ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ సబ్జెక్టులో వచ్చే విద్యా సంవత్సరం(2023-24) నుంచి 20 శాతం మార్కులు ప్రాక్టికల్స్ కు కేటాయిస్తున్నారు. మిగిలిన ఎగ్జామ్ 80 మార్పులకు ఉంటుంది. విద్యార్థులకు ఇంగ్లీష్ లో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేందుకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్స్ కూడా ఏర్పాటు చేస్తారు. ఇప్పటివరకు MEC, MPC గ్రూప్స్ విద్యార్థులకు మ్యాథ్స్ స్టాండర్డ్ ఒకే విధంగా ఉండేది. అయితే MPC కి ఉన్నంత హార్డ్ గా MEC విద్యార్థులకు ఉండాల్సిన అవసరం లేదని భావిస్తున్నారు. అందుకే కామర్స్ కు తగ్గట్టుగా సిలబస్ లో మార్పులు చేస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ సిలబస్ ను ఇంటర్ బోర్డు అమలు చేయనుంది.  ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో సిబ్బంది, విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరును ఈ విద్యా సంవత్సరమే అమలు చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు పాలకమండలి నిర్ణయించింది.

MPC గ్రూప్ సెకండియర్ మ్యాథ్స్-2బిలో ఎక్కువ మంది విద్యార్థులు తప్పుతున్నారు. సిలబస్ ఎక్కువతో పాటు కఠినంగా ఉందనే అభిప్రాయం ఉంది. అందుకే వచ్చే ఏడాది నుంచి కొంత వరకూ సిలబస్ తగ్గిస్తారు. అందుకోసం ప్రభుత్వం ఓ కమిటీని నియమిస్తోంది. NCERT సిలబస్ కు తగ్గట్టుగా నీట్, కామన్ లా అడ్మిషన్ టెస్టు(క్లాట్) పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా సిలబస్ రూపొందిస్తారు.
వచ్చే విద్యా సంవత్సరం (2023-24) ఇంటర్ ఫస్టియర్, 2024-25లో సెకండియర్ విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ సబ్జెక్టుల సిలబస్ మారుస్తారు. Moral Valuesకు సంబంధించిన పాఠాలకు ప్రియారిటీ ఇస్తారు. కామర్స్ ను ఇకపై కామర్స్ అండ్ అకౌంటెన్సీగా పిలుస్తారు. అంధులు, మూగ, చెవిటి విద్యార్థులకు ఇప్పటి దాకా పరీక్షల్లో అరగంట పాటు అదనపు టైమ్ ఇచ్చేవారు. ఇకపై దాన్ని గంటకు పెంచుతారు.

Leave a Reply