కాకతీయులు

1) వరంగల్ శాసనం ప్రకారం కాకతీయ వంశ మూలపురుషుడు ఎవరు?
జ: కాకర్త్యగుండన
2) ఓరుగల్లు పట్టణ నిర్మాత ఎవరు?
జ: మొదటి ప్రతాపరుద్రుడు
3) గణపతిదేవుడు రాజధానిని హనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చిన సంవత్సరం?
జ:క్రీ.శ.1254
4) మొదటి ప్రతాపరుద్రుడి కాలంలో శైవాన్ని ప్రచారం చేసి వ్యక్తి ఎవరు?
జ: మల్లికార్జున పండితుడు
5) సిద్దేశ్వర చరిత్ర ప్రకారం కాకతీయులు ఏ ప్రాంతానికి చెందినవారు?
జ: కందారు పురం
6) నిర్వచనోత్తర రామాయణం గ్రంధకర్త ఎవరు?
జ: తిక్కన సోమయాజి
7) మైలాంబ వేయించిన బయ్యారం చెరువు శాసనం ప్రకారం కాకతీయుల మూలపురుషుడు ఎవరు?
జ: వెన్న భూపతి
8) హనుమకొండలో సిద్దేశ్వరాలయం, పద్మాక్షి ఆలయం, స్వయంభు ఆలయాన్ని నిర్మించినవారు ఎవరు?
జ: రెండో ప్రోలరాజు
9) కేసరి సముద్రం, జగత్ కేసరి సముద్రం అనే చెరువులను తవ్వించిన కాకతీయ రాజు ఎవరు?
జ: మొదటి ప్రోలరాజు
10) హనుమకొండలోని వేయిస్తంభాల గుడిని నిర్మించినవారు ఎవరు?
జ: మొదటి ప్రతాపరుద్రుడు
11) తొలి కాకతీయులు ఆదరించిన మతం ఏది?
జ: జైన మతం
12) హనుమకొండలో కండలాలయి బసదిని నిర్మించినవారు ఎవరు?
జ: మైలమ
13) ప్రతాపరుద్రుడు 1182 పల్నాటి యుద్దంలో ఎవరికి సాయం చేసేవాడు?
జ: నలగామ రాజు
14) మొదటి ప్రతాపరుద్రుడు సంస్కృతంలో రాసిన గ్రంధం?
జ: నీతి సారం
15) ద్రాక్షరామ శాసనం ప్రకారం మొదటి ప్రతాప రుద్రుడి బిరుదు ఏంటి?
జ: వినయ భూషణుడు
16) కాకతీయులు మొదట ఎవరికి సామంతులు?
జ: రాష్ట్రకూటులు,కళ్యాణి చాళుక్యులకు
17) కాకతి అంటే ఏమిటి.?
జ: కూష్మాండము (గుమ్మడి)
18) రెండో బేతరాజు ఎవరి నుంచి శైవ దీక్ష తీసుకున్నారు?
జ: రామేశ్వర పండితుడు
19) గణపతిదేవుడు ఏ ప్రాంతంలో అభయ శాసనం వేయించాడు?
జ: మోటుపల్లి
20) బీదర్ కోట శాసనం ప్రకారం రుద్రమదేవి బిరుదు ఏంటి?
జ: రాయగజకేసరి
21) కాకతీయ రాజులందరిలో గొప్పవాడు?
జ: గణపతి దేవుడు
22) రుద్రమదేవి తన గురువు విశ్వేశ్వర శంభునకు దానంగా ఇచ్చిన గ్రామం ఏది?
జ: మందడ
23) శాతవాహనుల తర్వాత యావత్ ఆంధ్ర దేశాన్ని జయించి పాలించిన ఏకైక రాజు?
జ: గణపతిదేవుడు
24) ఏ శాసనం ప్రకారం క్రీ,శ.1289లో రుద్రమదేవి యుద్ధరంగంలో మరణించినట్టు తెలుస్తోంది?
జ:చందుపట్ల శాసనం
25) కాకతి అనే దేవతను కాకతీయులు పూజించడం వల్ల వారికి ఆ పేరు వచ్చిందని ఏ గ్రంథంలో ఉంది ?
జ: ప్రతాపరుద్ర యశోభూషణం
26) కాకతీయుల కాలంలో నాయంకర విధానాన్ని ప్రవేశపెట్టినవారు ఎవరు?
జ: గణపతిదేవుడు
27) తొలిసారి కాకతీయుల రాజ్యంపై దాడి చేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు?
