Monday, September 23

JUNE 2018 – CA – TOP -60 (1st PART)

01) నీటిపారుదల ప్రయోజన కార్యక్రమం, ప్రతి పంటకు నీరు, తక్కువ నీటితో ఎక్కువ సాగు, వాటర్ షెడ్ల అభివృద్ధికి రూ.7190 కోట్ల కార్యాచరణ ప్రణాళికను రాష్ట్రస్థాయి మంజూరు కమిటీ ఆమోదించింది. ఏ పథకం కింద ఈ నిధులను కేటాయించారు ?
జ: ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన
02) 2018-19 సంవత్సరానికి ఎంతశాతం వృద్ధి రేటు నమోదవుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది ?
జ: 7.5శాతం
03) 2017-18 సంవత్సరంలో భారత తలసరి ఆదాయం ఎంతగా నమోదైంది ?
జ: రూ.1,12,835
(నోట్: 2016-17లో తలసరి ఆదాయం రూ.1,03,870. వృద్ధి రేటు 8.6శాతంగా నమోదైంది )
04) టైమ్స్ ప్రపంచ స్థాయి ఉన్నతవిద్యాసంస్థల ర్యాంకింగ్స్ - 2018 లో భారత్ నుంచి 100 స్థానాల్లో చోటు దక్కించుకున్న విద్యాసంసథ ఏది ?
జ: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ( IISC- బెంగళూరు )
05) టైమ్స్ ప్రపంచ విద్యా సంస్థల ర్యాంకింగ్స్ - 2018 లో మొదటి స్థానం దక్కించుకున్న సంస్థ ఏది ?
జ: హార్వర్డ్ విశ్వవిద్యాలయం (అమెరికా)
06) ఐటీ ఉత్పత్తుల్లో 2017-18 సంవత్సరంలో ఎంత శాతం వృద్ధి నమోదైనట్టు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు ?
జ: 9.32 శాతం వృద్ధి
(నోట్: జాతీయ సగటు వృద్ధి రేటు 7.9శాతం కంటే ఎక్కువ )
07) సైబర్ భద్రతను పటిష్టం చేసేందుకు నాస్కామ్ ఆధ్వర్యంలోని డాటా సెక్యూరిటీస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంస్థతో కలసి రాష్ట్ర ప్రభుత్వం ఏ సెంటర్ ను ఏర్పాటు చేసింది ?
జ: సైబర్ సెక్యూరిటీ - సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ( CEO)
08) భారత్ సహా 39 దేశల్లో ఏ ఇంజెక్షన్ కొరత ఉందని యాక్సెస్ అటు మెడిసిన్ ఫౌండేషన్ ప్రకటించింది ?
జ: పెన్సిలిన్
09) అన్నదానం చేస్తున్న ఆధ్యాత్మిక, దాతృత్వ సంస్థలకు GST, IGST భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకం ఏది ?
జ: సేవా భోజ్ యోజన
10) రైతులు కొత్త పద్దతులతో ఆదాయాన్ని పెంచుకునేందుకు ఉద్దేశించిన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దాని పేరేంటి ?
జ: కృషి కల్యాణ్ యోజన


