Sunday, January 20

జూనియర్ పంచాయతీ కార్యదర్శి నియామకాలపై స్టే

రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాల భర్తీపై హైకోర్టు స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. 9355 పోస్టుల భర్తీకి ప్రస్తుతం అన్ని జిల్లాల్లో ఎంపిక ప్రక్రియను జిల్లా కలెక్టర్లు నిర్వహిస్తున్నారు. అయితే ఫలితాల వెల్లడిలో అనేక తప్పులు దొర్లాయి. తక్కువ మార్కులు వచ్చిన వారికి (7 లేదా 8) కూడా ఉద్యోగాలు వచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా అక్రమాలు కూడా జరిగాయని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు.

జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఫలితాల్లో అక్రమాలు జరిగాయనీ, పారదర్శకత లోపించిందనీ ప్రక్రియను నిలిపివేయాలని కొందరు నిరుద్యోగులు హైకోర్టు ఆశ్రయించారు. దాంతో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వెల్లడయ్యే వరకూ నియామక ఉత్తర్వులు నిలిపివేయాలని ఆదేశించింది. రిక్రూట్ మెంట్ ప్రాసెస్ కొనసాగించవచ్చనీ.... కానీ నియామక పత్రాలు ఇవ్వరాదని కోర్టు ఆదేశించింది.