జ: అల్లావుద్దీన్ ఖిల్లీ
28) కాకతీయుల కాలంలో ఓరుగల్లు ఏ పరిశ్రమకు ప్రసిద్ది చెందినది?.
జ: రత్న కంబళ్ళు
29) 1323లో రెండో ప్రతాపరుద్రుడిని ఓడించి బంధించిన డిల్లీ సుల్తాన్ ఎవరు?
జ: మహ్మద్ బిన్ తుగ్లక్
30) ఓరుగల్లు గురించి వర్ణించిన గ్రంధం ఏది?
జ: క్రీడాభిరామం
31) కాకతీయుల కాలంలో న్యాయ విషయాల్లో రాజుకు సలహాలు ఇవ్వడానికి నియమించుకున్న అధికారి ఎవరు?
జ: ప్రాడ్విచాకులు
32) రెండో ప్రతాపరుద్రుడిని మాలిక్ కాసర్ ఓడించిన సంవత్సరం?
జ:క్రీ.శ.1310
33) కాకతీయుల కాలంలో భూమి శిస్తును ఏమని పిలిచేవారు.
జ: అరి
34) కాకతీయుల కాలంనాటి ఏ గ్రంధం అప్పటి శిక్షల గురించి వివరిస్తుంది?
జ: విజ్నానేశ్వరీయం
35) ఓరుగల్లు ప్రాంతంలో సువాసనలు వెదజల్లే బియ్యం పండిస్తున్నట్లు వివరించినవారు ఎవరు?
జ: మార్క్ పోలో
36) కాకతీయుల కాలంలో రూకలు అంటే ఏమిటి?
జ: వెండినాణేలు
37) బాపట్ల శాసనం ప్రకారం ఒక మాడకు ఎన్ని రూకలు?
జ: 10
38) కాకతీయుల కాలంలో భూమిశిస్తు ఎంత?
జ: పండిన పంటలో 1/6వ వంతు
39) కాకతీయుల కాలంలో రాజును రక్షించే ప్రత్యేక అంగరక్షక దళంపేరు?
జ: లెంకలు
40) కాకతీయుల కాలంలో వేశ్యలపై విధించిన పన్ను ఏంటి?
జ: గణాఛారి పన్ను
41) కాకతీయుల నాణేల్లో అతి పెద్దది?
జ: గడాణ్యము
42) కాకతీయుల కాలంలో బంగారు నాణేలు?
జ: గడ్యాణము, మాడ ,నిష్కణము
43) శైవ ఆలయం,అనాధాశ్రమం,ఆరోగ్యశాఖ, విద్యాకేంద్రాలు ఒకే ప్రదేశంలో ఉంటే వాటిని ఏమంటారు ?
జ: గోళకి మఠాలు
44) కాకతి రుద్రుడు 1162లో వేయి స్తంభాల గుడిని ఏ పద్దతిలో నిర్మించారు?
జ: త్రికూట
45) పండితారాధ్య చరిత్ర, బసవ పురాణం, వృషాదివ శతకం రచయిత ఎవరు?
జ: పాల్కురికి సోమనాధుడు
46) కాకతీయుల కాలంలో చిత్రశాలను నిర్మించినవారు ఎవరు?
జ: మాచలదేవి
47) కాకతీయుల కాలంలో గొప్ప కాలాముఖ క్షేత్రం?
జ: అలంపురం
48) వినుకొండ వల్లభామాత్యుడు ఏ గ్రంధం ఆధారంగా క్రీడాభిరామాన్ని రచించాడు?
జ: ప్రేమాభిరామం
49) కాకతీయుల కాలంలో చాపకూడును ప్రారంభించినవారు ఎవరు?
జ: పల్నాటి బ్రహ్మనాయుడు
50) జాయపసేనాని రచనలు ఏమిటి?
జ: గీతరత్నావళి, నృత్యరత్నావళి, వాయిద్య రత్నావళి
51) కాకతీయుల కాలంలో సర్వసాధారణ వినోదం ఏంటి?
జ: తోలుబొమ్మలాట
52) ధర్మసాగర శాసనంలో పేర్కొన్న వాయిద్యం ఏది?
జ: జలకరండ
53) తెలుగు సాహిత్యంలో తలమానికమైన ద్విపద కావ్యం?
జ: రంగనాధ రామాయణం
54) కాకతీయుల కాలాన్ని ఎలా పిలుస్తారు?
జ: శూద్ర యుగం