Freshers Jobs : ఈ ఏడాది బీటెక్, డిగ్రీ కంప్లీట్ చేసుకుంటున్న Freshers కి పండగే పండగ. ఈ ఏడాది IT లో భారీగా జాబ్స్ భర్తీ చేయబోతున్నాయి ప్రముఖ ఐటీ కంపెనీలు. TCS, Infosys, HCL, Wipro.. ఇలా అన్ని సంస్థలు భారీగా Freshers Recruitment కి సిద్ధమవుతున్నాయి.
Table of Contents
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మెల్లగా కోలుకుంటున్న వేళ భారతీయ ఐటీ పరిశ్రమ మంచి రోజులు వస్తున్నాయి. ఈమధ్య కాలంలో టెక్ కంపెనీల త్రైమాసిక ఫలితాల్లో దాదాపు అన్ని కంపెనీలు భారీగానే లాభాల్లో కొనసాగుతున్నట్టు చూపించాయి.
డిసెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను చూస్తే… టెక్ ఫ్రెషర్లకు, లేటరల్ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్న IT ఉద్యోగులకు రాబోయేది పండగ రోజులే అనిపిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో టాప్ టెక్ కంపెనీలైన TCS, Wipro, Infosys, HCL లాంటి సంస్థలు తమ ఉద్యోగుల సంఖ్యను పెద్దగా పెంచుకోలేదు. 2024లో అరకొరగానే Freshers కి అవకాశాలు ఇచ్చాయి. కానీ రాబోయే ఆర్థిక సంవత్సరంలో భారీగా ఉద్యోగులను నియమించుకోవటానికి సిద్ధంగా ఉన్నాయి. తమ త్రైమాసిక ఆర్థిక ఫలితాల సందర్భంగా దాదాపు అన్ని కంపెనీలు Freshers recruitment పై అప్ డేట్ ఇచ్చాయి.
IT industryలో రారాజు అయిన TATA గ్రూప్ కంపెనీ TCS ఈ ఏడాది Campus recruitment dives ద్వారా దాదాపు 40,000 మంది Freshersని హైర్ చేసుకోవాలని నిర్ణయించామని తెలిపింది. మరో టాప్ IT కంపెనీ Infosys కూడా 2025లో దాదాపు 20 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపింది. 2022లో ఆఫర్ లెటర్లు ఇచ్చి… ఉద్యోగాల్లోకి తీసుకోని వారిని కూడా గత అక్టోబర్ నెలలోనే రిక్రూట్ చేసుకుంది. అలాగే Wipro కూడా 10-12 వేల మంది ప్రెషర్లను నియమించుకుంటానని తెలిపింది. విప్రోలో కూడా 2022లో ఆఫర్ లెటర్లు పొందిన వారికి తాజాగా ట్రైనింగ్ స్టార్ట్ చేసింది. ఇవి కాకుండా 2025లో కొత్త రిక్రూట్ మెంట్ కి కూడా Wipro ప్లాన్ చేస్తోంది.
టాప్-5 టెక్ కంపెనీల్లో ఒకటైన HCL Technologies కూడా తమ కంపెనీ అవసరాల కోసం దాదాపు 7000 మంది IT Freshersని నియమించుకుంటున్నట్టు తెలిపింది.
టాప్ టెక్ IT కంపెనీలన్నీ కలిపి ఈ 2025లో 70,000 మంది Freshersని రిక్రూట్ చేసుకోడానికి రెడీ అవుతున్నాయి. వీటితో పాటు చిన్న, మధ్యతరహా టెక్ కంపెనీలు కూడా తమ ఉద్యోగుల సంఖ్యను పెంచుకునే అవకాశాలున్నాయి. దాంతో ఈ ఏడాది IT Freshers కి భారీగా ఉద్యోగాలు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి : 10thతో రైల్వేలో 32438 పోస్టులు
Telangana Exams -Whats Group Channel – CLICK below
ఎగ్జామ్స్ సెంటర్ CLICK HERE FOR TELEGRAM LINK
తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK
Subscribe తెలంగాణ ఎగ్జామ్స్ Channel : https://www.youtube.com/@TelanganaExams