11) మహిళలు, బాలిక సౌకర్యం కోసం అతి తక్కువ ధరకే రూ.2.50 శానిటరీ నాపికిన్ అందించాలని కేంద్రం ప్రభుత్వం నిర్ణయించింది. ఏ పథకం కింద వీటిని అందించనున్నారు ?
జ: ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన ( PMBJP)
12) 2022 కల్లా దేశంలో అందరికీ ఇళ్ళు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే కేంద్ర ప్రభుత్వ గృహ పథకం పేరేంటి ?
జ: ప్రధానమంత్రి ఆవాస్ యోజన
13) సౌర విద్యుత్ వాడకాన్ని ప్రోత్సహించేందుకు దేశంలోని రైతులకు 27.5 లక్షల సౌర విద్యుత్ మోటార్లను ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. జులై నుంచి అమల్లోకి రానున్న ఈ పథకం పేరేంటి ?
జ: కుసుమ్ పథకం
14) ఐక్యరాజ్యసమితిలో జనరల్ అసెంబ్లీకి అధ్యక్షురాలిగా నియమితులైన మహిళ ఎవరు ?
జ: మరియా ఫెర్నాండా ఎస్పినోస గార్బెస్
(నోట్: ఈక్వెడార్ విదేశాంగ మంత్రి. 70యేళ్ళ ఐరాస చరిత్రలో ఈ పదవి చేపట్టిన నాలుగో మహిళ )
15) దేశంలో సంక్షోభంలో చిక్కుకున్న చక్కెర మిల్లులను ఆదుకునేందుకు కేంద్రం ప్రభుత్వం ఎంత బెయిలౌట్ ప్రకటించింది ?
జ: రూ.8,500 కోట్లు
16) ప్రపంచ శాంతి సూచీ (పీస్ ఇండెక్స్) - 2018లో భారత్ స్థానం ఎంత ?
జ: 136 వ స్థానం
(నోట్: 2017- 137, 2016-141 స్థానాలు వచ్చాయి. ఇనిస్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ వార్షిక నివేదికలో ఈ ర్యాంకులు ఇచ్చారు )
17) ప్రపంచ శాంతి సూచీ (పీస్ ఇండెక్స్) - 2018లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన దేశాలు ఏవి ?
జ: ఐస్ లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రియా
18) మహిళలు తమని తాము రక్షించుకునేందుకు భద్రతా పరికరాన్ని తయారు చేసిన భారత యువ ఔత్సాహికుకు ఐక్యరాజ్యసమితి 1 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ ప్రకటించింది. దాని పేరేంటి ?
జ: ఉమెన్ సేఫ్టీ ఎక్స్ ప్రైజ్
(నోట్: దీన్ని భారత సంతతికి చెందిన అను, నవీన్ జైన్ ఎక్స్ ప్రైజ్ సంస్థతో కలసి తయారు చేశారు )
19) శీయ బోఫోర్స్ గా పిలిచే మొదటి భారతీయ దీర్ఘశ్రేణి శతఘ్ని తుది పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసుకొని సైనికుల అమ్ములపొదిలోకి వెళ్తోంది. దాని పేరేంటి ?
జ: ధనుష్
(నోట్: మొత్తం 414 ధనుష్ శతఘ్నులను గన్ క్యారేజ్ ఫ్యాక్టరీ సైన్యానికి అందజేయనుంది )
20) ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలికి తాత్కాలిక సభ్య దేశాల కోటాలో కొత్తగా ఎన్నికైన నాలుగు దేశాలు ఏవి ?
జ: డొమినికన్ రిపబ్లిక్, జర్మనీ, ఇండోనేషియా
21) 2018 లో హరితహారంలో ఎన్ని మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది ?
జ: 38.27 కోట్లు
22) తెలంగాణకు హరితహారం మొదటి కార్యక్రమాన్ని 2015 జులై 3న ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ ప్రారంభించారు ?
జ: చిల్కూరు ( మొయినాబాద్ మండలం, రంగారెడ్డి జిల్లా)
23) ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్ ను అమెరికా ఆవిష్కరించింది. దాని పేరేంటి ?
జ: సమిట్
24) 2018 ఆసియా కప్ ట్వంటీ 20 టోర్నమెంట్ ను గెలుచుకున్న జట్టు ఏది
జ: బంగ్లాదేశ్
17) 2018 ఫ్రెంచ్ ఓపెన్
25) దక్షిణ భారతదేశంలోనే మొదటిసారిగా ప్రభుత్వం వైద్య రంగంలో నేత్రనిధి ( ఐ బ్యాంక్ ) ను ఎక్కడ ఏర్పాటు చేశారు ?
జ: సరోజినీ దేవీ కంటి ఆస్పత్రి ( హైదరాబాద్ )

SI/PC/VRO/GR.IV - 200 మాక్ టెస్టులు

ఎగ్జామ్స్ ముందు ప్రాక్టీస్ టెస్టులే కీలకం 

https://telanganaexams.com/mocktests/