JEE మెయిన్- 2023పై జాతీయ పరీక్షల సంస్థ (NTA) షెడ్యూల్ రిలీజ్ చేసింది. మొదటి విడత పరీక్షలను 2023 జనవరి 24 నుంచి, చివరి విడతను ఏప్రిల్ 6 నుంచి నిర్వహించనుంది. జనవరి పరీక్షకు దరఖాస్తులను జనవరి 12న రాత్రి 9 గంటల వరకు సమర్పించవచ్చు.

మొదటి విడత మెయిన్ పరీక్షలను జనవరి 24, 25, 27, 28, 29, 30, – 31 తేదీల్లో నిర్వహిస్తారు

చివరి విడత ఏప్రిల్ 6 నుంచి 12 వరకు నిర్వహిస్తారు.

మొదటి ఒకట్రెండు రోజులు B.Arch, బీ-ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు పేపర్ -2. మిగిలిన రోజుల్లో బీటెక్’ సీట్ల భర్తీకి పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. విద్యార్థులకు కేటాయించిన పరీక్ష కేంద్రాలను జనవరి రెండో వారంలో ప్రకటిస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు

తెలంగాణలో
హయత్ నగర్, హైదరాబాద్, జగిత్యాలు, జనగామ, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్, నల్లగొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట, వరంగల్

ఆంధ్రప్రదేశ్ లో
గుంటూరు, అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గూడూరు, కడప, కాకినాడ, కర్నూల్, మచిలీపట్నం, మంగళగిరి, నంద్యాల, నరసరావు పేట, నెల్లూరు, ఒంగోలు, పొద్దుటూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, సూరంపాలెం, తాడేపల్లి గూడెం, తణుకు, తిరుపతి, విజయవాడ, విశాఖ, విజయనగరం

పరీక్షలను తెలుగు, హిందీ, ఉర్దూ, English సహా మొత్తం 13 భాషాల్లో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రాన్ని ఇంగ్లీష్ తో పాటు అభ్యర్థులు కోరుకున్న Regional Languageలో ఇస్తారు.

పేపర్-1 300 మార్కులు

పేపర్-2 400 మార్కులు

పరీక్షలు రెండు Shifts లో ఉంటాయి. మొదటి షిప్ట్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 దాకా, రెండో షిప్ట్ సాయంత్రం 3 నుంచి 6 గంటల దాకా ఉంటుంది.
Computer based పరీక్షలు ఉంటాయి. B.Arch విద్యార్థులకు Offlineలో డ్రాయింగ్ పరీక్ష కూడా నిర్వహిస్తారు.
ఏమైనా సమస్యలు ఉంటే 011 40750000, 69227700 నంబర్లకు కాల్ చేయొచ్చు. www.jeemain @nta.ac.in కు మెయిల్ చేయొచ్చు. మిగతా సమాచారం కోసం http://www.jeemain.nta.nic.in వెబ్ సైట్ ను సందర్శించండి.

Leave a Reply