకు ఆలస్యం.. కాలం వదిలిన అందమైన గుర్తుల వెంట పయనిద్దాం రండి.

నోట్: కరీం సార్ రాసిన భారతదేశ చరిత్ర పుస్తకం తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి బుక్ స్టాల్ లో లభ్యమౌతుంది. లేదా ఈ అడ్రస్ లో సంప్రదించగలరు.

MAK PUBLICATIONS,

ASHOKNAGAR  X ROADS, HYD.

8497911315,8497941315