JEE MAINS (2023) పరీక్షల నిర్వహణపై సర్క్యులేట్ అవుతున్న ఫేక్ నోట్ నమ్మొద్దని కోరారు NTA అధికారులు. మొదటి విడత పరీక్ష వచ్చే జనవరిలో, తుది విడత ఏప్రిల్ లో నిర్వహిస్తున్నట్టు వస్తున్న వార్తలు కరెక్ట్ కాదన్నారు జాతీయ పరీక్షల సంస్థ (NTA) అధికారులు. JEE MAINS 2023 పరీక్షకు సంబంధించి తాము ఎలాంటి నోటీసులు విడుదల చేయలేదన్నారు. సోషల్ మీడియాలో ఫేక్ నోటీస్ ని నమ్మవద్దనీ… ఈ పరీక్షల అప్డేట్స్ అధికారిక వెబ్సైట్ లో పెడతామన్నారు. వచ్చే ఏడాది నుంచి రెండు విడతల్లోనే JEE MAIN పరీక్షను నిర్వహిస్తామని ఇప్పటికే అధికారులు తెలిపారు. 2023 జనవరి 18 నుంచి 23 వరకు మొదటి విడత పరీక్ష, ఏప్రిల్ 4 నుంచి 9 వరకు రెండో విడత పరీక్ష జరగనుందన్న సర్క్యులర్ కరెక్ట్ కాదన్నారు. తాము ఇప్పటి వరకూ ఎలాంటి తేదీలను నిర్ణయించలేదని తెలిపారు. దేశంలోని IIITలు, NITలు, ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో (BE/Btech/BArch.,) ప్రవేశాల కోసం NAT నిర్వహించే JEE మెయిన్ పరీక్షలకు దాదాపు 10లక్షల మంది విద్యార్థులు హాజరవుతారు.

Leave a Reply