ఇంటర్ సెకండియర్ పరీక్షలు రద్దు

ఇంటర్ సెకండియర్ పరీక్షలు రద్దు

తెలంగాణలో ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలను రద్దు చేశారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి... విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష తర్వాత ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం పరీక్షలు నిర్వహించేందుకు అనువైన వాతావరణ లేకపోవడంతో ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్స్ రద్దు చేశామన్నారు. పరీక్షలు రాయాలి అనుకునేవారు ... అనకూలమైన వాతావరణ ఏర్పడిన తర్వాత దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఫలితాలను ఎలా ప్రకటించాలన్న దానిపై కమిటీ వేశామనీ... రెండు, మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటారని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇంటర్ ఫస్టియర్ మార్కుల ఆధారంగానే సెకండియర్ మార్కులు ప్రకటించే ఛాన్సుంది.